ఓ పెళ్లి పత్రిక 26 ఏళ్ల క్రితం చేసిన హత్య నిందితుడిని పట్టించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. భార్యపై అనుమానంతో 1998 అక్టోబర్ 2న కొడుకును హత్య చేసిన తిప్పేస్వామి గోతిలో పాతిపెట్టాడు. అనంతరం పారిపోయి తాను రెండో వివాహం చేసుకొని ఇద్దరు కుమార్తెలను కన్నాడు. ఇటీవల ఓ కుమార్తెకు వివాహం కుదిరింది. కర్ణాటకలోని దిన్నెహట్టిలో ఉండే స్నేహితుడు నాగరాజుకు పెళ్లి పత్రిక పంపాడు. పెళ్లి పత్రిక ఆధారంగా అప్పటి మర్డర్ కేసు పోలీసులు ఛేదించారు.