చైనాకు భారత్ షాకిచ్చింది. ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆదివారం ఆ 232 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 232 యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. అలాగే 94 లోన్ యాప్‌లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు తెలిపింది.
ఆరునెలలకు ముందే చైనా యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసింది. చైనా యాప్‌లల్లో లోన్ల పేరుతో కొన్ని వేధింపులకు గురిచేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా గూఢచర్యానికి కూడా ఆ యాప్‌లు కారణమైనట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే ఆ యాప్‌లపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. ఇండియాలో చాలా మంది లోన్ యాప్ ల వేధింపులకు బలైపోతున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంటోంది.