ఢిల్లీలోని సుప్రీంకోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చేలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.