SRPT: నాగారం మండలం ఈటూరు ఆవాసం ప్రగతి నగర్లో విద్యుత్ షాక్తో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంట గీత (50) తన ఇంటి ఆవరణలో ఉన్న పశువుల కొట్టంలో వైర్ ఫెయిల్ అయి ఒక్కసారే షార్ట్ సర్క్యూట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.