RR: తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు 3 తులాల బంగారం, రూ.40 వేలు దోచుకెళ్లిన ఘటన తలకొండపల్లి PS పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. చంద్రధన గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ ఆదివారం తన బంధువుల ఇంట్లో పూజకు వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.