ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. రంగపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి.. తన నలుగురు కూతుళ్లను చంపి ఆత్యహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.