సత్యసాయి: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఉనికి కోసం మంత్రి సవితపై ఆరోపణలు చేస్తున్నారని సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాముల విమర్శించారు. మంగళవారం పెనుకొండలో వారు మాట్లాడుతూ.. పెనుకొండలో అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పట్టించుకోలేదని, ఇప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు.
NTR: రెడ్డిగూడెంలో మంగళవారం ప్రజాదర్బారులో పలువురు రైతులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుని కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలన్నారు. రబీ ధాన్యాన్ని 3రోజుల వ్యవధిలోనే కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క కిలో కూడా తారం తీయవద్దని ఆదేశించారు.
అన్నమయ్య: నీటి సంరక్షణ మనందరి బాధ్యత అని ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ అన్నారు. మంగళవారం కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని రంగమ్మ చెరువులో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, కూటమి నాయకులతో కలసి చెరువులో పూజలు చేసి జల హారతి ఇచ్చారు. ప్రతి నీటి బొట్టునూ సంరక్షించి భవిష్యత్తు తరాలకు, రైతులకు భరోసా ఇద్దామన్నారు.
PPM: పాలకొండలోని పలు పెట్రోల్ బంకులను ఎమ్మెల్సీ విక్రాంత్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ.. ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ప్రజలకు కుంటి సాకులు చెబుతూ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే పరిస్థితి చక్కదిద్దాలన్నారు.
బాపట్ల నగరంలోని పెట్రోల్ బంకులను ఆర్డీవో గ్లోరి మంగళవారం తనిఖీ చేశారు. ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తే బంకులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇంధన కొరత వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెంలో ఎక్సైజ్ అధికారుల సమావేశం ఇవాళ జరిగింది. మద్యం నాణ్యతకు ‘సురక్ష’ యాప్ దిక్సూచిగా పనిచేస్తుందని జిల్లా ఎక్సైజ్ అధికారి బి. సుబ్బారావు తెలిపారు. మే 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అనంతరం మద్యం షాపులను తనిఖీ చేసి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి స్వయంగా పరిశీలించారు. భూ సర్వే పనులు పారదర్శకంగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆమె ఆదేశించారు. భూ వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, తదితరులు పాల్గొన్నారు.
KDP: నిరంతర పుస్తక పఠనం ద్వారానే విద్యార్థులు విజ్ఞానవంతులుగా మారి ఉజ్వల భవిష్యత్తును అందుకుంటారని MLC రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థలు సోషల్ మీడియాకు బానిసలై విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
NDL: డోన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి అక్రమంగా విక్రయించారని ఇవాళ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి, ఆమెను సర్వీస్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల సోమనాథ్ వద్ద 379 మద్యం సీసాలు పట్టుబడగా, వాటిని సీఐ అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు.
GNTR: మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ వకుల్ జిందాల్ చర్యలు చేపట్టారు. మంగళవారం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్స్పాట్లను పరిశీలించారు. కాజా, వెంకటాయపాలెం టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్లను పర్యవేక్షించారు. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ELR: డీజిల్ కృతిమ కొరత సృష్టించే బంక్ యజమానులపై కేసులు నమోదు చేయాలనీ కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. పట్టణంలో పలు పెట్రోల్ బంక్‌లను ఇవాళ అధికారులతో కలిసి పరిశీలించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కారణంగా ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారని దీని కారణంగా కొంతమంది కృత్రిమ సృష్టిస్తున్నారని వివరించారు.
సత్యసాయి: ఏబీఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. వార్తలు రాసినందుకు హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.
AKP: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 164 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నారు. వాటిలో మొత్తం పెట్రోల్ 6.74 లక్షల లీటర్లు, డీజిల్ 10.90 లక్షల లీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా సజావుగా జరుగుతున్నట్లు చెప్పారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన రావూరు పేరయ్య ట్రాన్స్ జెండర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. కందుకూరుకు చెందిన పొట్లూరు అంజయ్యతో రిలేషన్లో ఉండగా, నిన్న సోమవారం కందుకూరు వెళ్ళింది. మంగళవారం చనిపోయిందని చెప్పి అంజయ్య మృతదేహాన్ని కనిగిరి తీసుకువచ్చాడు. అంజయ్యపై పోలీస్ స్టేషన్లో పేరమ్మ సన్నిహితులు ఫిర్యాదు చేశారు.
CTR: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. మంగళవారం స్థానికులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. మొరంపల్లి, సుగాలిమిట్ట, ఏడూరు, రంగోలిమిట్ట, మీర్జేపల్లిలో కొత్త బోర్లు వేయాలని, లక్ష్మీనాయక్ తాండ, చదల్లలో బోరు డీప్నింగ్ చేయాలని కోరారు. స్పందించిన ఎంపీడీవో, నీటి సమస్య పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.