• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి: తోపుదుర్తి

ATP: రాష్ట్రంలో బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆదివారం జరిగిన ‘బీసీ గళం’ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగన్ హయాంలో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారని గుర్తు చేశారు.

April 26, 2026 / 06:37 PM IST

‘ఇంకుడు గుంతలతో జలాన్ని ఒడిసి పడదాం’

E.G: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని, తద్వారా భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రిలో నీటి సంరక్షణ కోసం ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

April 26, 2026 / 06:36 PM IST

PACS భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో PACS భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా KDCC ఛైర్మన్ నెట్టెం రఘురామ్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తితో హాజరై శంకుస్థాపన చేశారు. సహకార రంగం బలోపేతం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

April 26, 2026 / 06:35 PM IST

జిల్లాలో పుష్కలంగా ఇంధన నిల్వలు: కలెక్టర్

SS: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. రెవెన్యూ, పౌరసరఫరాల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 8.24 లక్షల లీటర్ల పెట్రోల్, 7.74 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బంకుల్లో క్యాన్లు, డ్రమ్ములకు ఇంధనం పోయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 26, 2026 / 06:35 PM IST

ఆదోనిలో బీజేపీలోకి చేరికలు

KRNL: ఆదోనిలో ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారధి సమక్షంలో ఇవాళ వైసీపీ నుంచి 30 కుటుంబాలు బిజెపిలో చేరాయి. హనవాలు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరికయ్యారు. బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

April 26, 2026 / 06:27 PM IST

జిల్లాలో టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్

అన్నమయ్య: జిల్లా టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్ ఆదేశించారు. మార్కెట్లలో 15 కిలోల క్రేట్లను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, హమాలీలు, లారీ సంఘాలు రైతుల నుంచి ఎలాంటి వసూళ్లు చేయరాదని హెచ్చరించారు. సీసీ కెమెరాలు, డిజిటల్ బోర్డులు, తాగునీరు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

April 26, 2026 / 06:24 PM IST

రేపు నూజివీడులో మీకోసం

KDP: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి సమస్య పరిష్కరిస్తామన్నారు.

April 26, 2026 / 06:16 PM IST

‘ఐటీడీఏ అస్తవ్యస్తంగా తయారైంది’

PPM: గత వైసిపి,ప్రస్తుత కూటమి పాలనలో పార్వతీపురం ITDA అస్తవ్యస్తంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు ఆరోపించారు. గత ఆరు ఏళ్లుగా ITDA పాలకవర్గ సమావేశం సైతం నిర్వహించకుండా పాలకులు గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమం, సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు.

April 26, 2026 / 06:15 PM IST

జిల్లాలో డీజిల్ కొరత లేదు

VZM: జిల్లాలో డీజిల్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ సరఫరాపై వీసీలో సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

April 26, 2026 / 06:14 PM IST

మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం

NDL: సంజామల మండలం మంగపల్లెలో నిర్వహించిన 67వ మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని నిర్వాహకుడు పి.మౌలాలి రెడ్డి ఆదివారం తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి నెల శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిపుణ వైద్యులు వివిధ వ్యాధులకు పరీక్షలు చేసి సుమారు 1,000 మందికి ఉచిత మందులు అందించారు. భోజన వసతి కూడా కల్పించారు.

April 26, 2026 / 06:10 PM IST

‘ పరిశ్రమల ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యం’

W.G: జిల్లాలో పరిశ్రమల స్థాపన ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా “ఇండస్ట్రియల్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబడిందని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మధ్యవర్తుల వద్దకు వెళ్లి అనవసరమైన కాలయాపన, ఖర్చులు చేయవద్దని సూచించారు.

April 26, 2026 / 06:10 PM IST

కపటి అభివృద్ధికి నిధులు కోరుతూ వినతి

KRNL: ఆదోని మండలం కపటి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇవాళ ఎమ్మెల్యే డా. పార్థసారధికి బీజేపీ ఆదోని మండల నాయకులు వినతి పత్రం అందించారు. బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల కోసం డిమాండ్ చేశారు. స్మశానవాటికల అభివృద్ధి కూడా చేపట్టాలని కోరారు. గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 26, 2026 / 06:08 PM IST

డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: జెసి

ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జేసి అభిషేక్ గౌడ అన్నారు. ఆదివారం ఆయన వివరాలు తెలిపారు. జిల్లాలో 232 పెట్రోల్ బంకులలో పెట్రోలు, డిజిల్స్‌కు సంబందించి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ధాన్యం లారీలకు డీజిల్ సమస్య ఉంటే స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో టోకెన్ ద్వారా అందిస్తున్నామన్నారు.

April 26, 2026 / 06:06 PM IST

APL వేలంలో జాక్‌పాట్.. జిల్లా జట్టుకు స్టార్ ప్లేయర్

NTR: ఏపీఎల్ సీజన్-5 వేలంలో ఉత్కంఠభరిత వాతావరణం మధ్య ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడ సన్‌రైజర్స్ జట్టులోకి పండురంగ రాజు పెన్మత్స అధికారికంగా ఎంపికయ్యాడు. రూ.9.50 లక్షలకు ఆయనను జట్టు దక్కించుకోవడం విశేషం. ప్రతిభావంతుడైన ఆటగాడిని జట్టులోకి ఆహ్వానించడం పట్ల ఫ్రాంచైజీ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది.

April 26, 2026 / 06:02 PM IST

ఎలుకల ముందు తిని వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం: ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన త్రిపురాంతకం(M) వెల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గత మూడు నెలలుగా నడుము నొప్పి ఎక్కువగా ఉండటం వలన నొప్పి తట్టుకోలేక 17వ తేదీ రాత్రి ఏలుకల పేస్టు తిని ఆత్మహత్యాయనికీ ప్రయత్నించాడు. ఇవాళ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 26, 2026 / 05:50 PM IST