• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈనెల 20 వరకు దరఖాస్తుల గడువు పెంపు

CTR: జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈనెల 20 కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో10 తేదీ వరకు ఆరవ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందినట్టు ఆయన వెల్లడించారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 12, 2026 / 10:02 AM IST

సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు.

April 12, 2026 / 09:45 AM IST

బండి మహంకాళి విగ్రహ ప్రతిష్ట‌లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్

VZM : గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో నూతనంగా నిర్మించిన బండి మహంకాళి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మంత్రి శ్రీనివాస్ హోమంలో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

April 12, 2026 / 09:44 AM IST

ఈనెల 17న నెల్లూరు RTC బస్టాండ్లో వేలం

NLR: ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా చాలామంది పార్శిళ్లు పంపిస్తుంటారు. ఇందులో చాలా వస్తువులను కొందరు ఇప్పటికీ తీసుకోలేదు. వీటికి బహిరంగ వేలం వేస్తామని నెల్లూరు లాజిస్టిక్స్ మేనేజర్ కామాక్షి తెలిపారు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు నెల్లూరు బస్టాండ్ ప్రాంగణంలో వేలం జరుగుతుందన్నారు. ఆధార్, పాన్ కార్డు తీసుకురావాలని సూచించారు.

April 12, 2026 / 09:43 AM IST

పోలేరమ్మను ప్రార్థించిన మంత్రి దుర్గేష్

E.G: నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం తెలిపారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ఆకాంక్షించారు.

April 12, 2026 / 09:35 AM IST

కొండవాగుల నీటితో గిరిజనుల వేసవి వరి సాగు

PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతుల్లో వేసవి వరి పంటను పండిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొండవాగుల నుంచి వచ్చే సహజ జలాలను వినియోగిస్తూ నీటి కొరత మధ్య కూడా పంటలను సాగు చేస్తున్నారు. కష్టపడే తత్వం, ప్రకృతితో అనుసంధానం గల జీవన విధానం గిరిజనుల ప్రత్యేకతగా నిలుస్తోంది. వారి కృషితో పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్నాయి.

April 12, 2026 / 09:33 AM IST

నేడు కుడమలూరులో అంకాలమ్మ తిరునాలు

KDP: ఒంటిమిట్ట మండలంలోని కుడమలూరులో ఇవాళ అంకాలమ్మ తిరునాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ వివరించింది. గ్రామానికి బంధువులు, మిత్రులు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది.

April 12, 2026 / 09:30 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జిల్లాలో 442 మందికి శిక్షలు

మార్చి ఒకటో తేదీ నుంచి 31 వరకు పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో 442 మంది మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. వారిని ఆయా న్యాయస్థానాల ముందు హాజరపరచగా 312 మందికి జరిమానాలు, 130 కేసుల్లో జైలు శిక్షలు విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

April 12, 2026 / 09:30 AM IST

రూ. 20 లక్షల మోసం.. కేసు నమోదు

AKP: రాజకోడూరుకు చెందిన వ్యక్తి వద్ద రూ.20 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశ్‌నగర్‌కు చెందిన కర్రి వెంకటరమణ వద్ద బైలపూడి సన్యాసిరావు, వెంకటరమణ, గణేష్ డబ్బు తీసుకుని వడ్డీతో చెల్లిస్తామని చెప్పి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

April 12, 2026 / 09:28 AM IST

బొబ్బిలి డీఎస్పీగా గోవిందరావు

VZM: రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. అందులో భాగంగా విజయనగరం టౌన్ ఇంచార్జ్ డీఎస్పీ, దిశా డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్.గోవిందరావును బొబ్బిలి డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు అదే స్థానంలో విధులు నిర్వహించిన భవ్యారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో చీపురుపల్లి డీఎస్పీగా పనిచేస్తున్న రాఘవులును బొబ్బిలి ఇంచార్జ్ డీఎస్పీగా వ్యవహరించారు.

April 12, 2026 / 09:26 AM IST

రేపు జాల్లాలో PGRS: కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ డా. ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.

April 12, 2026 / 09:23 AM IST

కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తులసి దళార్చన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముగ్గురు ఉభయ దాతలు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​పూజ అనంతరం ఆలయ అర్చకులు దాతలకు తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.

April 12, 2026 / 09:17 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండల టీడీపీ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ.34 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న అందజేశాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 12, 2026 / 09:12 AM IST

మాంసం ప్రియులకు ఊరట.. తగ్గిన ధరలు

SKLM: జిల్లాలో మాంసం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. చికెన్ ధరలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం స్కిన్‌‌తో కూడిన చికెన్ కేజీ రూ.213, స్కిన్‌ లెస్ చికెన్ రూ.243గా ఉంది. నాటుకోడి రూ.700, పొట్టేలు మాంసం రూ.1000కి విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు. 

April 12, 2026 / 09:11 AM IST

ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పుల్లయ్యకు చెందిన ఆవు అస్వస్థతకు గురైంది. కడుపు ఉబ్బి మూర్ఛపోవడంతో పశుసంవర్ధక శాఖ ఏడీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌లో ఆవు కడుపు నుంచి సుమారు 100 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించినట్లు వైద్యులు తెలిపారు. సమయానికి చికిత్సతో ఆవు ప్రాణాలు కాపాడడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

April 12, 2026 / 09:11 AM IST