• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అనుమతులు లేకుండా పుస్తకాల విక్రయం: SFI

NTR: జగ్గయ్యపేటలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా పుస్తకాల విక్రయం పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని SFI ఆరోపించింది. ఫీజు నియంత్రణ చట్టానికి విరుద్ధంగా అదనపు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు వినతిపత్రం అందజేసిన ఎస్‌ఎఫ్‌ఐ, స్పందన లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.

May 30, 2026 / 07:08 PM IST

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

అన్నమయ్య: టీడీపీ నాయకుడు చప్పిడి మహేష్ నాయుడు జన్మదిన వేడుకలు శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చప్పిడి సోదరుల నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం మహేష్ నాయుడితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

May 30, 2026 / 07:07 PM IST

పాత గొడవలతో హత్యాయత్నం.. నలుగురు అరెస్ట్

TPT: పుత్తూరు మండలం చిన్నరాజుకుప్పంలో వై. ప్రసాద్ నాయుడుపై జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్‌ఐ బి. వెంకటలక్ష్మి తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే రాజేంద్ర (38), రవి (36), సంతోష్ (20), నరేశ్ (39) ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

May 30, 2026 / 07:07 PM IST

వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి నియోజకవర్గ వ్యవసాయశాఖ అధికారులతో ఇవాళ బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన సమీక్ష నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వబోయే ఎరువుల కార్డుపై కొందరు రైతులకు ఉన్న అనుమానాలను తొలగించేలా నాలుగు మండలాల AOలు ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.. అలానే ఈ-పంట నమోదు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు.

May 30, 2026 / 07:05 PM IST

విశాఖ పోలీసుకు అరుదైన గుర్తింపు

VSP: ద్వారక పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వి. త్రినాధ్ బీసీసీఐ నిర్వహించిన క్రికెట్ కోచింగ్ లెవల్-0 కోర్సులో 97 మార్కులు సాధించి లెవల్-1 కోర్సుకు అర్హత పొందారు. ఏపీ పోలీస్ శాఖ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అండర్-15లో ఒకసారి, అండర్-19లో రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

May 30, 2026 / 07:03 PM IST

‘పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం’

PPM: పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా NCD అధికారి డా.టి జగన్మోహన్ రావు అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పొగాకు ఆకర్షణకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పొగాకు సేవించేవారు అనారోగ్య కారణాలకు గురవుతున్నారని తెలిపారు.

May 30, 2026 / 07:02 PM IST

జూన్ 1నుంచి పర్యావరణం పై అవగాహన

SKLM: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1 నుంచి 5 వరకూ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యావరణం పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.

May 30, 2026 / 07:01 PM IST

ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కోనసీమ: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి హరిప్రసాద్ శనివారం కోరారు. 25-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషులు దీనికి అర్హులని తెలిపారు. మంచి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో చూడాలన్నారు.

May 30, 2026 / 07:00 PM IST

తిరుపతమ్మ అమ్మవారి హుండీ ఆదాయం వివరాలు

NTR: జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 60 రోజుల హుండీ ఆదాయం రూ. 91.95 లక్షలు నమోదైంది. హుండీ లెక్కింపులో 25 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. అలాగే అమెరికా, లండన్, బ్రెజిల్, లిబియా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

May 30, 2026 / 06:44 PM IST

జలధార-జలహారతి పనులపై కలెక్టర్ సమీక్ష

ELR: జలధార- జలహారతి పనులపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాల్వలు, చెరువుల్లో కనీసం 2 అడుగుల మేర పూడికతీత చేపట్టాలని పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. జూన్ 15 లోపు మంజూరైన పనులన్నింటినీ పూర్తి చేసి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు.

May 30, 2026 / 06:43 PM IST

‘రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయట్లేదు’

కోనసీమ: జిల్లాలోని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబీ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. రాజోలు మండలంలో 200 మంది రైతులకు చెందిన 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ పూర్తయిందన్న నెపంతో కొనడం లేదన్నారు. పక్క జిల్లాల నుంచైనా ధాన్యం కొనుగోలుకి అనుమతి ఇవ్వాలని జేసీని కోరినట్లు తెలిపారు.

May 30, 2026 / 06:40 PM IST

మెరైన్ ఫిష్ సీడ్ విడుదల చేసిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం జీరుపాలెం సముద్ర తీరంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మెరైన్ ఫిష్ సీడ్ లాంచింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సముద్రపు చేప పిల్లలను విడుదల చేశారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించి వలసలు నివారిస్తామన్నారు.

May 30, 2026 / 06:40 PM IST

ఉపాధి కూలీలకు పలు అంశాలపై అవగాహన

VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి, ములకల గుమడాం గ్రామాల్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు శనివారం ఉపాధి కూలీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళ సాధికారత, సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణ మహిళా చట్టాలపై గజపతినగరం CI ఎస్.సన్యాసినాయుడు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో SI కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

May 30, 2026 / 06:40 PM IST

పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు: ఎస్పీ

W.G: పోలీసు విభాగంలో సుదీర్ఘ కాలం పాటు చిత్తశుద్ధితో సేవలందించి పదవీ విరమణ పొందిన 11 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు.  పాలకోడేరు (M) గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి జ్ఞాపికలను అందజేశారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

May 30, 2026 / 06:39 PM IST

బ్రాండిక్స్ కంపెనీని సందర్శించిన కేంద్రమంత్రి

AKP: అచ్యుతాపురం సెజ్‌లోని ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థ ‘బ్రాండిక్స్’ ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం సందర్శించారు. సంస్థలో జరుగుతున్న వస్త్ర ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల ప్రక్రియను బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్, భారతీయ భాగస్వామి దొరస్వామి మంత్రికి క్షుణ్ణంగా వివరించారు.

May 30, 2026 / 06:37 PM IST