• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోలార్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే థామస్ తెలిపారు. జీడీ నెల్లూరు ఎస్సీ కాలనీలో కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి సోమవారం ఆయన పథకాన్ని ప్రారంభించారు. సుమారు 5 వేల మంది లబ్ధిదారులకు రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో దీనిని అమలు చేస్తున్నామని వెల్లడించారు.

April 13, 2026 / 10:17 AM IST

‘నవ నారసింహ క్షేత్రాల’ సైకిల్ యాత్ర

W.G: పాలకొల్లుకు చెందిన మరుధూరి నర్సింహాచార్యులు, బొచ్చు రవికుమార్ ‘నవ నారసింహ క్షేత్రాల’ సైకిల్ యాత్రకు బయలుదేరారు. ఇవాళ ఉదయం శ్రీ దాసోహ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. 20 రోజులపాటు 1800 కి.మీ. ఈ యాత్ర సాగనుందని, మంగళగిరి, వేదాద్రి, పెంచలకోన, అహోబిలం, కదిరి, ధర్మపురి, యాదగిరిగుట్ట నారసింహ క్షేత్రాలు దర్శించుకుంటామన్నారు.

April 13, 2026 / 10:13 AM IST

సాలూరు బీజేపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా హేమానాయక్

PPM: సాలూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా డాక్టర్ హేమా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్ భాజపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. పార్టీ అభి వృద్ధికి కృషి చేస్తానని, కూటమి పాలనలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని హేమానాయక్ అన్నారు.

April 13, 2026 / 10:11 AM IST

వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్: ఏఈ

NDL: కోవెలకుంట్ల మండల పరిధిలో వివిధ సబ్ స్టేషన్‌లలో వ్యవసాయ రంగానికి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏఈ రామమోహన్ తెలిపారు. కొప్పర్ల, ఆమడాల, కలుగొట్ల, హరివరం వంటి పలు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

April 13, 2026 / 10:08 AM IST

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పర్యటనపై సమీక్షించిన కలెక్టర్, ఈ నెల 15న జరిగే కార్యక్రమం విజయవంతం కావాలంటే శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

April 13, 2026 / 10:05 AM IST

జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో విజేత కైలాసపట్నం జట్టు

AKP: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో కైలాసపట్నం జట్టు విజేతగా నిలిచింది. అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో 16 టీమ్స్ పాల్గొన్నాయి. కైలాసపట్నం జట్టు ప్రథమ స్థానం దక్కించుకోగా, ఏటికొప్పాకకు ద్వితీయ స్థానం, చింతపల్లి జట్టు మూడో స్థానంలో నిలిచింది.

April 13, 2026 / 10:04 AM IST

మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు

VZM: జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనువాసరావుకి నెల్లిమర్ల నియోజకవర్గ TDP నేతలు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం రామతీర్థం విచ్చేసిన కొండపల్లి శ్రీనివాసరావుకి ఏపీ మార్కెఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, నాయకులు సువ్వాడ రవిశేఖర్, TDP మండల అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ దుశ్సాలువ కప్పి పుష్పగుచ్చుం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

April 13, 2026 / 10:03 AM IST

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

బాపట్ల: కొరిశపాడు మండలం మెదరమెట్లలోని ఒంగోలు రోడ్డు నందు సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సును రాంగ్ రూట్‌లో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలిపోగా బస్సులో ఉన్న కొప్పెరపాడుకు చెందిన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే దేవ కుమారి అనే మహిళకు గాయాలు అయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

April 13, 2026 / 10:03 AM IST

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

NLR: సైదాపురం మండలం ఊటుకూరు పరిధిలోని ఆదూరుపల్లి ఎస్టీ కాలనీ తోటలో ఆదివారం రాత్రి భార్యపై భర్త దాడి చేసిన ఘటన నెలకొంది. భార్యపై అనుమానంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో భర్త కత్తితో భార్య మెడపై దాడి చేశాడు. భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108 ద్వారా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 13, 2026 / 10:00 AM IST

ANU అవకతవకలపై విచారణ నివేదిక విడుదలలో జాప్యం

GNT: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ సాగినా స్పష్టత లేదు. నిధుల వినియోగం, నియామకాలలో అక్రమాల ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. విజిలెన్స్ నివేదిక విడుదల కాకపోవడంతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చర్యలు లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

April 13, 2026 / 10:00 AM IST

కేతగాని చెరువులో ఉపాధి కూలీల నిరసన

సత్యసాయి: సోమందేపల్లి మండలం కేతగాని చెరువు గ్రామంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ ఫేస్ యాప్ ఫోటో‌ను వ్యతిరేకిస్తూ మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వాలని, కూలీలకు పని ముట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

April 13, 2026 / 09:58 AM IST

MVIల జాయింట్ సెక్రటరీగా క్రాంతికుమార్

NDL: ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్స్ జాయింట్ సెక్రటరీగా ఆదివారం డోన్‌ ఎంవిఐ క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ పదవితో MVIల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.

April 13, 2026 / 09:54 AM IST

చెస్ పోటీలకు రతన్ తేజ్ ఎంపిక

ATP: తాడిపత్రికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు రతన్ తేజ్ రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-9 క్రీడా పోటీలలో విజేతగా నిలిచి సత్తా చాటినట్లు కోచ్ సురేంద్రనాథ్ పేర్కొన్నారు. తన కుమారుడు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల తండ్రి శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు.

April 13, 2026 / 09:47 AM IST

‘ఆస్తి పన్ను చెల్లించండి’

EG:రాజమండ్రి లాలాచెరువు ఆస్తి యజమానులు అడ్వాన్స్ ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగానే చెల్లిస్తే రాయితీలు లభిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉదయం10:30గంటలకు నుండి లాలా చెరువు -2 సచివాలయంలో ప్రాపర్టీ టాక్స్ 2026-27 పాత బకాయిలు వడ్డీపై50% రాయితీ పొందవచ్చన్నారు

April 13, 2026 / 09:38 AM IST

‘రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుసుకోండి’

NLR: కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, మహిళా నేతలు వేమూరి రాధాకృష్ణపై పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీశాయని, జర్నలిజం విలువలను దిగజార్చాయని పేర్కొన్నారు.

April 13, 2026 / 09:35 AM IST