NLR: కొండాపురం మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీ రెండేళ్ల నుంచి మూసివేశారు. దీని వలన విశ్రాంత ఉద్యోగులకు, పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని సోమవారం బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేస్తూ.. గతంలో ఎంతో ఉపయోగంగా ఉండే లైబ్రరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్ కరుటూరి శ్రీరామమూర్తి, పంచాయతీ ప్రత్యేక అధికారితో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనుగోలు జరుగుతాయని హామీ ఇచ్చారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ నగర్ 7వ లైన్‌లో సీసీ రోడ్డు, డ్రైన్స్ నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
PLD: వినుకొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఆఫీసులోని 1వ సచివాలయం, ఓబయ్య కాలనీలోని సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్ కార్డు నమోదు, మార్పులు చేయించుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు జగన్‌కు మావిగన్ గుర్తుకు రాలేదా, అమరావతి చట్టబద్దత ఓర్వలేకే మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
NTR: అంగన్వాడీ టీచర్ కుటుంబానికి తోటి అంగన్వాడీ టీచర్లు భరోసా కల్పించారు. తిరువూరు పట్టణానికి చెందిన అంగన్వాడీ టీచర్ కృపావరం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విస్సన్నపేట, ఏ. కొండూరు, తిరువూరు మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు కొంత నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
VZM: వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం, అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న బస్టాప్‌లో మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఇవాళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదచారులకు 200 ఉచిత మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు త్యాడ వేణుగోపాలం, గండ్రేటి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
కడప 15వ డివిజన్ పరిధిలోని పుట్లంపల్లి చెరువు కట్ట వద్ద రూ. 1.35 కోట్లతో 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి సోమవారం భూమిపూజ నిర్వహించారు. నాణ్యమైన రోడ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు.
NDL: ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొని భూ సమస్యలు, ఆన్‌లైన్ సంబంధిత ఫిర్యాదులను స్వీకరించారు. పలువురు ప్రజలు తమ వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు పాల్గొన్నారు.
KRNL: ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పెయింటింగ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నేతలు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. విగ్రహం పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఈరన్న, చిన్ని ప్రసాద్, వీరేష్ డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ATP: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్‌తో కలిసి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి కలిశారు. రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు చట్టరూపం దాల్చడంతో మంత్రి లోకేశ్‌తో కలిసి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వారు వివరించారు.
సత్యసాయి: మహిళలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ను మంత్రి సత్యకుమార్ యాదవ్ బత్తలపల్లిలో వర్చువల్‌గా వీక్షించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. కుటుంబాన్ని నడిపించే మహిళ సమాజాన్ని కూడా ప్రగతి పథంలో నడిపించగలదని తెలిపారు.
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 41వ డివిజన్ శివగిరి కాలనీ, పరమేశ్వరి నగర్ ప్రాంతాలలో సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైను కాలువల నిర్మాణ పనుల నాణ్యతను కమిషనర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
NDL: నంద్యాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను సోమవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్‌తో పాటు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు.
GNTR: కేంద్ర ఉక్కు గనుల శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరును వేగవంతం చేయాలని, ప్రక్రియను మరింత సరళీకరించడంపై చర్చించారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.