TPT: గూడూరు మండలం చవటపాలెం గ్రామంలో ఇవాళ ఉదయం రూరల్ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని తొమ్మిది మోటార్ సైకిళ్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తుంటే తమకు తెలియజేయాలని స్థానికులను ఆయన కోరారు. నేర ప్రవృత్తి మానుకోవాలని రౌడీషీటర్లకు ఆయన హెచ్చరించారు.
NDL: బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఇవాళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బార్బర్ షాపు పూర్తిగా దగ్ధమైపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని మంటలను ఆర్పి వేశారు. బార్బర్ షాపు మంటల్లో కాలిపోవడంతో బాధితుడు నాగ సురేంద్ర ఆవేదన చెందాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.
PLD: వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన టీడీపీ నాయకుడు వెలిశెట్టి బాల వెంకయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యసాయి: YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలలో నియమించారు. మడకశిరకు చెందిన జీఎస్ రంజిత్ కుమార్, కదిరికి చెందిన దేశాయ్ భక్తవత్సల రెడ్డి, యనమల ఆనంద్ రెడ్డి, పుట్టపర్తికి చెందిన టీడీ కేశవరెడ్డి, బి. మాధవరెడ్డి, పొరెడ్డి వెంకటరెడ్డి, ఎస్. రామిరెడ్డిలకు వివిధ హోదాల్లో చోటు లభించింది.
TPT: రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రామం-ఒక నెల-నాలుగు పర్యాయాలు కార్యక్రమం ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తిరుపతి అర్బన్ మండల పరిధి తుడా క్వార్టర్స్ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని గత 4 శుక్రవారాలు నిర్వహించారు. ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
అల్లూరి: జిల్లాలో మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ సౌకర్యం మెరుగుపరిచేందుకు, ఇప్పటికే అనుమతులు పొంది, ఇంకా నిర్మాణం పూర్తి కాని సెల్ టవర్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ శనివారం అధికారులను ఆదేశించారు. వర్షాకాలం వస్తే పనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని, కాబట్టి అధికారులు సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలన్నారు.
SKLM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే APPECET-2026 ప్రవేశ పరీక్షకు ఎగ్జామినర్‌గా డా. ఎం. శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
SKLM: టెక్కలి ఐతం కళాశాలలో ఎన్సీసీ 14వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బ్రహ్మకుమారి సేవా కేంద్రం సోదరి జయలక్ష్మి జ్ఞాన తరగతులు నిర్వహించారు. ఏకాగ్రతతో మెలిగితే ఓర్పు, సహనం, క్రమశిక్షణ అలవడి విజయం సాధిస్తామని ఆమె తెలిపారు. యోగా, రాజయోగ, మానసిక, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇచ్చారు. సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో వర్షాకాలం దృశ్య ‘ఆపరేషన్ క్లీన్ స్లీప్’ ముమ్మరంగా సాగుతుంది. శ్వేతా జలపతి స్కూల్ రోడ్డు, చాకలి వీధి, సున్నపు వీధి, దెబ్బ వీధిలో మేజర్ డ్రైవింగ్‌లో పేరుకుపోయిన షీటును పారిశుధ్య కార్మికులతో తీయించారు. మీరు సజావుగా వెళ్ళేందుకు కాలువలను శుభ్రం చేశారు. ఆమెతోపాటు సాయంత్రం ఇన్స్‌పెక్టర్ అధికారులు ఉన్నారు.
GNTR: తాడేపల్లి(M) పెనుమాకలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక రిజర్వాయర్ వద్ద పైప్‌లైన్, విద్యుత్ లైన్ దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ పనులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా సీస్ పురం(M)రేగుల చిలుక గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు చిట్ట అర్జునరావు అనే రైతుకు చెందిన దానిమ్మ తోటను ధ్వంసం చేశారు. శుక్రవారం సాయంత్రం తోటకు నీళ్లు పెట్టి వెళ్లిన రైతు శనివారం ఉదయం వచ్చే చూసే సరికి చెట్లని నరికి ఉండడానికి గమనించాడు.1.5ఎకరాల దానిమ్మ తోటను 8 నెలలుగా సాగు చేస్తున్నానని రైతు జినేంద్ర. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
శ్రీకాకుళం: ‘పొగాకు మానండి కేన్సర్ రాకుండా చూసుకోండి’ అని జిల్లా మహిళా మార్గదర్శి సంస్థ కో ఆర్డినేటర్ జే. చిరంజీవి పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం మండలం శ్యామ్ పాలెం, కోళ్ల పేట గ్రామాల్లో పొగాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం వహించారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పొగాకు వాడకం పూర్తిగా తగ్గించాలని అన్నారు. దీనివల్ల ఇప్పటికే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలంలో చిన్న చిన్న విషయాలకు ఎవరు ఆత్మహత్యకు పాల్పడవద్దని సీఐ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్య ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతుండడంతో సీఐ రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
KDP: ఖాజీపేట మండలంలోని విజయదుర్గ రోటరీ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ రక్షణ కంచె లేకుండా ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతూ ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై ఓ కుక్క మృతి చెందిన ఘటనతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
PLD: కొండవీడు కోటలోని పురాతన షాహీ జుమ్మా మసీదులో శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దేశ శాంతి, మతసామరస్యం, రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక దువా చేశారు. ఈ చారిత్రక మసీదుతో పాటు దర్గాను పునరుద్ధరించాలని పండితులు ఇస్హాక్ నద్వీ ప్రభుత్వాన్ని కోరారు.