• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

త్వరలో గుంటూరు-కనిగిరి మధ్య ప్యాసింజర్ రైలు

ప్రకాశం: టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి మేరకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరికి ప్రతిరోజూ ఒక డెమో రైలు నడపాలని నిర్ణయించారు. ఈ రైలు గుంటూరులో ఉదయం 8:30కు బయలుదేరి మధ్యాహ్నం 1గంటకు కనిగిరికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కనిగిరి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు గుంటూరుకు చేరుతుందని అధికారులు తెలిపారు.

April 28, 2026 / 02:29 PM IST

కూటమి నిర్లక్ష్యంమే ఈ పెట్రోల్ కొరత

గుంటూరు 48వ డివిజన్ పరిధిలో గల, రెడ్డిపాలెం గ్రామంలో HP పెట్రోల్ బంక్‌ను బలసాని మంగళవారం సందర్శించారు. వాహనదారులతో మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ కొరత వలన పడుతున్న ఇబ్బందులు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంమే అని వారు అన్నారు

April 28, 2026 / 02:28 PM IST

ఇంధన కొరతపై సీపీఎం ఆగ్రహం

కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఇవాళ సీపీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాపార వర్గాలు లాభాల కోసం కొరత సృష్టిస్తున్నాయని నేతలు ఆరోపించారు. ప్రజలు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు.

April 28, 2026 / 02:23 PM IST

ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం

SKLM: పలాస మండలం బంటుకొత్తూరు పంచాయతీ పెద్ద నారాయణపురం గ్రామంలోని పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులను తెలుగుదేశం నాయకులు నిమ్మన గోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయమే భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గుంట హారతి, కార్యకర్తలు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొనడం జరిగింది.

April 28, 2026 / 02:17 PM IST

307వ మెగా రక్తదాన శిబిరం విజయవంతం

అన్నమయ్య: రాయచోటిలో నిర్వహించిన 307వ మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు, హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ ఆర్గనైజేషన్ తెలుగు రాష్ట్ర అధ్యక్షులు డా. సయ్యద్ మైనుద్దీన్ తెలిపారు. వేసవి కాలంలో రక్త కొరత తీవ్రంగా ఉంటుందని, అందరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

April 28, 2026 / 02:15 PM IST

జనగణన పారదర్శకంగా జరగాలి: తహసీల్దార్

PPM: గుమ్మలక్ష్మీపురంలో తహసీల్దార్ శేఖరం జనగణన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ నెల 30తో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ముగుస్తుందని, మే 1 నుంచి ప్రారంభమయ్యే జనగణనకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు.

April 28, 2026 / 02:11 PM IST

ఈవీఎంలు భద్రపరిచిన గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

TPT: సాధారణ తనిఖీల్లో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాముల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, 24 గంటల భద్రతా సిబ్బంది విధులు, ఫైర్ సేఫ్టీ చర్యలు వంటి అంశాలను కలెక్టర్ సమీక్షించారు.

April 28, 2026 / 02:02 PM IST

వరి కోతల జోరు.. దిగుబడి ఎంతంటే..?

W.G: ఇరగవరం మండలంలో వరి కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ధాన్యం సేకరణ సైతం ఊపందుకుంది. మండలం వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇప్పటికే 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ఎకరానికి సరాసరి 50 బస్తాల చొప్పున ఆశాజనకమైన దిగుబడి వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి రావడంతో అటు అధికారులు ధాన్యం సేకరణ పనులను వేగవంతం చేశారు.

April 28, 2026 / 02:00 PM IST

‘ఇంటిలో ఉన్న పుస్తకాలే ఇంటి విలువను నిర్ణయిస్తాయి’

PPM: ఇల్లు ఎంత పెద్దదని కాదు అందులో ఉన్న పుస్తకాలే ఇంటి విలువను నిర్ణయిస్తాయని పాలకొండకు చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు జనార్దన రావు అన్నారు. మంగళవారం స్దానిక శాఖ గ్రంధాల అధికారి గణేష్ బాబు ఆద్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరం నేటి నుండి జూన్‌ నెల 6 వరకు నిర్వహిస్తామని తెలియజేశారు.

April 28, 2026 / 01:51 PM IST

డేటా సెంటర్ శంకుస్థాపన ఏపీకి గర్వకారణమైన రోజు: ఎమ్మెల్యే

VZM: సీఎం చంద్రబాబు మంగళవారం తర్లువాడలో గూగుల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడం రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త దిశను చూపుతోందని MLA అతిది గజపతిరాజు అన్నారు. ఆమె మాట్లాడుతూ.. దీని ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి సాంకేతిక పురోగతి, మరింత అంతర్జాతీయ స్దాయి గుర్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

April 28, 2026 / 01:50 PM IST

ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

మార్కాపురం పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

April 28, 2026 / 01:49 PM IST

వార్డు సభ్యురాలు పెద్ద అంపమ్మ మృతి

KRNL: కోసిగి 3వ వార్డు సభ్యురాలు పెద్ద అంపమ్మ మరణంతో పట్టణంలో విషాదం నెలకొంది. ఆమె భౌతిక కాయానికి మంత్రాలయం టీడీపీ సొసైటీ ఛైర్మన్ ఎన్.రామకృష్ణారెడ్డి ఇవాళ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 28, 2026 / 01:48 PM IST

‘కొరత వెనక ప్రభుత్వం కుట్ర ఉంది’

SKLM: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. 4510 పెట్రోల్ బంకుల్లో 70% నో స్టాక్ బోర్డులు పెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని డీలర్లు ఇంధనాన్ని నిల్వ చేస్తున్నారని, ప్రభుత్వం సమీక్ష చేయకుండా కేవలం లీకులతో కాలయాపనం చేస్తుందన్నారు.

April 28, 2026 / 01:46 PM IST

అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం

VSP: విశాఖ మురళీనగర్ సెక్టార్-11లో ట్రెక్కింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దివంగత కె. త్రిపురసుందరరావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాదచారులు, కార్మికులకు ప్రతిరోజూ మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఈ చలివేంద్రం 50 రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

April 28, 2026 / 01:44 PM IST

‘జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలి’

CTR: వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పుంగనూరు జర్నలిస్టుల యూనియన్ నాయకులు సలీం డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

April 28, 2026 / 01:43 PM IST