కోనసీమ: పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ప్రతిపక్షాలు చేసిన కుట్రను నిరసిస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని ఇండి కూటమి వైఖరిని తప్పు పట్టారు. బిల్లుకు అడ్డుపడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
KRNL: 104 సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఉద్యోగుల సంఘం నాయకులు మంత్రాలయం TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. తక్కువ వేతనాలు, బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, గ్రాట్యుటీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే డ్రైవర్లకు స్లాబ్ అమలు, కనీస వేతనం పెంపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
BPT: పంగులూరు మండలంలోని రేణింగవరం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకును సోమవారం మండల తహసీల్దార్, ఎస్సై వినోద్ బాబు సంయుక్తంగా తనిఖీ చేశారు. బంకులో ఉన్న స్టాక్ రిజిస్టర్లను, నిల్వలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సదరు బంకులో ప్రస్తుతం 12,000 లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందని గుర్తించినట్లు తెలిపారు.
NDL: మిడుతూరు (మం) రోళ్ళపాడు గ్రామానికి చెందిన శివుడిని విద్యుత్ శాఖలో వాచ్‌మన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కోడుమూరుకు చెందిన వీరేష్ రూ.1.50లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితుడు సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుని డబ్బులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు.
సత్యసాయి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంధన కొరత లేదా ధరల వ్యత్యాసంపై ప్రజలు 08555 288566 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. వినియోగదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారుల బృందం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సమీక్షించారు. మే నెలలో జరుగనున్న ఈ గంగమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందిలకు అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ప్రజల వినతులు, సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.
కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కార్లు, చిన్న సరకు వాహనాలకు 30 లీటర్లు, లారీలు, ప్రైవేట్ బస్సులకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇవ్వనున్నారు. అంబులెన్స్‌లు, ప్రజా రవాణా వాహనాలకు ఇంధన సరఫరా కొనసాగుతుందన్నారు.
విశాఖ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. చంద్రబాబు విజన్‌తో విశాఖ ఐటీ హబ్‌గా మారనుందన్నారు.
NDL: కోవెలకుంట్లలో వెలసిన పాండురంగ విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావుని ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గుద్దేటి చిన్న వెంకటసుబ్బారెడ్డి(గుండయ్య), వైస్ ఛైర్మన్ కరిమద్దుల లక్ష్మీ నాగేంద్రబాబు కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి హాజరుకావాలని ఆయనను కోరారు.
అన్నమయ్య: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ముమ్మర నిఘా చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగుతోంది. పేకాట, నాటుసారా, గంజాయి రవాణా వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 30న సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా సోమవారం తెలిపారు. స్త్రీ, పురుషులకు 100,200,400,800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులన్నారు.
KRNL: మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడం, వారి రక్షణపై అవగాహన కల్పించేందుకు సోమవారం సాయంత్రం స్థానిక తేరు బజార్ ఆవరణలో సీఐ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నిత్యం జరుగుతున్న అగాయిత్యాల పట్ల మహిళలు, యువతులు ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసులు వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు ‘శక్తి యాప్’ ఎలా ఉపయోగించాలో వారికి తెలియజేశారు.
ఏలూరులోని CPI ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు పెట్రోల్ బంకుల్లో పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన దేశంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ కోసం ప్రజలు బంకుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆరోపించారు.
BPT: రోటరీ క్లబ్ ఆఫ్ పంగులూరు ఆధ్వర్యంలో 46 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ చేయించేందుకు సోమవారం పెదకాకానిలోని శంకర్ నేత్రాలయానికి తరలించారు. ఈ నెల 25న పంగులూరులోని రోటరీ భవన్ వద్ద నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి 120 మంది హాజరు కాగా అందులో 75 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు 46 మందిని బస్సులో తీసుకెళ్లారు.