• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

PPM: కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 6, 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. నం.39) ప్రకారం ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఖాళీగా ఉన్న 39 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారి తెలిపారు.

April 28, 2026 / 05:13 PM IST

అంగన్వాడీపై ఆకస్మిక తనిఖీ

ASR: అరకులోయ మండలం నందివలస అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా అనే అంశంపై పరిశీలించారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సిబ్బందికి సూచించారు. ఎలాంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 28, 2026 / 05:11 PM IST

లైబ్రరీలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

అన్నమయ్య: తంబళ్లపల్లె గ్రంథాలయంలో పిల్లలకు వేసవి శిక్షణా తరగతులను ప్రారంభించినట్టు లైబ్రేరియన్ జిలానీ బాషా తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు TVలు, ఫోన్లకు బానిస కాకుండా ప్రభుత్వం, ఉన్నతధికారుల ఆదేశాలతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేటి నుంచి జూన్ 6 వరకు పిల్లలకు దినపత్రికలు, పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, యోగా నేర్పించడం చేస్తామన్నారు.

April 28, 2026 / 05:06 PM IST

‘పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

E.G: రానున్న పుష్కరాల దృష్ట్యా కొవ్వూరు పరిధిలోని భూములను MLA ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు PPP విధానంలో కాటేజీలు, గదులు, స్నానాల గదులు వంటి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు.

April 28, 2026 / 05:04 PM IST

పోలీస్ స్టేషన్‌ల్లో ఎస్పీ తనిఖీలు

ప్రకాశం: సంతమాగులూరు బల్లికురవ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్‌లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులపై ఆరా తీశారు. ట్రాఫిక్ నివారణ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ప్రాపర్టీని అధికారుల అనుమతితో డిస్పోజల్ చేయాలని ఆదేశించారు.

April 28, 2026 / 05:03 PM IST

కంటి ఆపరేషన్ల వివరాలు పోర్టల్లో నమోదు చేయాలి

W.G: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం డీఎంహెచ్ కార్యాలయంలో ప్రైవేట్ కంటి ఆసుపత్రుల ప్రతినిధులు, ఎన్జీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డా. గీతాబాయి మాట్లాడుతూ.. కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగుల వివరాలను తప్పనిసరిగా www.npcb.gov.in పోర్టల్ నమోదు చేయాలన్నారు. అంధత్వ నివారణకు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు.

April 28, 2026 / 05:02 PM IST

తడలో పెట్రోల్ బంకుల తనిఖీలు

TPT: తడ మండలంలోని పెట్రోల్ బంకులను ఆర్ వనజ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను యాజమాన్యాలకు వివరించారు. ముఖ్యంగా రేషనలైజ్ సిస్టమ్‌ను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వీఆర్వోలు జ్ఞానయ్య, బాబు, హైమావతి, వీఆర్ఏ చెంచు కృష్ణ తదితరులు పాల్గొని బంకుల్లో ఇంధన నిల్వలను పరిశీలించారు.

April 28, 2026 / 05:00 PM IST

‘పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి’

కృష్ణా: పిల్లలు సెల్ ఫోన్ వీడి పుస్తకాలు చదవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. మంగళవారం అవనిగడ్డలోని గ్రంధాలయంలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా విజ్ఞానం కోసం పుస్తకాలు చదవాలన్నారు.

April 28, 2026 / 04:55 PM IST

మే 1న సీతారామ కళ్యాణం

CTR: సదుం మండలం పెడకంటివారిపల్లెలో వెలసిన కోదండరామ స్వామి ఆలయంలో మే 1న సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం గణపతిపూజ, కలశస్థాపన, హోమాలతో వేడుకలు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం, అనంతరం పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు.

April 28, 2026 / 04:51 PM IST

‘లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలి’

ATP: గుంతకల్లు సీఐటీయూ కార్యాలయంలో మేడే వేడుకలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు, ఓవర్ టైం నిబంధనల మార్పులతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

April 28, 2026 / 04:50 PM IST

యూపీహెచ్‌సీని సందర్శించిన అస్సాం బృందం

GNTR: మంగళగిరి ఇంధిరానగర్ యూపీహెచ్‌సీని మంగళవారం అస్సాం వైద్యాధికారుల బృందం సందర్శించింది. రాష్ట్రంలోని వైద్య సేవలపై అధ్యయనంలో భాగంగా ఏడుగురు సభ్యుల బృందం ఇక్కడకు విచ్చేసింది. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష రోగులకు అందిస్తున్న సేవలు, యాప్‌ల వినియోగం తదితర అంశాలను వారికి వివరించారు.

April 28, 2026 / 04:48 PM IST

బకాయిల చెల్లింపులు చేయండి: కమిషనర్

PLD: మాచర్ల పురపాలక సంఘానికి బకాయిల చెల్లింపులు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ఓ యాజమాన్యం రూ.32 లక్షలు, చెల్లించించింది. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడిన యాజమాన్యాలను కమిషనర్ డీ. వేణుబాబు అభినందించారు. ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ, 5% రిబేట్ అందుబాటులో ఉన్నందున ప్రజలు, వ్యాపారులు బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించారు.

April 28, 2026 / 04:43 PM IST

చుండూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

బాపట్ల: చుండూరు మండలం వలివేరు రైల్వే ట్రాక్ సమీపంలోని పొలాల్లో మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. రైతుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఐదడుగుల ఎత్తు, చామనఛాయ రంగులో ఉన్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు చుండూరు ఎస్సై (9440796179), లేదా సీఐ (9440796255) నంబర్లలో సంప్రదించాలని కోరారు.

April 28, 2026 / 04:43 PM IST

‘ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి’

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, SP సతీష్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రహదారి ప్రమాదాల తగ్గింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో అనధికారిక పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, రహదారి ఆక్రమణలు, అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు.

April 28, 2026 / 04:40 PM IST

వైభవంగా వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

KRNL: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్ వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం మంగళవారం కనులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో హక్కులు అవమాధి కార్యక్రమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

April 28, 2026 / 04:40 PM IST