NDL: ఉయ్యాలవాడలో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్సై రామిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఇవాళ, రేపు గ్రామానికి నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల కోసం 4 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ నుంచి ఉయ్యాలవాడ మీదుగా JMD, KKL వెళ్లే వాహనదారులు దొర్నిపాడు మీదుగా వెళ్లాలన్నారు.
VSP: విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు మంగళవారం స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. టమాటా రూ.37, ఉల్లిపాయ రూ.17, బంగాళదుంప రూ.12గా ఉన్నాయి. వంకాయ రూ.30, మిర్చి రూ.28, కాకరకాయ రూ.48, మునగకాడలు రూ.42 పలుకుతున్నాయి. ఇతర కూరగాయలు సాధారణంగా లభిస్తుండగా, నిమ్మకాయ ధర మాత్రం రూ.180కు చేరి వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది.
సత్యసాయి: కదిరి మండలం చిగురుమంతాండ పంచాయతీ పరిధిలోని చిగురుమామి తండాలో విషాదం చోటుచేసుకుంది. బి. రవి నాయక్‌కు చెందిన 18 పొట్టేళ్లు ఒక్కసారిగా మృతి చెందాయి. తీవ్ర ఎండలు, వడదెబ్బతో పాటు మందు ప్రభావం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనతో రైతు కుటుంబంలో దుఃఖం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేసి భక్తులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశించారు. నిర్ణయించిన ధరలకే ఆహారం విక్రయించాలని, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ATP: తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డితో కలిసి కడప-అనంతపురం ప్రధాన రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పాటు ప్రయాణికుల వివరాలను ఆరా తీశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.
CTR: పలమనేరు మున్సిపాలిటీలోని చేపల చెరువులు, మాంస దుకాణాలకు ఏడాది పాటు లీజు వసూలుకు ఈనెల 30న వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11గంటలకు వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు మున్సిపల్ కార్యాలయంలో నిబంధనల మేరకు వేలంలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.
ELR: లింగపాలెం మండలం రంగాపురంలోని చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో విశ్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
VSP: విశాఖలో నేడు జరగనున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబుతో కలిసి అశ్వినీ వైష్ణవ్ పాల్గొంటారు.
NDL: కృత్రిమ ఇంధన కొరత అంశంపై ఇవాళ ఉ. 10 గంటలకు డోన్ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై బుగ్గన మాట్లాడతారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
CTR: రామకుప్పం (M) వీర్నమలలో సోమవారం ఎడ్ల పందాలను కోలాహలంగా నిర్వహించారు. లక్షలాది రూపాయల ప్రైస్ మనీతో పాటు భారీగా బహుమతులు పెట్టి ఎడ్ల పందాలు నిర్వహించడంతో పోటీల్లో పాల్గొనేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి సైతం భారీగా ఎద్దులను తీసుకువచ్చారు. పోటీలు తిలకించేందుకు పెద్ద ఎత్తున యువత రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
తిరుపతి పట్టణంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 20 మంది పట్టుబడ్డారు. వీరికి కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా విధించిందని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని, మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని పోలీసులు హెచ్చరించారు.
SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి జి సిగడం M సంత వూరిటీ లో MLA పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని , రూ.1.55 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులు నాయకులు ఉన్నారు.
KRNL: ఆదోని మండలం కుప్పగల్ దర్గా సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పెద్ద తుంబలం ఎస్సై విద్యా శ్రీ అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం జరిపిన దాడిలో నిందితుల వద్ద రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. జూదగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
ప్రకాశం: సింగరాయకొండలో అక్రమంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2024లో సోమరాజు పల్లి చెందిన కొండయ్య సింగరాయకొండలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టు పడ్డాడు. అప్పటి నుంచి విచారణ చేపట్టిన కోర్టు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించింది.
PLD: నరసరావుపేటలోని విజయ్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల సక్రమతపై పరిశీలించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశిస్తూ, వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.