VZM: అఖిల భారత శరీర, అవయవదాతల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా డాక్టర్ మిరియాల కృష్ణారావు బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలో సోమవారం జరిగిన ఓ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు డా గూడూరు సీతామహాలక్ష్మి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కే.భారతి, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ పాల్గొన్నారు.
కర్నూలు నగరంలోని కీలక సుందరయ్య సర్కిల్‌ను అభివృద్ధి చేయాలని సీపీఎం నాయకులు ఇవాళ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. సర్కిల్ అభివృద్ధి లేకపోవడంతో ప్రయాణికులు రోజూ ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. 2010లోనే పేరునామకరణం చేసినప్పటికీ పనులు చేపట్టలేదని విమర్శించారు. తక్షణ చర్యలు తీసుకుని సర్కిల్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
NDL: జనగణన కార్యక్రమంలో భాగంగా అధికారులు తమ వ్యక్తిగత, కార్యాలయ సిబ్బంది వివరాలను తక్షణమే నమోదు చేయాలని ఇవాళ కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. స్వీయ గణన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు. జనగణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ఉద్యోగులు సమయానికి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో దళారులు లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపించి రూ.1.30 కోట్లు స్వాహా చేసినట్లు గ్రామానికి చెందిన మత్స్యకార నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ స్కాంలో దళారులతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని మత్స్యకార నాయకుడు పిక్కి స్వామి ఆరోపించారు.
ATP: అనంతపురం నగరంలోని జేఎన్టీయూ భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాన్లలో, డ్రమ్‌లలో ఇంధనం నింపొద్దని, స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పెట్రోల్ కొరత లేదని, ప్రజలు ప్యానిక్ కొనుగోళ్లు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన సూచించారు.
SKLM: రాష్ట్రపతి CP రాధాకృష్ణన్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన నేరుగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు. దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్న సతీమణి విజయలక్ష్మిని ఆత్మీ యంగా పలకరించారు. అనంతరం కేంద్రమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో విశాఖపట్నం వెళ్లారు.
PLD: మాచర్లలోని పెట్రోల్ బంకులలో సోమవారం గురజాల ఆర్డీవో మురళీకృష్ణ విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇంధనం కొరత గురించి అపోహలు వద్దని సరిపడా నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంధనం సరఫరా చేయాలని సూచించారు. పంపిణీలో ఆరోపణలు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రస్థానంలో భాగస్వామ్యం కావడంపై సచిన్ తెందూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రొఫెసర్ అని గుర్తుచేసుకుంటూ, చదువుపై ఆయనకున్న మక్కువను వివరించారు. తాను కూడా సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని, క్రికెటర్‌గా స్థిరపడ్డాకే కారు కొనుక్కున్నానని సచిన్ తన గతాన్ని స్మరించుకున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని వీడొద్దన్నారు.
NDL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులు అందించిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
VZM: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జేసీ సేధు మాధవన్‌తో ఫోన్లో మాట్లాడారు. డీజిల్ ధరలు పెరుగుతాయన్న అపోహలు వద్దని… ప్రస్తుతానికి జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా...
E.G: నిడదవోలు పట్టణంలో మెప్మా ఆర్పీలుగా పని చేస్తున్న ఉద్యోగులకు జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో (సీఐటియూ) సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. పట్టణంలో మెప్మా ఆర్పీలకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ… అభ్యుదయ వాది, వితరణ శీలి, సమర్థ పాలకుడు వెంకటాద్రి నాయుడు అని కొనియాడారు.
ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపన, నిర్వహణ అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళీకరించినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేస్తామన్నారు. పరిశ్రమల తీవ్రతను బట్టి కేటగిరీలుగా విభజించి వేగంగా క్లియరెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సత్య ఫ్యూయల్ పార్క్ పెట్రోల్ బంకును కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పెట్రోల్, డీజిల్ నిల్వల రికార్డులను పరిశీలించి సరఫరా తీరుపై ఆరా తీశారు. సీసీ కెమెరాలను తనిఖీ చేసిన ఆయన, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంధన నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
SKLM: పోలాకి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను ‘యూడైస్ ప్లస్’ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని మండల ఎంఈవో-2 శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఎంఆర్సీ కార్యాలయంలో సీఆర్‌ఎంటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో1 52 మంది చేరారని ఆయన పేర్కొన్నారు.