VSP: పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వతంత్ర నగర్ ఎన్టీఆర్ హుదూద్ కాలనీ (SF 2, బ్లాక్- 3)కు చెందిన భార్య తేజస్విని, కుమారుడు ధనుష్ కుమార్, కుమార్తె వేదిత కనబడుటం లేదు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈనెల 2వ తేదీన మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అన్ని చోట్లా వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదన్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలంలోని కే.బుడుగుంటపల్లి పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో 7 రోజులుగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సీతా సమేత శ్రీరామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా, ఉభయ దాతల సహకారంతో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం పావని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచ్ నాగరాజు, యూనిట్ ఇంచార్జి సత్యనారాయణను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాకినాడలోని జగన్నాథాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శానాలను ఈ నెల 5వ తేదీ నుంచి 10 తేదీ వరకు ఉండవని ఈఓ సత్యవాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో మరమ్మతుల కారణంగా దర్శనాలను నిలిపివేస్తున్నామని చెప్పారు. కళ్యాణ మండపంలో ఉన్న ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకోవాలన్నారు. ఈ అసౌకర్యానికి సహాకరించాలని ఆమె కోరారు.
E.G: కడియపు లంక రూర్బన్ పంచాయతీ ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు తాజా మాజీ సర్పంచ్ మారిశెట్టి పద్మావతి స్వాగతం పలికారు. ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్న సునీల్ కుమార్‌కు ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, పీఎసీఎస్ ఛైర్మన్ నర్సయ్య, కూటమి నాయకులు సుబ్బారావు, తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
కడప-కనుమలో పల్లె మధ్య గిరిజ భవన్ వెనుక శుక్రవారం సాయంత్రం రైలు కిందపడి బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడు కడప నగరంలోని ప్రకాశ్ నగర్ కాలనీకి చెందిన చింతకుంట సురేష్‌గా గుర్తించారు. మృతుడు నగరంలోని KSRM ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నట్లు SI తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
WG: నరసాపురం రుస్తుంబాదకు చెందిన పేరి సాయి శరవణ (16) అనే బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై ముత్యాలరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 1వ తేదీన మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
W.G: ఆకివీడులో జరిగిన హింసాత్మక ఘటనపై నిజనిర్ధారణ బృందాన్ని నియమించినట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు. BRK నాయుడు, అమర్జహా బేగం, విశ్వేశ్వర్ రెడ్డి, అంకెమ్ సీతారామ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందం బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి నివేదిక సమర్పించాలని ఆమె కోరారు.
కర్నూలు (మ) ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు CI తేజ మూర్తి శుక్రవారం తెలిపారు. ఆటో డ్రైవర్ మహేంద్ర, అతని స్నేహితుడు శివకుమార్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, వీరి అఘాయిత్యం కారణంగా బాధితురాలు గర్భవతి కావడంతో మార్చి 28న ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
కోనసీమ: నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు కేశనపల్లి బుద్ధనగర్ నందు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించే మండల స్థాయి చదరంగం పోటీలను ప్రారంభిస్తారు . 11:30 గంటలకు అంతర్వేదికర గ్రామ పంచాయతీ దగ్గర రూ 55 లక్షలతో విలేజి హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణం చేయుటకు శంకుస్థాపన చేస్తారు.
KDP: ప్రొద్దుటూరులోని మోడంపల్లె ఉపకేంద్రంలోని మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకకు SPDCL ఈఈ రమణారెడ్డి, డీఈ శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. సాయిరాజేశ్వరికాలనీ, మోడంపల్లె, టీచర్స్, డాక్టర్స్ కాలనీలు, జిన్నారోడ్డు, లైట్పాళెం, మైదుకూరు రోడ్డు ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
BPT: వేటపాలెం(మం) రామన్నపేటలో గ్రామంలో ఉన్నట్టుండి ఓ జింక ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం జింకను అటవీశాఖకు అప్పగించే చర్యలు చేపట్టారు. గ్రామాల్లో జంతువుల ప్రవేశం అరుదుగా జరుగుతుందని వారు చెప్పుకొచ్చారు.
ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్‌లో గల కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ మనీశ్ కుమార్ తెలిపారు. 2వ తరగతి నుంచి 12 తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
GNTR: తెనాలి మార్కెట్ యార్డులో నిర్వహించిన ఎడ్లబండ్ల లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని పోటీలను వీక్షించారు. రైతులతో మాట్లాడి వారి జీవన విధానాన్ని అభినందించారు. ఈ పోటీలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
కోనసీమ: ఏపీ రాజధాని అమరావతి పేరు అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విషయంలో జగన్‌కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నాను అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.