• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సజావుగా జరిగిన పదోతరగతి ముల్యాంకనం

PPM: పదోతరగతి సమాధాన పత్రాల ముల్యాంకనం పట్టణంలో ఉన్న DVMM హైస్కూల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం సజావుగా నిర్వహించామని మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం ఐదు సబ్జెక్టులకు సంబంధించి జిల్లాకు 98377 సమాధాన పత్రాలు రాగా, అందులో 4982 పత్రాలు దిద్దడం జరిగిందన్నారు. మొత్తం 418 పరీక్షల పరిశీలకులు హాజరయ్యారన్నారు.

April 7, 2026 / 09:11 AM IST

ఉద్యోగాల పేరుతో మోసం.. రూ.10 లక్షలు స్వాహా

NLR: ఇందుకూరుపేట పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవరకొండ కిశోర్ అనే వ్యక్తి బాధితుడి నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 7, 2026 / 09:04 AM IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన నూతన కార్యవర్గం

VZM: కొత్తవలస న్యాయవాదుల నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితను ఆమె ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. నూతన కార్యవర్గం సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కొత్తవలస నూతన భవనం అవశ్యకతను ఆమెకు వివరించారు. కొత్తవలస సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరామని అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.

April 7, 2026 / 09:03 AM IST

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై

SKLM: హిరమండలం పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా Y. మధుసూదన్ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. హిరమండలంలో పనిచేస్తున్న వి.హేమంత్ కళ్యాణ్ ఆకస్మిక బదిలీ కారణంగా మధుసూదన్ రావు నియామకం జరిగింది. ఈ మేరకు ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయనకు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

April 7, 2026 / 09:03 AM IST

రైల్వే లైన్ మరమ్మతులు.. రైల్లు రద్దు

KRNL: రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ, సిగ్నలింగ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. కాచిగూడ-కర్నూలు (17435) రైలు ఈనెల 10-18 వరకు, కర్నూలు-కాచిగూడ (17436) రైలు 11-19 వరకు, కాచిగూడ-గుంతకల్లు (57414) రైలు 11-19 వరకు రద్దు చేయబడ్డాయన్నారు.

April 7, 2026 / 09:02 AM IST

బేతంచర్లలో ట్రాక్టర్ బోల్తా

NDL: బేతంచర్ల పట్టణంలో సత్రం సమీపంలో నాపరాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఇవాళ ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బనగానపల్లె నుంచి అయ్యల చెరువుకు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను వివరించారు.

April 7, 2026 / 09:01 AM IST

నెల్లూరు జిల్లాలో డ్రోన్ల నిఘా

NLR: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల వినూత్నంగా డ్రోన్ నిఘా వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ముఖ్య కూడళ్లు, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల సహాయంతో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. సంబంధిత డీఎస్పీల పర్యవేక్షణలో CI, SIలు క్షేత్రస్థాయిలో ఈ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.

April 7, 2026 / 09:00 AM IST

వాటర్ ఫౌంటెన్‌ను ప్రారంభించిన మేయర్

నెల్లూరు రూరల్ 36వ డివిజన్ బట్వాడిపాలెం సెంటర్లో రూ. 50 లక్షలతో నిర్మించిన వాటర్ ఫౌంటెన్‌ను మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వై.ఓ. నందన్, TDP గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 08:53 AM IST

నేడు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

సత్యసాయి: మంత్రి సవిత మంగళవారం పెనుకొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం చాలకూరు చెరువు వద్ద ‘మన ఊరు మన నీరు’ కార్యక్రమంలో పాల్గొని జలహారతి పూజ చేస్తారు. అనంతరం సోమందేపల్లి ఎస్సీ కాలనీలో ఉచిత సోలార్ పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిపల్లి రంగనాథ స్వామి ఆలయ పూజలు, చోలెమర్రి గ్రామ జాతరలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.

April 7, 2026 / 08:47 AM IST

‘ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి’

KRNL: ఆలూరు గెస్ట్ హౌస్‌లో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనిన్నారు. పనుల్లో ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల పెంపుతో కరువు నివారణకు పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

April 7, 2026 / 08:47 AM IST

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

ATP: అనంతపురంలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరి రవికుమార్ మరణం పట్ల ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి రవికుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారికి తనవంతు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 7, 2026 / 08:36 AM IST

కోటవురట్ల మండలానికి ప్రత్యేక అధికారులు నియామకం

AKP: కోటవురట్ల మండలానికి 8 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. తను నాలుగు పంచాయతీలకు, తహసీల్దార్ తిరుమల బాబు 3 పంచాయతీలకు నియమితులైనట్లు తెలిపారు. RWS ఏఈ శ్రీనివాస్, మండల పరిషత్ ఏఓ నాగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దారు రమేష్, డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావుకు ఏవో సరోజిని నియమితులయ్యారన్నారు.

April 7, 2026 / 08:31 AM IST

పెదప్రోలు గ్రామపంచాయతీలో వీధి దీపాల సమస్య

కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు GPలో వీధి దీపాల ఏర్పాటులో తీవ్ర లోపాలు వెలుగుచూస్తున్నాయి. జనసంచారం లేని పొలాల్లో లైట్లు ఏర్పాటు చేసి, పగలు కూడా ఆఫ్ చేయకపోవడం, అవసరమైన ప్రాంతాల్లో మాత్రం లైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఒకే స్తంభానికి రెండు లైట్లు అమర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. PGRSలో ఫిర్యాదులు చేసినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 7, 2026 / 08:31 AM IST

90 కేజీల గంజాయి స్వాధీనం: ఎస్సై

ASR: అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో 90 కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్సై శంకరరావు సోమవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా, అరకు వైపు నుంచి వస్తున్న కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

April 7, 2026 / 08:30 AM IST

రాజ్ పాల్‌కు అంతర్జాతీయ ‘బిషప్’ అవార్డు

E.G: గోపాలపురం బెతెల్ చర్చి సంఘకాపరి, అంతర్జాతీయ పాస్టర్ రెవ. తిగిరిపల్లి రాజ్ పాల్ అరుదైన గౌరవం అందుకున్నారు. ఆధ్యాత్మిక సేవలోకి అడుగుపెట్టిన ఎనిమిది నెలల వ్యవధిలోనే ఆయన సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ‘బిషప్’ అవార్డు ప్రదానం చేశారు. సోమవారం చర్చిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించారు.

April 7, 2026 / 08:27 AM IST