• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నీలమణి దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: జిల్లా కేంద్రంలోని కొన్న వీధిలో జరుగుతున్న నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం రాత్రి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

April 22, 2026 / 07:39 AM IST

మాజీ సీఎంను కలిసిన మక్బూల్

సత్యసాయి: వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. మక్బూల్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

April 22, 2026 / 07:28 AM IST

అన్న క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యత పెంచాలి

SKLM: అన్న క్యాంటీన్ల నిర్వహణలో నాణ్యత పెంచాలి అని అన్న క్యాంటీన్ల సీఈవో పోతుల వంశీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం  జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్న క్యాంటీన్ల అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల పనితీరు, భోజన నాణ్యత పై నిరంతరం ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

April 22, 2026 / 07:16 AM IST

నాటు బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పల్నాడు: జిల్లాలో అనుమానాస్పదంగా దాచిన పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో కృష్ణాలయం దగ్గర ఓ ఇంటి మరుగుదొడ్డిలో ప్లాస్టిక్ డబ్బాలో ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. DSP హనుమంతరావు ఆధ్వర్యంలో క్లూస్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడికి ఇవి ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు.

April 22, 2026 / 07:14 AM IST

వైసీపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి

VSP: జిల్లా వైసీపీ కార్యాలయంలో అధ్యక్షుడు కె.కె. రాజు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు మరియు సచివాలయ స్థాయిల్లో పటిష్టం చేయాలని, ఇందుకోసం సమగ్రమైన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ్యుల వివరాలను డిజిటల్ డేటాబేస్‌లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా కార్యాలయానికి సమర్పించాలన్నారు.

April 22, 2026 / 07:09 AM IST

ఆదోనిలో రైతులకు నిరాశ కలిగించిన పత్తి ధర

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిన్నటి పత్తి ధరలు రైతులకు నిరాశ కలిగిస్తున్నాయి. మార్కెట్‌లో నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.7,350 నుంచి రూ.9,011 వరకు మాత్రమే ధర లభిస్తోంది. గతంతో పోలిస్తే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులు పెరిగినా, దిగుబడికి తగిన ధర రాకపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.

April 22, 2026 / 07:07 AM IST

చెరువులకు జియో టాగింగ్ చేయాలి: కలెక్టర్

VZM: జలధార – జలహారతిలో భాగంగా ప్రతి గ్రామంలో గుర్తించిన చెరువుకు జియో టాగింగ్ చేయాలనీ కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అలాగే పట్టణ ప్రాంతాలలో ఉన్న చెరువులకు, పుష్కరిణిలకు జియో టాగింగ్ చేయాలని జరగాలన్నారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, జలధార, జలహరితపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

April 22, 2026 / 07:06 AM IST

కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి

AKP: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు అన్నారు. మాడుగుల మండలం డి.గొటివాడ, తాటిపర్తి గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలతో మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

April 22, 2026 / 07:04 AM IST

లింగసముద్రంలో బొడ్రాయి వివాదానికి తెర

ప్రకాశం: లింగసముద్రం పంచాయతీలోని వాకమల్లవారిపాలెం-జంపాలవారిపాలెం SC కాలనీ మధ్య బొడ్డురాయి వివాదం పరిష్కారమైంది. సమస్యపై పలు దఫాలుగా చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరక వాయిదా పడింది. మంగళవారం MRO హనుమాయమ్మ, CI నరేశ్, SI రాంబాబు ఆధ్వర్యంలో ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. సిద్ధాంతి సూచనలతో రెండు వర్గాల అనుమానాలు నివృత్తి కావడంతో ఇరు పక్షాలు అంగీకరించాయి.

April 22, 2026 / 07:03 AM IST

భూముల రీసర్వేలో జాప్యం వద్దు: కలెక్టర్

కోనసీమ: రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూ రీసర్వే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలో గ్రామసభలు నిర్వహించి, అర్హులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు

April 22, 2026 / 06:59 AM IST

జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా SP ధీరజ్ ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్లు, సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో చెకింగ్ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. సరిగా పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు.

April 22, 2026 / 06:50 AM IST

పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి రూ.16,12,908 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న ఆరుగురు బాధితులకు ఈ ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు.

April 22, 2026 / 06:50 AM IST

కుప్పం RTCలో ఆన్ కాల్ డ్రైవర్ల నియామకం

CTR: కుప్పం RTC డిపోలో తాత్కాలిక పద్ధతిలో ఆన్ కాల్ డ్రైవర్లను నియమించనున్నట్లు RTC DM TK స్వామి తెలిపారు. పదో తరగతి పాసై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కనీసం మూడేళ్లు అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, డిపో అవసరాలను బట్టి పిలిచినప్పుడు మాత్రమే విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

April 22, 2026 / 06:50 AM IST

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

PPM: పార్వతీపురం పట్టణంలోని ఐటీడీఏ, బెలగాం ఫీడర్ల పరిధిలో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరాకి అంతరాయం కలుగుతుందని ఈపీడీసీఎల్ ఈఈ కె. గోపాలరావు నాయుడు తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.

April 22, 2026 / 06:42 AM IST

నేడు జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఇవాళ ఉదయం 10 గంటలకు జరగనున్న జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో ఆమె చర్చించనున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

April 22, 2026 / 06:41 AM IST