• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘జనగణనలో స్వీయ గణన పూర్తి చేయాలి’

NDL: జనగణన కార్యక్రమంలో భాగంగా అధికారులు తమ వ్యక్తిగత, కార్యాలయ సిబ్బంది వివరాలను తక్షణమే నమోదు చేయాలని ఇవాళ కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. స్వీయ గణన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు. జనగణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ఉద్యోగులు సమయానికి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

April 27, 2026 / 06:42 PM IST

లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపించి డబ్బులు స్వాహా..!

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో దళారులు లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపించి రూ.1.30 కోట్లు స్వాహా చేసినట్లు గ్రామానికి చెందిన మత్స్యకార నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ స్కాంలో దళారులతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని మత్స్యకార నాయకుడు పిక్కి స్వామి ఆరోపించారు.

April 27, 2026 / 06:42 PM IST

పెట్రోల్ బంక్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ATP: అనంతపురం నగరంలోని జేఎన్టీయూ భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాన్లలో, డ్రమ్‌లలో ఇంధనం నింపొద్దని, స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పెట్రోల్ కొరత లేదని, ప్రజలు ప్యానిక్ కొనుగోళ్లు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన సూచించారు.

April 27, 2026 / 06:40 PM IST

కేంద్రమంత్రి నివాసంలో ఉప రాష్ట్రపతి సందడి

SKLM: రాష్ట్రపతి CP రాధాకృష్ణన్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన నేరుగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు. దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్న సతీమణి విజయలక్ష్మిని ఆత్మీ యంగా పలకరించారు. అనంతరం కేంద్రమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో విశాఖపట్నం వెళ్లారు.

April 27, 2026 / 06:40 PM IST

పెట్రోల్ బంకుల్లో RDO తనిఖీ

PLD: మాచర్లలోని పెట్రోల్ బంకులలో సోమవారం గురజాల ఆర్డీవో మురళీకృష్ణ విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇంధనం కొరత గురించి అపోహలు వద్దని సరిపడా నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంధనం సరఫరా చేయాలని సూచించారు. పంపిణీలో ఆరోపణలు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

April 27, 2026 / 06:31 PM IST

‘విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని వీడొద్దు’

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయ వందేళ్ల ప్రస్థానంలో భాగస్వామ్యం కావడంపై సచిన్ తెందూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రొఫెసర్ అని గుర్తుచేసుకుంటూ, చదువుపై ఆయనకున్న మక్కువను వివరించారు. తాను కూడా సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని, క్రికెటర్‌గా స్థిరపడ్డాకే కారు కొనుక్కున్నానని సచిన్ తన గతాన్ని స్మరించుకున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని వీడొద్దన్నారు.

April 27, 2026 / 06:24 PM IST

‘చట్ట పరిధి మేరకు న్యాయం చేస్తాం’

NDL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులు అందించిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామన్నారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

April 27, 2026 / 06:21 PM IST

‘జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు’

VZM: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత లేద‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమ‌వారం మంత్రి క‌లెక్ట‌ర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జేసీ సేధు మాధవన్‌తో ఫోన్లో మాట్లాడారు. డీజిల్ ధరలు పెరుగుతాయన్న అపోహలు వద్ద‌ని… ప్ర‌స్తుతానికి జిల్లాలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు స‌రిప‌డా పెట్రోల్‌, డీజిల్ స‌ర‌ఫ‌రా...

April 27, 2026 / 06:21 PM IST

‘మెప్మా ఆర్పీలకు జీతం వెంటనే చెల్లించాలి’

E.G: నిడదవోలు పట్టణంలో మెప్మా ఆర్పీలుగా పని చేస్తున్న ఉద్యోగులకు జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో (సీఐటియూ) సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. పట్టణంలో మెప్మా ఆర్పీలకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

April 27, 2026 / 06:20 PM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజా వాసిరెడ్డి జయంతి వేడుకలు

NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడుతూ… అభ్యుదయ వాది, వితరణ శీలి, సమర్థ పాలకుడు వెంకటాద్రి నాయుడు అని కొనియాడారు.

April 27, 2026 / 06:20 PM IST

వేగంగా పరిశ్రమల అనుమతులు: కలెక్టర్

ATP: జిల్లాలో పరిశ్రమల స్థాపన, నిర్వహణ అనుమతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళీకరించినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేస్తామన్నారు. పరిశ్రమల తీవ్రతను బట్టి కేటగిరీలుగా విభజించి వేగంగా క్లియరెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

April 27, 2026 / 06:20 PM IST

పుట్టపర్తిలోని పెట్రోల్ బంకులో కలెక్టర్ తనిఖీలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సత్య ఫ్యూయల్ పార్క్ పెట్రోల్ బంకును కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పెట్రోల్, డీజిల్ నిల్వల రికార్డులను పరిశీలించి సరఫరా తీరుపై ఆరా తీశారు. సీసీ కెమెరాలను తనిఖీ చేసిన ఆయన, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంధన నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

April 27, 2026 / 06:20 PM IST

‘విద్యార్థుల వివరాలను నమోదు చేయండి’

SKLM: పోలాకి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను ‘యూడైస్ ప్లస్’ పోర్టల్లో విధిగా నమోదు చేయాలని మండల ఎంఈవో-2 శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఎంఆర్సీ కార్యాలయంలో సీఆర్‌ఎంటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాలల్లో1 52 మంది చేరారని ఆయన పేర్కొన్నారు.

April 27, 2026 / 06:17 PM IST

స్వీయ రక్షణపై అవగాహన

AKP: అచ్యుతాపురం పోలీస్ సహకారంతో బ్రాండిక్స్ అప్పారెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-1లో మహిళల భద్రతపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు సీఐ చంద్రశేఖర్ రావు, ఎస్సై సుధాకర్, వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ మంజులవాణి, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ బృందం చట్టపరమైన హక్కులు, భద్రతా చర్యలు, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు.

April 27, 2026 / 06:13 PM IST

‘కైలాసగిరి గ్లాస్‌ వంతెన అద్భుతం’

VSP: ఏయూ శతాబ్ది వేడుకల కోసం విశాఖ వచ్చిన నాగాలాండ్ ముఖ్యమంత్రి నేయిఫియు రియూ నగరంలోని పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘గ్లాస్ బ్రిడ్జ్’ పై ఆయన నడిచి, ఆ అనుభూతి అద్భుతంగా ఉందని, విశాఖ ప్రకృతి సౌందర్యం ఎంతో బాగుందని ప్రశంసించారు. విశాఖలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

April 27, 2026 / 06:12 PM IST