కృష్ణా: గుడివాడ మండల పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (బుక్ కీపర్)లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ ఫోన్లను ప్రజా వేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే రాము మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీరు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NTR: స్మార్ట్ కిచన్ పధకం రద్దు చేసి ప్రస్తుతం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను కొనసాగించాలని మధ్యాహ్న భోజనం జిల్లా కార్యదర్శి సుప్రజ డిమాండ్ చేశారు. ఈ నెల 27న విజయవాడ కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని మంగళవారం నందిగామ సీఐటీయూ భవనంలో జరిగిన సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు.
కోనసీమ: రాయవరం మండలం వెంటూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా వాసంశెట్టి వారి పేటలో రూ. 27 లక్షలతో నిర్మించనున్న 20,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, రూ.36 లక్షలతో విలేజ్ హెల్త్ క్లీనిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
KKD: పెద్దాపురం నవోదయ పాఠశాలలో NCC వార్షిక శిక్షణ శిబిరం చేపట్టినట్లు మేజర్ మహమ్మద్ అసిఫ్ మంగళవారం తెలిపారు. ఈ శిబిరానికి 680 మంది క్యాడట్లు హాజరయ్యారు. వారికి మ్యాప్ రీడింగ్, ఆయుధ శిక్షణ, బాటిల్ క్రాఫ్ట్, ఫీల్డ్ క్రాఫ్ట్, దేశ రక్షణ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ శ్రీనివాసరావు, లెఫ్టినెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లిలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో జనసైనికులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని చిన్నారులతో కలిసి భోజనం చేశారు. డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నారులకు స్వయంగా ఆయన భోజనం వడ్డించారు.
BPT: సంతమాగులూరు మండలంలోని అడవిపాలెం, వెల్లలచెరువు గ్రామాల్లో రైతులకు పచ్చిరొట్ట పంటలపై (జీలుగా, జనుము, పిల్లిపెసర) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి (AO) షేక్ సైదా మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట ఎరువులను వాడటం ద్వారా నేలలో సేంద్రీయ కర్బనం పెరుగుతుందని తెలిపారు.
PPM: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి డా. టి. జగన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు బాగువలస, మెంటాడవీధి ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల వివరాల నమోదు, ల్యాబ్ నివేదికలు, పరికరాల పనితీరును పరిశీలించారు. పిహెచ్సీల్లో ప్రసవ సేవలు మెరుగుపర్చాలని, మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
గుంటూరు: జీజీహెచ్‌లో సిబ్బంది తీరుపై వైసీపీ మండిపడింది. ఆక్సిజన్ రోగులను వదిలేసి సిబ్బంది కబుర్లలో మునిగారని విమర్శించింది. ఎక్స్‌రే టెక్నీషియన్ అనిల్ రోగులతో దురుసుగా ప్రవర్తించారంది. సూపరింటెండెంట్‌కు ఎవరూ భయపడరని అతడు వెటకారం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి ఇదే సాక్ష్యమంటూ సీఎం, మంత్రిని ఎక్స్‌లో ప్రశ్నించింది.
ATP: అనంతపురం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పంపిణీ చేశారు. వడియంపేట మాజీ సర్పంచ్ నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలను వివరించారు. ప్రభుత్వం 21 రకాల దివ్యాంగతలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఆమె తెలిపారు.
W.G: దేశ అభివృద్ధి, సమగ్ర సంక్షేమం, సుస్థిర పురోగతిలో సివిల్ సర్వీసుల పాత్ర అపూర్వమని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఇవాళ భీమవరం కలెక్టరేట్‌లో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా వివిధ శాఖల అధికారుల ఉత్తమ పనితీరును గుర్తిస్తూ మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సివిల్ సర్వెంట్లు తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలు ప్రజలకు ఎంత ఉపయోగపడతాయన్నారు.
కోనసీమ: ఆలమూరు ప్రాంతంలో 2023లో జరిగిన హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రాజమండ్రి అదనపు కోర్టు జడ్జి ఎస్. ఉమా సునంద తీర్పునిచ్చారు. నిందితులు కేత వెంకట సుధీర్, వేలు కళ్యాణ్, సింగంపల్లి కార్తికేయలకు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. 15 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు.
NLR: సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని సర్వీసు నుంచి తొలగించడాన్ని MLC చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యా యులు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసినందుకు ఆయనను డిస్మిస్ చేయడం సరికాదన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని విమర్శించారు.
ATP: రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన టీడీపీ నాయకుడు లడ్డు ఇస్మాయిల్ భౌతికకాయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించారు. ఆయన మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నమయ్య: కదిరి బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీపై ACB సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నగదు, బంగారం, ఇళ్లు, స్థలాలు, వాహనాలు సహా కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడిని కర్నూలులోని ప్రత్యేక ACB కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వెలుగు సిబ్బందికి 5జీ స్మార్ట్ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యదిస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చన్నారు.