GNTR: మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు 30వ వార్డులో కాలువ పూడికతీత పనులను పరిశీలించారు. సిల్ట్ పూర్తిగా తొలగించి వెంటనే తరలించాలని సూచించారు. కాలువల్లో చెత్త వేయొద్దని హెచ్చరించారు. 34వ వార్డులో గృహనిర్మాణ కేంద్రం, వీఎస్ఆర్-ఎన్వీఆర్ కాలేజీ సమీపంలోని నీటి సరఫరా కేంద్రాన్ని తనిఖీ చేసి నాణ్యతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
తూ.గో: రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మంగళవారం సీతారాంపురంలో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
SKLM: అరసవల్లి గ్రామ దేవత అసిరితల్లి పండుగలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం కమిటీ సభ్యుల ఆహ్వానం మెరకు ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్ కూన రవికుమార్ హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజల మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
W.G: పెట్రోల్, డీజిల్ కొరత అంతా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం తణుకులోని పలు పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి వాహనదారులకు మజ్జిగ అందజేశారు. డీజిల్ లేక రైతులు, వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ: చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి దారుణ హత్యను కొత్తపేటకు చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి, మండల అధ్యక్షుడు గనిశెట్టి వీరేష్ తదితర నాయకులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దురాగతాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
KDP: ఖాజీపేట(M) సుంకేసుల గ్రామంలో మే 5వ తేదీన రీసర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రమణమ్మ మంగళవారం తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, తమ ఆధార్ కార్డు తప్పకుండా సర్వే సమయంలో కలిగి ఉండాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సత్యసాయి: ABN ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ మోహనరెడ్డి హత్యను ఖండిస్తూ గోరంట్ల జర్నలిస్టులు మంగళవారం తహశీల్దార్ మధుసూదన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ కీలక పాత్ర పోషిస్తున్న విలేఖరులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. నిందితులను శిక్షించి విలేఖరికి న్యాయం చేయాలని కోరారు.
GNTR: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రేపు అద్దంకి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు చిన్న కొత్తపల్లి నుంచి ప్రారంభించి సింగరకొండ, అద్దంకి టౌన్, ఉప్పుమాగులూరులో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 11:45 గంటలకు నరసరావుపేట, 12:30 గంటలకు అడవిపాలెం గ్రామాల్లో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం వెల్లడించింది.
గుంటూరు అరండల్‌పేటలో గంజాయి నిర్మూలనపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో శివనగరాజు కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించి 500 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన దృవ పత్రాలు లేని 43 వాహనాలు సీజ్ చేసి, రౌడీషీటర్లపై నిఘా పెంచారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
VZM: బొబ్బిలి మండలం పక్కీ గ్రామంలోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ, వర్షాకాలంలో నీరు కారడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా చర్యలు లేకపోవడంతో, సిబ్బంది భయం గుప్పట్లో విధులు నిర్వహిస్తున్నారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు చేరుకుని, అక్కడ ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి రోడ్డు మార్గంలో ధర్మవరం చేరుకుని అక్కడే బస చేస్తారు. 29న రోజంతా ధర్మవరంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం రైలులో గుంటూరుకు బయలుదేరుతారు.
SKLM: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయాలని CITU కన్వీనర్ పనస రమేష్ పిలుపునిచ్చారు. కొత్తూరు మండల కేంద్రంలో ల మంగళవారం సమావేశం నిర్వహించారు. కార్మికవర్గం తమ హక్కులకోసం పోరాడి 8 గంటలు పని సాధించుకున్నారని, పని గంటలు పెంచటం సబబు కాదన్నారు. పాలకులు విధానాల ఫలితంగా కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చటం తగదన్నారు.
ELR: రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం ఏలూరులో ఇంఛార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేతకానితనం వల్ల పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు, ముఖ్యంగా రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
అన్నమయ్య: గాలివీడు మండలంలో ఎండాకాలంలో దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇళ్లు ఖాళీగా ఉండే సమయంలో నాణ్యమైన తాళాలు వేసుకోవడం, విలువైన వస్తువులను బ్యాంకులో భద్రపరచడం, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్సై జె. నరసింహారెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 9121100556 లేదా 100/112 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
PLD: నరసరావుపేటలోని కైలాష్ ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఇవాళ జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన నిల్వలు, నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఇంధన సరఫరాలో పారదర్శకత, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించడం అత్యంత ముఖ్యమని జేసీ స్పష్టం చేశారు.