W.G: అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు
AKP: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నర్సీపట్నం పెద్దచెరువు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సమానత్వం, స్వేచ్ఛ కోసం అంబేడ్కర్ చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
NDL: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఇవాళ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి బేతంచర్ల మండలం రేపల్లె గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సమానత్వం, సామాజిక న్యాయానికి చేసిన సేవలు అపారమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
TPT: పెళ్లకూరు మండలం రోసనూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే నియోజకవర్గ ఇంఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్లో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లోని పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరై నివాళులర్పించారు.
CTR: జిల్లాలో రానున్న వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఎక్కువ, మరి కొన్ని ప్రాంతాలలో తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో తక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
BPT: కర్లపాలెం గ్రామ పంచాయతీలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఈ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ డిప్యూటీ ఎంపీడీవో పద్మావతి, కో ఆప్షన్ సభ్యులు అమీర్ బెగ్, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.
GNTR: ప్రపంచ బ్యాంకు అమరావతి శాటిలైట్ మ్యాప్‌లను విడుదల చేసింది. ఇందులో 2024, 2026 సంవత్సరాల మధ్య వచ్చిన మార్పులను చూపించింది. రాజధాని ఫేజ్-1 పనులకు రూ.30 వేల కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. దీనికి గ్లోబల్ ఫండింగ్ సంస్థల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. నిధుల రాకతో అమరావతి నిర్మాణం ప్రణాళికలకే పరిమితం కాకుండా ఆచరణ దశకు చేరుకుంది.
సత్యసాయి: ధర్మవరంలో తనపై అక్రమ కేసు బనాయించి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఓబుళరెడ్డి ఎస్పీ సతీష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జనసేన నేతపై నకిలీ పోస్టు సృష్టించిన వ్యక్తిని వదిలేసి, సంబంధం లేని తనను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
E.G: అంబేడ్కర్ జయంతి సందర్భంగా అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో న్యాయమూర్తి వంశీకృష్ణ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని వంశీకృష్ణ అన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
ASR: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, కుల వివక్షకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B.R. అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిదని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో నిమ్న వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేశారన్నారు.
PPM: 1944 ముంబై నౌకా ప్రమాదంలో అమరులైన 66 మంది అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ జాతీయ సంతాప దినాలు ప్రారంభించింది. ఏప్రిల్14 నుంచి 21 వరకు వారంరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ ఆరిక సింహాచలం తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
SKLM: అంబేద్కర్ స్పూర్తితో హక్కులు కోసం పోరాడాలని CITU జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం డా.బి. ఆర్.అంబేద్కర్ జయంతి సందర్బంగా రణస్థలం M పతివాడపాలెంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు.
NLR: అంబేద్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి భారత రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా రచించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం నేటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు.
VSP: సింహాచలం వరాహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు.