• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే పుత్తా

KDP: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ విరామ బ్రేక్ సమయంలో ఆయన తన సోదరుడు పుత్తా లక్ష్మారెడ్డి ఇతర స్నేహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆయనను సత్కరించి ఆశీర్వదించారు.

April 8, 2026 / 11:12 AM IST

పోలీస్ క్రీడల్లో మహేశ్‌కు గోల్డ్ మెడల్

AKP: దేవరాపల్లి మండలానికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రెడ్డి మహేశ్ కుమార్ అనకాపల్లి జిల్లా పోలీస్ వార్షిక క్రీడల్లో ప్రతిభ కనబర్చారు. విశాఖపట్నం కైలాసగిరి సమీప ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్‌లో జరిగిన పోటీల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్‌లో రెండు బంగారు పథకాలు సాధించారు. కబడ్డీలో కాంస్య పథకం సాధించినట్లు పేర్కొన్నారు.

April 8, 2026 / 11:10 AM IST

‘సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలి’

NLR: రానున్న మూడు నెలల్లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో, మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

April 8, 2026 / 10:57 AM IST

‘ప్రజలకు రుచికరమైన ఆహారం అందించాలి’

SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను  మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవారం ఉదయం సందర్శించారు. ఈ మేరకు ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శానిటేషన్ సెక్రటరీ సింహాచలం ఉన్నారు. 

April 8, 2026 / 10:48 AM IST

ముంబయి పర్యటనకు వెళ్ళనున్న మంత్రి కందుల

E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ నేడు, రేపు ముంబయిలో పర్యటించమన్నారు. స్థానిక గ్రాండ్ హయత్ హోటల్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాకు మంత్రి హాజరు కానున్నారు. ముంబయి వేదికగా ఏపీ పర్యాటక రంగంలోని పెట్టుబడి అవకాశాలు తదితర వాటిని వివరించనున్నారు.

April 8, 2026 / 10:45 AM IST

జర్నలిస్టులకు రేపు ఉచిత వైద్య శిబిరం: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని షాదీ మహల్‌లో ఈనెల 9న అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి రక్త పరీక్షలు, ఈసీజీతో పాటు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ వంటి నిపుణులు సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.

April 8, 2026 / 10:44 AM IST

పల్లాతో భేటీ పార్టీ బలోపేతంపై చర్చ

KRNL: ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:41 AM IST

మాజీ సర్పంచ్‌లకు ఘన సన్మానం

PLD: వినుకొండలో మాజీ సర్పంచ్‌లను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు సన్మానించారు. పదవీకాలం ముగిసిన వారిని బుధవారం ఆయన దుశ్శాలువాలతో సత్కరించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. గత ఐదేళ్లు వారు చేసిన సేవలు ఎంతో అభినందనీయమన్నారు. పదవులు ముగిసినా భవిష్యత్తులోనూ ప్రజా సేవలో కొనసాగాలని ఆయన సూచించారు.

April 8, 2026 / 10:40 AM IST

పోలీసుల అవగాహన సదస్సు

ELR: జంగారెడ్డిడెంలోని 6, 7, 8 వార్డులకు సంబంధించిన ప్రజలతో నిన్న రాత్రి ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేవిధంగా అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుభాష్, ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 10:38 AM IST

‘సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం’

PLD: సీఎం సహాయనిది పేదల పాలిటి వరమని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 71 మంది లబ్ధిదారులకు రూ.61.36 లక్షల చెక్కులను మంగళవారం ఆయన కార్యాలయంలో DCCB ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి చీఫ్ విప్ జీవీ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

April 8, 2026 / 10:37 AM IST

శంకరంబాడి సుందరాచార్యులకు ఘన నివాళి

TPT: శంకరంబాడి సుందరాచార్యుల వర్థంతి సందర్భంగా ప్రముఖులు తిరుపతిలో ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయంతో తెలుగువారి కీర్తిని చాటిన మహనీయుడిని అభిమానులు స్మరించుకున్నారు. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా రాష్ట్ర గీతం ద్వారా తెలుగువారి గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

April 8, 2026 / 10:35 AM IST

గోళ్లమూడిలో CMRF చెక్కు అందజేత

ఎన్టీఆర్: నందిగామ మండలం గోళ్లమూడిలో CMRF చెక్కును బుధవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రంగమ్మకు మంజూరైన రూ.72,570 చెక్కును టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాసరావు అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తమకు ఆర్థిక సాయం అందించిన సీఎం చంద్రబాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

April 8, 2026 / 10:34 AM IST

డి.ఎడ్ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

అన్నమయ్య: 2026–27 విద్యా సంవత్సరానికి డి.ఎడ్ కోర్సు ప్రవేశాల కోసం DEECET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ డా. కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటి బాలిక ఉన్నత పాఠశాలలో పోస్టర్లను ఆవిష్కరించారు. దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15 కాగా, పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.

April 8, 2026 / 10:32 AM IST

మాజీ సర్పంచ్ దంపతులకు ఘన సత్కారం

AKP: ములకలాపల్లి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ అన్నపూర్ణ, రామ కొండలరావు దంపతులను గ్రామ యువత,పెద్దలు ఘనంగా సత్కరించారు. పదవీకాలం ముగియడంతో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉప సర్పంచ్ కర్రి బలరాం,వార్డు సభ్యులను సాలువాలతో అభినందించారు. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామస్తులు కొనియాడారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

April 8, 2026 / 10:29 AM IST

కాళ్ల మండలంలో డ్రోన్లతో నిఘా: ఎస్ఐ

W.G: కాళ్ల మండలంలోని అనుమానిత ప్రాంతాల్లో నిన్న డ్రోన్లతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఏలూరుపాడు, సీసలి, కాళ్ల తదితర గ్రామాల్లో ఈగల్ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

April 8, 2026 / 10:23 AM IST