బాపట్ల జిల్లా అద్దంకి మండలం కాకానిపాలెంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈనెల 26న మహోత్సవం జరగనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులు ఈ రోజు కరపత్రాలను విడుదల చేశారు. ఈ మహోత్సవంలో సుప్రభాతం, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ జ్యోతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించ బడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VZM: గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం చినకాద గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. శిదిలిమైపోయిన విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా ఇంటిపైకి కూలిపోయినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త విద్యుత్ స్తంభాన్ని వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజల కోరుతున్నారు.
VSP: యారాడ తీరంలో ప్రతిపాదిత జెట్టీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. జెట్టీ వల్ల సముద్రపు అలల మార్పుతో ఉప్పునీరు పంట భూముల్లోకి చేరి వ్యవసాయం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోర్టు కాలుష్యం, సముద్ర కోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు.
W.G: భీమవరం పట్టణంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నారు. ప్రతిరోజూ ఉదయం యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చని వివరించారు.
ATP: గుత్తి RS లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్లో 2001లో టెన్త్ క్లాస్ చదువుకున్న విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరుతో ఆదివారం కలుసుకున్నారు. శ్రీ సునామ జకినీ మాత ఆలయంలో పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. తమ చిన్ననాటి మిత్రులతో సరదాగా గడిపారు.
ELR: నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సూర్య ఫలకాల గ్రిడ్ అనుసంధాన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. సౌర శక్తిని వినియోగించుకునేందుకు ప్రపంచ దేశాలు పోటీలు పడుతున్నాయని అన్నారు. సోలార్ వినియోగంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకి సూచించారు.
KDP: అగ్రహారం గ్రామంలో హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి సంఘటన వివరాలు తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఖర్చులు, చదువు కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ, కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు.
కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రామచంద్రపురంలో ఆదివారం ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలను, నిల్వలను అరికట్టడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
GNTR: తెనాలిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన తిరుప్పావడ సేవను ఆదివారం శ్రీ విఖనస శ్రీనివాస్ ట్రస్ట్ అంగరంగ వైభవంగా నిర్వహించింది. స్థానిక బాలాజీరావుపేటలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
BPT: ఒంగోలులో జరిగిన కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభల్లో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ ఐక్యత, అభ్యున్నతికి యువత ముందుండాలని అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా నేతలు కృషి చేయాలని చెప్పుకొచ్చారు.
CTR: శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకం ఎస్ఆర్ పురంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు చెక్కుడు కుప్పం షణ్ముగం రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో ఒంటరి మహిళలే లక్ష్యంగా సాగుతున్న వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. రామచంద్రాపురం కేసులో పట్టుబడ్డ పి. విశ్వనాథ్ అసలు పేరు ఎ.ఎం. అజీజ్‌గా గుర్తించారు. 2018లో తప్పించుకున్న ఇతడు, మూడు రాష్ట్రాల్లో ఏకంగా 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితుడి నుంచి రూ. 21.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PPM: దళిత గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఉత్తరాంధ్ర దళిత జేఏసీ మెంబర్ పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బత్తిన మోహన్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై, అట్రాసిటీ యాక్ట్‌పై పార్వతీపురం పట్టణంలోని గిరిజన భవన్లో సెమినర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి. చిట్టిబాబు పాల్గొని, అవగాహన కల్పించారు.
SKLM: పొందూరు(M) రామదాసుపురంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ జోక్యం చేసుకోవడంతో విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. గ్రామంలో కొత్త ట్రాన్స్ఫార్మర్, 8 విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ఆదివారం పూర్తయ్యాయి. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.