• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి: ఎస్సై

NDL: ఉయ్యాలవాడలో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్సై రామిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఇవాళ, రేపు గ్రామానికి నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల కోసం 4 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ నుంచి ఉయ్యాలవాడ మీదుగా JMD, KKL వెళ్లే వాహనదారులు దొర్నిపాడు మీదుగా వెళ్లాలన్నారు.

April 28, 2026 / 08:12 AM IST

విశాఖలో ఎగిసిపడుతున్న నిమ్మకాయ ధరలు

VSP: విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు మంగళవారం స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. టమాటా రూ.37, ఉల్లిపాయ రూ.17, బంగాళదుంప రూ.12గా ఉన్నాయి. వంకాయ రూ.30, మిర్చి రూ.28, కాకరకాయ రూ.48, మునగకాడలు రూ.42 పలుకుతున్నాయి. ఇతర కూరగాయలు సాధారణంగా లభిస్తుండగా, నిమ్మకాయ ధర మాత్రం రూ.180కు చేరి వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది.

April 28, 2026 / 08:10 AM IST

వడదెబ్బతో 18 పొట్టేళ్లు మృతి

సత్యసాయి: కదిరి మండలం చిగురుమంతాండ పంచాయతీ పరిధిలోని చిగురుమామి తండాలో విషాదం చోటుచేసుకుంది. బి. రవి నాయక్‌కు చెందిన 18 పొట్టేళ్లు ఒక్కసారిగా మృతి చెందాయి. తీవ్ర ఎండలు, వడదెబ్బతో పాటు మందు ప్రభావం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనతో రైతు కుటుంబంలో దుఃఖం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 28, 2026 / 08:07 AM IST

త్వరలో తిరుమలలో బిగ్ క్యాంటీన్ల ప్రారంభం

TPT: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేసి భక్తులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశించారు. నిర్ణయించిన ధరలకే ఆహారం విక్రయించాలని, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

April 28, 2026 / 08:05 AM IST

తాడిపత్రిలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

ATP: తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డితో కలిసి కడప-అనంతపురం ప్రధాన రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పాటు ప్రయాణికుల వివరాలను ఆరా తీశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

April 28, 2026 / 08:04 AM IST

ఘనంగా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

ELR: లింగపాలెం మండలం రంగాపురంలోని చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో విశ్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

April 28, 2026 / 07:56 AM IST

నేడు డోన్‌లో మాజీ మంత్రి ప్రెస్ మీట్

NDL: కృత్రిమ ఇంధన కొరత అంశంపై ఇవాళ ఉ. 10 గంటలకు డోన్ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై బుగ్గన మాట్లాడతారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.

April 28, 2026 / 07:54 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ జరిమానా

తిరుపతి పట్టణంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 20 మంది పట్టుబడ్డారు. వీరికి కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల జరిమానా విధించిందని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని, మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని పోలీసులు హెచ్చరించారు.

April 28, 2026 / 07:40 AM IST

‘ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం’

SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి జి సిగడం M సంత వూరిటీ లో MLA పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని , రూ.1.55 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులు నాయకులు ఉన్నారు.

April 28, 2026 / 07:38 AM IST

పేకాట శిభిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

KRNL: ఆదోని మండలం కుప్పగల్ దర్గా సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పెద్ద తుంబలం ఎస్సై విద్యా శ్రీ అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం జరిపిన దాడిలో నిందితుల వద్ద రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. జూదగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

April 28, 2026 / 07:27 AM IST

అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తికి జైలు శిక్ష

ప్రకాశం: సింగరాయకొండలో అక్రమంగా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2024లో సోమరాజు పల్లి చెందిన కొండయ్య సింగరాయకొండలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టు పడ్డాడు. అప్పటి నుంచి విచారణ చేపట్టిన కోర్టు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించింది.

April 28, 2026 / 07:21 AM IST

విజయ్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

PLD: నరసరావుపేటలోని విజయ్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన నాణ్యత, కొలతల సక్రమతపై పరిశీలించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశిస్తూ, వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 28, 2026 / 07:17 AM IST

‘ఇంధన కొరతతో రైతులకు ఇబ్బంది పడుతున్నారు’

BPT: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజులుగా తీవ్రమైన డీజిల్ కొరత నెలకొందని, దీనివల్ల అంబులెన్స్‌లు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

April 28, 2026 / 07:14 AM IST

పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 98 ఫిర్యాదులు: కలెక్టర్

CTR: నగరి నియోజకవర్గం నిండ్రలో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 98 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు 16, భూములకు 36, పోలీసు 11, పంచాయతీ రాజ్ 7, ఇంజినీరింగ్ 6, నగరి అడ్మినిస్ట్రేషన్‌పై 5 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

April 28, 2026 / 07:14 AM IST

కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ ఆర్థిక సాయం

తూ.గో: మరణించిన కానిస్టేబుల్ వెల్లా ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ రూ. లక్ష అంత్యక్రియల కోసం, వెల్ఫేర్ ఫండ్ నుండి రూ. 25 వేలు అందజేశారు. 2012 బ్యాచ్ కానిస్టేబుళ్లు రూ. 4.04 లక్షలు సేకరించి కుటుంబానికి అందించారు. క్లిష్ట సమయంలో సహచర సిబ్బంది చూపిన ఈ మానవత్వం ఆ కుటుంబానికి కొండంత భరోసాను ఇచ్చింది.

April 28, 2026 / 07:14 AM IST