KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం వేముల మండలం పెండ్లూరుకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రఘునాథరెడ్డి వారికి పార్టీ జెండాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం బీటెక్ రవి చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.
NDL: బేతంచెర్ల చౌడేశ్వరి మాత కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా మ్యాట్‌పై నిర్వహిస్తున్న ఈ పోటీలకు 30 జట్లు హాజరయ్యా యి. మాజీ ఎంపీటీసీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వీటిని ప్రారంభించారు. యువకుల కేరింతలు, ఈలల మధ్య కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.
BPT: బాపట్లలోని ఏబీఎన్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్, మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. జిల్లా అధ్యక్షుడు నాగార్జున ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. రాధాకృష్ణ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయగా, ఈ ర్యాలీని ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్లు వారు తెలిపారు.
KRNL: ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన యూకే సుహాసిని ఇవాళ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందిస్తూ, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని కోరారు.
SKLM: అరసవిల్లి -కాజీపేట శ్రీ ఆసిరిమ్మ తల్లి సిరిమాను పండగల నిమిత్తం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావుకి బుధవారం వినతి పత్రం అందజేశారు. పండుగలకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. తాగునీరు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్ తదితర అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అరసవల్లి అమ్మవారి కమిటీ సభ్యులు కోరారు.
TPT: ఈ ఏడాది తొలి మూడు నెలల్లో TTD ట్రస్టులకు రూ.374.24 కోట్ల రికార్డు విరాళాలు వచ్చాయి. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.149.55 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.66.18 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.37.12 కోట్లు లభించాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు మూలధనం రూ.2,556 కోట్లకు చేరిందని టీటీడీ అధికారులు తెలిపారు.
CTR: కార్వేటినగరం మండలం పద్మ సరస్సులో ‘మీ భద్రతే.. మా బాధ్యత’ కార్యక్రమంలో ఎస్సై తేజస్విని, ICDS అధికారులు పాల్గొన్నారు. కళాత్మక ప్రదర్శనతో బాల్య వివాహాలతో జరిగే అనర్దాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. చిన్న వయసులో పెళ్లి చేయడం తల్లి, బిడ్డకు మంచిదికాదని తెలిపారు.
AKP: అనకాపల్లికి మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థల పరిశీలన చేశారు. అచ్చయ్యపేట వద్ద పరిశీలించిన స్థలం అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
PPM : CMRF ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రి గుమ్ముడి సంద్యారాణి పేర్కొన్నారు. బుధవారం సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో CMRF నుంచి మంజూరైన రూ. 9,87,512 విలువైన 11 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు అండగా సీఎం సహాయనిధి ఉందని స్పష్టం చేశారు.
NDL: శ్రీశైలం జలాశయంలో బుధవారం ఉదయం నాటికి 42.6064 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. డ్యాం నీటిమట్టం 822.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎండల ప్రభావంతో రోజుకు సుమారు 303 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోంది.
కృష్ణా: జలవనరుల సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమం చేపట్టిందని కోడూరు డీసీ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం సందర్భంగా గ్రామంలోని మూడు పంచాయతీ చెరువులు పరిశీలించి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఈవో రాంబాబు పాల్గొన్నారు.
E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం SC, ST ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. SC, ST కుటుంబాల విద్యుత్ ఖర్చులు తగ్గించడం, స్వయం సమృద్ధిని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు.
ELR: నేటి యువకులు భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో బుధవారం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రేడ్ బిల్లుకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాడారని అన్నారు.
SKLM: పొందూరులోని మొదలవలస సచివాలయాన్ని బుధవారం ఎంపీడీవో వాసుదేవరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు ఫైళ్లను తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫైడ్ సర్వే, ఇంటి పనులు చెల్లింపు మొదలగు వివరాలను పరిశీలించి సిబ్బందికి నిర్దేశం చేశారు. ప్రత్యేక అధికారి పాలన విషయం గురించి చర్చించారు
KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామంలో నిర్వహించిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో MLA బీవీ పాల్గొన్నారు. చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమం 4 దశల్లో అమలవుతుందని, మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు, చివరి దశలో 5 రోజుల్లో రిపోర్టింగ్ ఉంటుందన్నారు