E:G: కొవ్వూరులో పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న డంపింగ్ యార్డులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెత్తకు తరచూ నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
శ్రీకాకుళం నగర సుందరీకరణే లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు సంకల్పించిన ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ లక్ష్య సాధనలో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
KDP: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565ల జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
CTR: రామకుప్పం (M) వీర్నమలకు చెందిన జ్యోతి-శివలింగం దంపతుల కుమారుడు నవీన్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అద్భుత విజయాన్ని సాధించాడు. నేపాల్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో నవీన్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. దీంతో పలువురు అతన్ని అభినందించారు.
TPT: హైకోర్టులో MBU ఛాన్సలర్ మోహన్ బాబుకు ఊరట దక్కింది. తిరుపతిలో విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ వ్యవహారంలో ఆయనపై తొందరపాటు చర్యలు వద్దంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు డైరీని తమ ముందు ఉంచాలన్న కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
NDL: బేతంచెర్ల ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని టీడీపీ నాయకులు కోరారు. అటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.
VZM: ప్రభుత్వ ఆదేశాల మేరకు మహత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి కార్యక్రమాన్ని ఏఫ్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పూలేకి నివాళులర్పించి, అనంతరం ఆడిటోరియంలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధిలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
పార్వతీపురం మండలం సూడిగంలో పాతబడిన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించాలని కోరుతూ అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణికి వినతిపత్రం సమర్పించారు. ఎంపీపీ మజ్జి శోభారాణి, వైసీపీ నాయకులు చంద్రశేఖర్ ఈ మేరకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కాకినాడ జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓటీపీ రాని సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలకు సమానంగా గ్యాస్ లోడ్ పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు శ్రీనివాసనగర్‌కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతుల కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్‌లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్ నీట మునిగి ఊపిరాడకు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ATP: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. అక్కడ భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
KRNL: 2025-26 ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ గడువును ఈ నెల 30 వరకు పొడగించినట్లు గురువారం నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత పన్నుపై రూ.100కి 5శాతం రాయితీ కల్పించినట్లు పేర్కొన్నారు.
PLD: రాజధాని పరిధిలోని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై నిన్న రైతులతో మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. కర్లపూడి, ఎండ్రాయి గ్రామాల్లో రైతులతో నేరుగా మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. రెండవ విడత ల్యాండ్ పూలింగ్‌పై రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
NDL: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఎదురుగా శుక్రవారం సీపీఐ చేపట్టనున్న రైతు ధర్నాకు అనుమతి లేదని సీఐ రమేశ్ బాబు తెలిపారు. మండలంలో 30 పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి ధర్నా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని ఆయన కోరారు.
NLR: ఉలవపాడు మండలం భీమవరం 33/11కేవీ సబ్ స్టేషన్‌లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. బద్దపూడి, రాజుపాలెం, కృష్ణాపురంలో మరమ్మతుల నిమిత్తం పవర్ సప్లయ్ కట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలని కోరారు.