PPM: ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా C-KYC ప్రక్రియ చెయ్యాలిని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు ఆయన సాలూరు డీసీసీబీ బ్రాంచ్‌ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించి, C-KYC ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. RBI మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా C-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
AKP: ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ త్వరితగతిన పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితి సవ్యంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ASR: జీకే వీధి మండలం సంకాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: పుంగనూరు సుబేదారి వీధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలను ఆదివారం స్వర్ణకార సంఘం వారు నిర్వహించారు. మొదట స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. మహోత్సవాలలో భాగంగా రాత్రికి స్వామి వారి ఊరేగింపు ఉంటుందని అర్చకులు చెప్పారు.
NDL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారిందని ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. గార్లపాటి మద్దులేటి స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్లాక్ మార్కెట్ పెరిగిందని విమర్శించారు. వెంటనే ఇంధన సరఫరా పెంచాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
కోనసీమ: ఆత్రేయపురం సెక్షన్ పరిధిలోని అంకంపాలెంలో ఆదివారం విధి నిర్వహణలో ఉన్న లైన్మెన్ కె.నారాయణ ప్రసాద్‌పై ఓ వినియోగదారుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తోటి సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోగా, తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు.
KRNL: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దిగువ కాలువలో నీటి ప్రవాహం తగ్గింది. ఈనెల 3న టీబీ డ్యాం నుంచి 3 వేలకుపైగా క్యూసెక్కుల నీరు విడుదల చేసినా, ప్రస్తుతం కర్ణాటక వాటా నిలిపివేయడంతో కేవలం 1100 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. హానవాళుకు చేరేసరికి ఇది 400 క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది.
SS: పెనుకొండలోని పరిటాల శ్రీరాములు పభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయప్ప తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉంటుందన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–35 ఏళ్ల వయసు గల వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
E G: ఎపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రధాని నరేంద్ర మోడీ 133వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విద్యార్థినులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని చర్చించే అంశాలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.3,73,823 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 212 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 24 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 2386 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.
KDP: నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ కోదండ రామాలయంలో రేపు నెల 2 తేదీన తెలుగు పద కవితా పితామహుడు, ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఆలయంలో అన్నమయ్య సంకీర్తనల పోటీలు నిర్వహిస్తారని, 2వ తేదీన సప్తగిరి సంకీర్తనల గోష్టి గానం ఉంటుందన్నారు.
ప్రకాశం: పీఎం ఈజీపీ స్కీంలో మంజూరైన కారును ఇవాళ మంత్రి స్వామి టంగుటూరు (M) నాయుడుపాలెం తన క్యాంపు కార్యాలయంలో మరిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు మేళం అనితకు అందజేశారు. కారు విలువ 10 లక్షలు ఉండగా, సబ్సిడీ 3,50,000 వస్తుందన్నారు. ఇందుకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
KRNL: ఆదోని పట్టణంలోని ఫారెస్ట్ లైన్ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వహకురాలు మీనాక్షి భాయి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, భజనలు జరిగాయి. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని నేలమట్టం వద్ద ఇవాళ బ్రహ్మం గారి 333వ ఆరాధన ఉత్సవాలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. రవ్వల కొండపైన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసి ప్రపంచానికి తెలియజేశారని భక్తులు కొనియాడుతూ ఉంటారు. బ్రహ్మంగారి నేలమటంలో ఉదయం నుంచి స్వామివారికి అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ATP: రాష్ట్రంలో బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆదివారం జరిగిన ‘బీసీ గళం’ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగన్ హయాంలో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారని గుర్తు చేశారు.