• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ద్వారపూడిలో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో పంగిడి చెరువు వద్ద ‘జలధార’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఏపీఐడీసీ ఛైర్మన్ లీలా కృష్ణతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు జలవనరుల సంరక్షణ పనులు చేపడతామని తెలిపారు.

April 6, 2026 / 09:20 PM IST

ఎమ్మెల్యేను కలిసిన ఎస్సై

ELR: తడికపూడి పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వల్లి పద్మ సోమవారం చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తడికలపూడి పోలీస్ స్టేషన్ చరిత్రలో ఒక మహిళ ఎస్సైగా రావడం విశేషమని అన్నారు. మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేయాలని, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని నిలువరించేందుకు కృషి చేయాలన్నారు.

April 6, 2026 / 09:17 PM IST

బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

CTR: బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు- మన జెండా” కార్యక్రమం భాగంగా ఎస్ఆర్ పురం మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు జల్లా జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 6, 2026 / 09:01 PM IST

CM వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సత్యసాయి: రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార – జలహారతి’ కార్యక్రమంపై CM చంద్రబాబు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, JC మౌర్య భరద్వాజ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 09:00 PM IST

కన్న కూతురిపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

ప్రకాశం: కొండపి మండలంలో గత సంవత్సరం కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 సంవత్సరాలు జైలు శిక్ష సోమవారం విధించింది. నిందితుడు అత్యాచారానికి పాల్పడి కూతుర్ని బెదిరించాడు. కూతురు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన న్యాయమూర్తి శైలజ రూ.7 వేల జరిమన జైలు శిక్ష వింధించారు.

April 6, 2026 / 09:00 PM IST

కుటుంబం ఆత్మహత్యపై సీపీఐ ఆగ్రహం

అన్నమయ్య: గాలివీడు మండలంలో అధిక వడ్డీ వేధింపుల కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీపీఐ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని సీపీఐ నేత సిద్దిగాళ్ల శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్డీ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని ఆయన కోరారు.

April 6, 2026 / 08:47 PM IST

నరసాపురంలో భారీ చోరీ

W.G: నరసాపురం పట్టణంలో సోమవారం భారీ దొంగతనం వెలుగుచూసింది. గంగులకుర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పది రోజుల క్రితం కుటుంబంతో కలిసి షిరిడీ వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.2.5లక్షల నగదు, 16 కాసుల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2026 / 08:46 PM IST

జిల్లాలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక

ELR: జిల్లాలో నీటి సంరక్షణ పనులు పూర్తిచేసేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి చెప్పారు. దెందులూరు మండలం సోమవరప్పాడులో సోమవారం స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతపై సమీక్షించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించేందుకి చర్యలు తీసుకుంటామన్నారు.

April 6, 2026 / 08:37 PM IST

‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి’

PPM: విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం పదో తరగతి నుండే స్పష్టమైన కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం శ్రీజన్ గ్లోబల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ‘కెరీర్ ఫెస్ట్ 2026’ ప్రదర్శనను విద్యార్థులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.

April 6, 2026 / 08:36 PM IST

ఆత్మకూరు ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా

NLR: ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట CPM, CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణ రెండవ వార్డు వెంకట్రావు పల్లిలో గిరిజనులకు శ్మశాన వాటిక, గృహ నిర్మాణం సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. CPM పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, CITU అధ్యక్షుడు నాగయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

April 6, 2026 / 08:30 PM IST

రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

ATP: యాడికి సమీపంలోని పెండేకల్ రిజర్వాయర్ వద్ద CM చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, ఉపాధి హామీ పనులపై కూలీలు, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో ఇస్తోందని, ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్ విధానంతో సాగు వ్యయం తగ్గుతోందని రైతులు హరికృష్ణ, దేవి వివరించారు.

April 6, 2026 / 08:30 PM IST

త్వరలోనే విజయవాడ గ్రేటర్ కావడం తథ్యం: ఎంపీ చిన్ని

NTR: ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే విజయవాడ గ్రేటర్ విజయవాడ కావటం తథ్యం అని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కేశినేని ఫౌండేషన్ ఆర్ధిక సహాయంతో విజయవాడ గాయత్రి నగర్లోని మరనాత ఆలయ ప్రాంగణంలో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్‌‌‌‌‌‌కు సంఘ ఉపయోగార్ధం అంతిమ యాత్ర వాహనాన్ని ఎంపీ సోమవారం అందజేశారు.

April 6, 2026 / 08:30 PM IST

‘రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం లక్ష్యం’

TPT: రెండేళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం తిరుపతి రామాపురం డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త నిర్వహణలో విఫలమైందని మంత్రి విమర్శించారు. 123 మున్సిపాలిటీలను చెత్తమయం చేశారని ఆరోపించారు. 2024 తర్వాత చెత్త తొలగింపుపై సీఎం చంద్రబాబు దృష్టిపెట్టారని తెలిపారు.

April 6, 2026 / 08:27 PM IST

నేర స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన హత్య ఘటనపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన వివరాలు తెలుసుకుని, దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. శాస్త్రీయ సాక్ష్యాలతో కేసును బలపరచి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 6, 2026 / 08:22 PM IST

తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన సీఐ

VZM: ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి ఆకస్మిక వాహన తనిఖీలు సోమవారం చేపట్టారు. ఈ తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్టేషనుకు తరలించారు. తల్లిదండ్రులను స్టేషనుకు పిలిపించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని సూచించారు.

April 6, 2026 / 08:21 PM IST