AKP: నీటి భద్రతకు సాగునీటి సంఘాలు బాధ్యత తీసుకోవాలని పాయకరావుపేట మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్ విజ్ఞప్తి చేశారు. సోమవారం శ్రీరాంపురంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలన్నారు. అలాగే, గేట్ల ఆధునీకరణ, పంట కాలువల మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
SKLM: నిర్దేశిత మెనూను అందజేయాలని ఐఐఐటీ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం డైరెక్టర్ ఐఐఐటీ మెస్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం తయారుచేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు అందజేసిన ఆహారంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళంలో శ్రీవీర అభయాంజనేయ స్వామి విగ్రహ స్థాపనకు భూమి పూజ సోమవారం ఘనంగా నిర్వహించారు. తోటపాలెం జంక్షన్ సమీపంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనంద్ రావు భూమి పూజ అనంతరం మాట్లాడుతూ.. దాతల సహకారం అవసరమని పేర్కొన్నారు.
VZM: కొత్తవలస, ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి నేరుగా వెళ్లి దరఖాస్తును స్వీకరించారు. తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. వారికి వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.
VZM: కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి నేరుగా వెళ్లి ఆయన దరఖాస్తును స్వీకరించారు. తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయనకు వీల్ చైర్ ఏర్పాటు చేయించారు.
కోనసీమ: కొత్తపేటలోని కమ్మిరెడ్దిపాలెం ప్రభుత్వ పాఠశాల సోమవారం కురిసిన వర్షానికి నీట మునగడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే నీటిలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన మురుగు నీటి వ్యవస్థ లేకపోవడంతో ప్రతి వర్షానికి పాఠశాల జలమయమవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
విశాఖ: అడవివరం పరిధిలోని 523, 524, 528 సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.
అనకాపల్లి: జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల జాతీయస్థాయి హాకీ పోటీలకు కోచ్‌గా ఎలమంచిలికి చెందిన హాకీ ప్లేయర్ ఈపు రవికుమార్ వ్యవహరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ సోమవారం తెలిపారు. ఆయన కడప జిల్లా పులివెందులలో ఖేలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రవికుమార్ ఆధ్వర్యంలో మహిళా హాకీ జట్టు సత్తా చాటుతున్నట్లు తెలిపారు.
GNTR: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ పరామర్శించారు. మంగళగిరి NRI ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆమె కలిసి ధైర్యం చెప్పారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మెరుగైన చికిత్స అందించాలన్నారు.
అల్లూరి: పాడేరులోని నన్నయ వర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే ‘తలాష్’ స్టేట్ లెవెల్ ఫెస్ట్ పోస్టర్‌ను ఇవాళ పడేరులో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది అద్భుత వేదికని ఆయన అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ డా.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
SKLM: శ్రీకాకుళంలోని గల శ్రీభూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 16వ వార్షికోత్సవ తిరుకళ్యాణ మహోత్సవం లో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వామివారి ని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో చేశారు. ఆలయం అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా మంగళవాయిద్యాలతో మార్మోగి ,ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
BPT: కర్లపాలెం మండలం యాజలి గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిగా జి.అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి బదిలీపై వచ్చిన ఆయన తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏట్రవారిపాలెం గ్రేడ్-2 కార్యదర్శిగా ఎం.చలపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్తుకూరు మండలం పంటపాలెం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
PLD: జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వివరించగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రకాశం: సంతమాగులూరులో హైస్కూల్ వెనకవైపు ఉన్న కర్ణ నాగిరెడ్డి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న కొద్దిపాటి బంగారన్ని తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. ఇంటియజమాని వైజాగ్‌లో నివాసం ఉంటారని స్థానికులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉంటుందని, ఎప్పుడో వచ్చి వెళ్తుంటారని అన్నారు.
అల్లూరి: బీజేపీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీఏసీఎస్ డైరెక్టర్ రీమల చంద్రరావు, గిరిజన మోర్చా జిల్లా నేత అరిమెల రాజు కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం (మన ఊరు మన జెండా) సందర్భంగా సోమవారం కొయ్యూరు మండలంలోని రత్నంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. దేశసేవ, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బీజేపీని స్థాపించారన్నారు.