KRNL: హొళగుంద మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. సాయిబన్న దర్గా వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి, సుమారు 23 మంది రాజకీయ నాయకులు, విలేకరులు, మహిళల ఫోటోలను భూమిలో పాతిపెట్టినట్లు బాధితులు ఇవాళ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ స్పందించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నెల్లూరులోని మిక్లిమ్స్ క్లబ్లో జిల్లాస్థాయి క్యారం బోర్డ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మొదటి స్థానం బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన కోఆప్షన్ నెంబర్ అల్లా బక్షు గెలిచారు. దీంతో నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించి కప్‌ను అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలవాలని వారు ఆకాంక్షించారు. యువత క్రీడలపై ముక్కువ చూపాలన్నారు.
TPT: వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో జారీ చేస్తున్న దర్శన టోకెన్లు గంటల వ్యవధిలో అయిపోతున్నాయి. ఫ్రీ దర్శనం కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు టోకెన్ల కోసం మరుసటి రోజు కోసం ఆగాల్సివస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జీల ధరలు ఎక్కువ కావడంతో చెట్ల కిందే నిద్రిస్తున్నారు.
ATP: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంపై అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. రాజధాని కల సాకారం చేసినందుకు రాష్ట్రపతి ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల సుదీర్ఘ త్యాగం, సహనం ఫలించిన చారిత్రాత్మక సందర్భమిదని ఆయన పేర్కొన్నారు.
VZM: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీవో కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వేసవిలో తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. మంచినీటి పథకాల మోటార్లు మరమ్మతులకు గురైతే 24 గంటల్లో బాగు చేయాలని వారికి ఆదేశించారు.
ASR: కొయ్యూరు మండలం బాలరాం ఏకలవ్య మోడల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి ఆసక్తిగల విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ కుమార్ ఇవాళ తెలిపారు. 7వ తరగతిలో 2సీట్లు (1బాలుడు, 1బాలిక), 8వ తరగతిలో 1సీటు (బాలుడు) చొప్పున 3సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎంపిక వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. నూతన కమిటీ ఎన్నికకు సంబంధించి కొంతకాలంగా ఆర్యవైశ్య సభ్యుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. అనుకోని విధంగా కోర్టు ఆదేశాలతో ఎన్నికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
విశాఖ వాణిజ్య పన్నుల శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్ల వసూళ్లతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని జాయింట్ కమిషనర్ పీబీ వల్లీ తెలిపారు. గత ఏడాది రూ.1,733.59 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.111.8 కోట్ల అధికంగా ఆదాయం నమోదైందన్నారు. బకాయిల వసూళ్లలో పురోగతి సాధించి, 2025 మార్చి నాటికి రూ.150.71 కోట్ల నుంచి 2026 మార్చి నాటికి రూ.158.59 కోట్లకు పెరగిందని వెల్లడించారు.
ప్రకాశం: పొన్నలూరు సమీపంలోని ఏటి ప్రాంతంలో సోమవారం సాయంత్రం కురిసిన ఆకాల వర్షానికి పిడుగు పడి చుండి శ్యామ్యూల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని మెరుగైన చికిత్స కోసం మంగళవారం ఒంగోలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు పేర్కొన్నారు.
కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధికారులు 528 ఆహార శాంపిల్స్ సేకరించారు. 50 శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో 68 మందికి నోటీసులిచ్చారు. ఆహార కల్తీపై 4 క్రిమినల్, 12 పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఆహార భద్రతా నియంత్రణ శాఖ అధికారులు రామచంద్ర, హరిత తెలిపారు. దుకాణాల లైసెన్స్, రెన్యువల్, పెనాల్టీల ద్వారా రూ.39,29,900ల ఆదాయం వచ్చిందన్నారు.
TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు నష్టపోయారని సీపీఐ నాయకుడు జనమాల గురవయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని ఇవాళ ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం కోబాక గ్రామంలో పంటలను పరిశీలించి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో ఇవాళ చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన, రుద్రాభిషేకం చేశారు. ప్రత్యేక వారంగా భావించి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు సౌకర్యాల కోసం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
PPM: సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి వెళ్లే తారు రహదారి పూర్తిగా ఛిద్రమైంది. కూడలి నుంచి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల మార్గం నామరూపాల్లేకుండా తయారైంది గ్రామస్థులు తెలిపారు. రాళ్ల కుప్పలు పరిచినట్లు మారిందన్నారు. నడిచి వెళ్తే కాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నాయని, వాహనాలపై వెళ్లా మంటే టైర్లు తరచూ పంక్చర్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
CTR: పెనుమూరు మండలం చిన్నకలికిరిలో విషాదం నెలకొంది. మునస్వామి కుమారుడు శేఖర్ (27) గ్రామ సమీపంలోని నీవా నది వద్ద ఉన్న పొలం దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. మార్గమధ్యంలో పెద్ద బావి ఉంది. నిన్న రాత్రి కాలి నడక బాటలో బైకుపై వెళ్తుండగా.. రాళ్లు తగిలి అదుపుతప్పి బైక్‌తో సహా బావిలో పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో బావిలోనే చనిపోయాడు.
CTR: పెనుమూరు మండలం చిన్నకలికిరిలో విషాదం నెలకొంది. మునస్వామి కుమారుడు శేఖర్ (27) గ్రామ సమీపంలోని నీవా నది వద్ద ఉన్న పొలం దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. మార్గమధ్యంలో పెద్ద బావి ఉంది. నిన్న రాత్రి కాలి నడక బాటలో బైకుపై వెళ్తుండగా.. రాళ్లు తగిలి అదుపుతప్పి బైక్‌తో సహా బావిలో పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో బావిలోనే చనిపోయాడు.