ప్రకాశం: టంగుటూరులోని కొండపి ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకువెళ్లింది. ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు కంటైనర్ లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లుగా లారీ డ్రైవర్ తెలిపాడు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూస్తారు.
ATP: కంబదూరు పాత ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని కాలి బిందెలతో ముట్టడించారు. కొంతకాలంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ దివ్యాంగుడికి తక్షణమే ఊరట లభించింది. గోరంట్ల మండలానికి చెందిన హుస్సేన్ పీరా మూడు చక్రాల సైకిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వెంటనే స్పందించారు. అక్కడికక్కడే బాధితుడికి ట్రై సైకిల్‌ను అందజేశారు.
PLD: నీటి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం సూచనలను ప్రజలు ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ప్రకాశం: పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరులోని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోస్టర్‌లను ఆవిష్కరించారు. చిన్నపిల్లల ఆరోగ్యానికి సమతుల్య ఆహారం అవసరమని, జంక్ ఫుడ్ తగ్గించాలని ఎమ్మెల్యే సూచించారు. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు సమయం కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో మహిత, సూపర్వైజర్ జ్యోతి పాల్గొన్నారు.
కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఎంపీలు భూపతి వర్మ, వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
KDP: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు టీ షాప్, కూల్ డ్రింక్స్ షాప్‌లలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుంచి మొత్తం 23 Old Admiral మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
CTR: కుప్పంలో అంబేద్కర్ జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని RTC బస్టాండ్ కూడలి, NTR విగ్రహం సమీపంలో 40 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ నడిబొడ్డున పండుగ వాతావరణం నెలకొంది.
కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించిన PGRSలో జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 152 ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.
అన్నమయ్య: పోలీస్ సబ్‌డివిజన్ నూతన డీఎస్పీగా బి. పావని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు ఎస్పీ ధీరజ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్రాఫిక్ నియంత్రణ, నేరాల అణచివేతపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు త్వరిత న్యాయం అందేలా కట్టుబడి పనిచేస్తానని డీఎస్పీ పావని తెలిపారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
NTR: విజయవాడలో IPL సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన నిఘా ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వీ. రాజశేఖర బాబు ఆదేశాలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై హైటెక్ నిఘా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రచారాలపై ట్రాకింగ్ జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
KDP: జమ్మలమడుగు(M) లింగాపురంకి చెందిన సుదీప్ ఆంజనేయపురం వద్ద కూలీ పని చేస్తుండగా స్టోన్ కటింగ్ మిషన్ అతని ఎడమ కాలిపై పడింది. దీంతో కాలుకి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న EMT రామ మునయ్య, పైలెట్ గురు మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేస్తూ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: పాడేరు మండలం కందమామిడి జీటీ డబ్ల్యూ బాలికల పాఠశాలలో ఇవాళ ప్రపంచ మొక్కల అభినందన దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోనసీమ: ఆలమూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది ఎస్.కె షరీఫ్ ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా చల్లా సతీష్, జాయింట్ సెక్రటరీగా గానుగుల శేషారావు, ఉపాధ్యక్షుడిగా కే. ధనరాజు, కోశాధికారిగా బి. విద్యా ప్రసన్నలు తమ ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
AKP: తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంటికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. పరవాడ ఎంఈవో కార్యాలయం వద్ద ఇవాళ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, హెచ్ఐఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యూటీ వంటి డిమాండ్ల సాధనకే ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు.