KRNL: మంత్రాలయం మండలం సూగురు గ్రామంలోని శ్రీ వీరలింగేశ్వర స్వామి, ఆసమండేశ్వర స్వామి దేవాలయ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించాలని గురువారం హిందూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థాన కమిటీ సభ్యులు గురుమూర్తి, జనార్ధన్ PSలో వినతి పత్రం అందజేశారు.
W.G: తణుకులో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారులు గురువారం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల నుంచి సుమారు 350 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
NDL: రుద్రవరం మండల నూతన తహశీల్దార్ నాగవీణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ధోని ఆల్ ఫ్రైడ్ నంద్యాల కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నియమితులైన నాగవీణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సేవలో ముందుంటానన్నారు.
ELR: కలిదిండి మండలం సంతోషపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: కేవీ పల్లి మండలం పరిధిలో పాత కక్షలు, గ్రామ ఆధిపత్య పోరుతో న్యాయవాది పూజారి యల్లయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిందితులు ముందస్తు పథకం ప్రకారం ట్రాక్టర్లతో దారిని దిగ్బంధించి, ఇంటిపై దాడి చేసి బండరాళ్లతో హత్య చేసినట్లు వెల్లడించారు.
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త మున్సిపల్ ఆఫీస్ సమీపంలో అమిలిపోగు అమ్ములు అనే మహిళ ఉరి వేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత మహిళ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PPM: వైసీపీ మహిళా పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కురుపాం నియోజకవర్గ నేతలు చినమేరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమినేతలకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందన్నారు.
VSP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. విశాఖకు చెందిన మాధవ్.. నగర సమస్యలతో పాటు హోం గార్డుల బదిలీలు, వృద్ధులకు ఆరోగ్య కార్డుల వినియోగంపై సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
VZM: గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురం, బోనంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, గోదాములను డీసీసీబీ ఛైర్మన్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… PACS సంఘాలు రైతులకు స్వల్ప, మధ్యకాలిక రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి బలంగా నిలవాలని సూచించారు. అలాగే, రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకి సూచించారు.
PPM: గుమ్మలక్ష్మిపురం ప్రభుత్వ పాఠశాలలో స్దానిక ఎమ్మార్వో, సెన్సస్ ఛార్ట్ ఆఫీసర్ నిమ్మక శేఖరం ఆధ్వర్యంలో గురువారం ఎన్యుమరేటర్స్‌కు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని సుమారు 57,000 జనాభా గణన కోసం 99 ఎన్యుమరేటర్స్, 17 మంది సూపర్‌వైజర్స్‌ను నియమించామన్నారు. వీరికి ఈనెల 23 వరకు జనగణనపై శిక్షణ ఉంటుందన్నారు.
ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 106వ జయంతి వేడుకలు కళ్యాణదుర్గంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగుల అభ్యున్నతికి ఫెర్రర్ చేసిన సేవలను కొనియాడారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించిందని ఆయన తెలిపారు.
PPM: కురుపాం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న సెన్సస్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ యస్వంత్ కుమార్ రెడ్డి సందర్శించారు. శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడి, సెన్సస్ ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, శిక్షణ విధానం, అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
TPT: ఆకలి లేని సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొనారు. అన్న క్యాంటీన్-ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముందడుగు అనే పోస్టర్‌ను జీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ జగదీష్‌తో కలిసి విడుదల చేశారు. ఆయన ప్రజలను మొబైల్ ఫోన్ల ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యులుగా ఉండమని ఆహ్వానించారు.
CTR: మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చిత్తూరు జిల్లా ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ నిత్యబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..18 సంవత్సరాలు పూర్తి కాని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి, పిల్లల భద్రతను ప్రధానంగా పరిగణించాలి అని ఆయన కోరారు.
CTR: మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు పూర్తి కాని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి, పిల్లల భద్రతను ప్రధానంగా పరిగణించాలి అని ఆయన కోరారు.