VZM: ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్దానిక సీతారామ సాగరం ఎంబనవలస వద్ద నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మట్టి తట్ట మోసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ… రాబోయే 100 రోజుల్లో చెరువుల పూడికతీత, కట్టల బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. బొంగరాలబీడు, డొంక రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇవాళ పర్యటించిన ఆయన, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
KRNL: ఇవాళ నుంచి జులై 14 వరకు జిల్లాలో ‘నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇవాళ కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.
ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి, నిర్ణీత సమయంలోపు సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ ప్రజలకు జీవీఎంసీ పలు సూచనలు చేసింది. స్వచ్ భారత్ మిషన్ ప్రకారం ఇండ్లలో చెత్తను నాలుగు భాగాలుగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను నీలం రంగు, సానిటరీ వేస్ట్‌ను ఎరుపు రంగు, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలను నలుపు రంగు డబ్బులో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.
KDP: మైదుకూరు హైవేపై వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి సూచించారు.
NDL: మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులతో నేరుగా మాట్లాడారు. ఆలయ ఏర్పాట్లు, దర్శనంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలిగేలా చూడాలని ఆదేశించారు.
అనకాపల్లి: యలమంచిలిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తులసి నగర్ భూలోకమాంబ ఆలయం వద్ద పిల్లా రమాకుమారి పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. దేశ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందని, అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దపు శివతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: యాడికి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ, డీఆర్డీఏ, గనులు, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.
ATP: యాడికిలో జరగనున్న జలధార కార్యక్రమానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీడిపల్లి నుంచి బీటీపీ కాలువకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నిధులను వీలైనంత త్వరగా మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రికి విన్నవించారు.
CTR: జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం భారీ సైకిల్ రేసు నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఋషికొండ వరకు సాగిన ఈ పోటీని వీసీ జీవీ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 10,000, ద్వితీయ బహుమతిగా రూ.5,000 ప్రకటించారు.
TPT: తిరుపతి రైల్వేకాలనీకి చెందిన శ్రీనివాసులు హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న తనపల్లి వద్ద శ్రీనివాసులు, హోంగార్డు మురళి మరికొందరు మద్యం తాగారు. ఈక్రమంలో హోంగార్డు గంజాయి సేవిస్తుండగా శ్రీనివాసులు వీడియో తీసినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులును హోంగార్డు అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బీరు బాటిల్‌తో పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది.
KDP: పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి చక్రాయపేట మండలంలోని 40 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నాయి. గ్రామాలకు నీటి సరఫరాకు రూ.3.46 లక్షలు, 24 హ్యాబిటేషన్లలో పశువుల తాగునీటికి రూ.12.81 లక్షలు, 16 చోట్ల అద్దె బావుల కోసం రూ.3.68 లక్షలు, 31 బోరు బావుల డీపెనింగ్ కోసం రూ.18.60 లక్షలు అవసరమవుతాయని RWS SE ఏడుకొండలు తెలిపారు.