• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిది పేదలకు వరం: MLA

KRNL: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. సోమవారం కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు తన కార్యాలయంలో రూ. 4,62,934 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదాలతో పాటు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని సీఎం చంద్రబాబు ఆదుకుంటున్నారని ఆయన అన్నారు.

April 27, 2026 / 01:11 PM IST

చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి

VZM: చెట్టుకు ఉరేసుకుని మృతిచెందిన ఘటన కొత్తవలస మండలం రామలింగాపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ నర్సునాయుడు ఆటో చోధకుడుగా కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రి ఎస్.కోట రోడ్డుకు అనుకొని ఉన్న గోదావరి లే అవుట్‌లో ఉరేసుకున్నాడని స్థానికులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 27, 2026 / 01:10 PM IST

మహిళా బిల్‌పై రాజకీయ వేడి.. ప్రతిపక్షాలపై శైలజా ఫైర్

గుంటూరులో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజా కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్ ప్రవేశపెట్టడం చారిత్రకమని, దాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం బాధాకరమన్నారు. డీలిమిటేషన్‌కు లింక్ పెట్టి బిల్లును నిలిపేశారని ఆరోపించారు. మహిళల రిజర్వేషన్ల కోసం ఏళ్ల పోరాటాన్ని గుర్తుచేశారు. అమరావతి అంశంపై వైసీపీ విమర్శలు సరికాదన్నారు.

April 27, 2026 / 01:07 PM IST

ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: MLA

SKLM: శ్రీ ముఖ లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఇవాళ జలుమూరు మండలంలోని ఉన్న శ్రీ ముఖలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు.

April 27, 2026 / 01:05 PM IST

పెట్రోల్ బంక్ వద్ద పరిస్థితిని పరిశీలించిన MLC

KDP: జమ్మలమడుగులో డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో MLC రామసుబ్బారెడ్డి JMD బైపాస్ కోవెలకుంట్ల రహదారిలోని ఓ పెట్రోల్ బంక్‌ను సందర్శించి వాహనదారులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని వెంటనే ఇంఛార్జ్ RDO శిరీషతో సెల్‌ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.

April 27, 2026 / 01:04 PM IST

రత్నగిరి సత్యదేవుని భక్తులకు తీపి కబురు

KKD: అన్నవరం అన్నదానంలో భక్తులకు ఇవాళ్టి నుంచి స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు EO నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. ఇటీవల జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వామివారి కళ్యాణం రోజైన సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం తక్షణమే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

April 27, 2026 / 01:00 PM IST

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కలెక్టర్

కోనసీమ: డీజిల్, పెట్రోల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం ఎస్పీ రాహుల్ మీనా, జేసీ లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని పెట్రోల్ బంకులు సాయంత్రం 7 గంటల లోగా సాధారణ స్థితికి వస్తాయన్నారు. వదంతులు నమ్మవద్దని సూచించారు. బంక్‌ల యజమానులతో మాట్లాడుతున్నామన్నారు.

April 27, 2026 / 12:54 PM IST

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

NDL: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు నిలిపివేశారు.

April 27, 2026 / 12:43 PM IST

‘కొఠియా గ్రామాల వివాదంపై సీఎం జోక్యం చేసుకోవాలి’

VZM: కొఠియా గ్రామాల వివాదంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. జిల్లా కార్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ముఖ్యమంత్రి చొరవ చూపకపోతే అమాయక గిరిజనులు నలిగిపోతారని తెలిపారు.

April 27, 2026 / 12:41 PM IST

క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఇదే

కోనసీమ: క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే స్వామిగా క్షణ ముక్తేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివలింగం చిన్నగా రుద్రాక్ష ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం అత్యంత పురాతన మైన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

April 27, 2026 / 12:39 PM IST

‘ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు’

PLD: చిలకలూరిపేటలో ఇంధన కొరత లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు స్పష్టం చేశారు. ఇవాళ పలు బంకులను ఆయన తనిఖీ చేసి, అన్ని బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని బంకుల యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రజలు అవసరమైన మేరకే ఇంధనం కొనాలని సూచించారు.

April 27, 2026 / 12:32 PM IST

దివ్యాంగులకు ప్రభుత్వం అండ: DRO

PPM: దివ్యాంగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా రెవిన్యూ అధికారి కే హేమలత అన్నారు. ఇవాళ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశం మందిరంలో అర్జీదారుల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. ఆ సందర్భంగా DRO మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం పథకాలు పెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 27, 2026 / 12:30 PM IST

‘బుద్ధ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి’

AKP: అనకాపల్లి నెహ్రూ చౌక్ కూడలిలో గల బుద్ధుని విగ్రహం వద్ద సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుద్ధ జయంతిని ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ సెలవు దినంగా ప్రకటించడం ద్వారా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చన్నారు.

April 27, 2026 / 12:30 PM IST

‘జిల్లాలో డీజిల్ అవసరాల మేర ఉన్నాయి’

ELR: డీజిల్ నిల్వల కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని కలెక్టర్ వెట్రి‌సెల్వి సూచించారు. జిల్లా ప్రజల అవసరాల మేర డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. బంకులలో డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోకుండా ఒకరోజు ముందుగానే ట్యాంకర్లను బుక్ చేయాలనీ సోమవారం బంకు యాజమాన్యాలకు సూచించారు. రబీ ధాన్యం తరలించే వాహనాలు, ఆక్వా కి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

April 27, 2026 / 12:21 PM IST

పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థి

GNTR: మంగళగిరిలో జరిగిన జిల్లా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో తెనాలికి చెందిన 9వ తరగతి విద్యార్థి వడ్డేపల్లి కార్తీక్ గౌరీనాధ్ సత్తాచాటాడు. 105 కేజీల సబ్‌జూనియర్ విభాగంలో 275 కిలోలు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఆల్‌రౌండ్ విభాగంలో కాంస్యాన్ని అందుకొని ద్విపతక విజయం నమోదు చేశాడు. ఈ మేరకు పలువురు అతన్ని అభినందించారు

April 27, 2026 / 12:21 PM IST