• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్

CTR: జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 11:46 AM IST

తిరుపతిలో మర్డర్.. ట్విస్ట్ ఇదే!

TPT: తిరుపతి రైల్వేకాలనీకి చెందిన శ్రీనివాసులు హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న తనపల్లి వద్ద శ్రీనివాసులు, హోంగార్డు మురళి మరికొందరు మద్యం తాగారు. ఈక్రమంలో హోంగార్డు గంజాయి సేవిస్తుండగా శ్రీనివాసులు వీడియో తీసినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులును హోంగార్డు అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బీరు బాటిల్‌తో పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది.

April 6, 2026 / 11:43 AM IST

పులివెందులలో ముంచుకొస్తున్న నీటి ఎద్దడి

KDP: పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి చక్రాయపేట మండలంలోని 40 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నాయి. గ్రామాలకు నీటి సరఫరాకు రూ.3.46 లక్షలు, 24 హ్యాబిటేషన్లలో పశువుల తాగునీటికి రూ.12.81 లక్షలు, 16 చోట్ల అద్దె బావుల కోసం రూ.3.68 లక్షలు, 31 బోరు బావుల డీపెనింగ్ కోసం రూ.18.60 లక్షలు అవసరమవుతాయని RWS SE ఏడుకొండలు తెలిపారు.

April 6, 2026 / 11:40 AM IST

నియోజకవర్గానికి రూ.604 కోట్ల కేటాయించాం: ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దిశగా నడిపిస్తోందని గుంటూరు పశ్చిమ MLA గళ్ళా మాధవి తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ పరిధికి రూ.604 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

April 6, 2026 / 11:33 AM IST

ఆదోనిలో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ

KRNL: ఆదోని పట్టణంలోని 35వ వార్డులో మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ స్థాపించి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచిన వెంటనే నియోజకవర్గంలో రూ. 10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్, మధుసూదన శర్మ, తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 11:33 AM IST

రక్షణ గోడలు లేక.. రాకపోకలు కష్టంగా

PPM: కొత్తూరు గ్రామం సమీపంలోని నాగావళి కుడి కాలువపై ఉన్న వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 100 ఎకరాల సాగుకు ఉపయోగపడుతున్న ఈ కాలువ వద్ద నుంచి పొలాలకు వెళ్లడం, పశువులను మేతకు తీసుకెళ్లడం కష్టంగా మారిందన్నారు.

April 6, 2026 / 11:31 AM IST

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

అన్నమయ్య: ఒంటరితనం భరించలేక సంబేపల్లె మండలం దుద్యాల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (25) ఉరివేసుకుని ఆత్మహత్య చేేసుకున్నాడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన మనస్తాపం చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2026 / 11:30 AM IST

గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రులు

SS: పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు మంత్రులు సవిత, భరత్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, SP సతీష్ కుమార్ పాల్గొన్నారు.

April 6, 2026 / 11:29 AM IST

వేములపాడుకు చేరుకున్న ముఖ్యమంత్రి

ATP: యాడికి మండలంలోని వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 11:08 గంటలకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

April 6, 2026 / 11:28 AM IST

టమాటా రైతుల కన్నీరు

PLD: చిలకలూరిపేట కావురులో టమాటా రైతులు కుదేలయ్యారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

April 6, 2026 / 11:26 AM IST

గుంతకల్లులో దారుణ హత్య

ATP: గుంతకల్లు పట్టణంలోని పాత శివాలయం వద్ద కుటుంబ కలహాల కారణంగా సోమవారం కృష్ణ అనే వ్యక్తిని లింగమయ్య అనే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి అతి దారుణంగా ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 11:26 AM IST

శ్రీశైలంలో రేపు అమ్మవారి వార్షిక కుంభోత్సవం

NDL: శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం రేపు జరగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో చండీ హోమం, కళ్యాణోత్సవం, ఏకాంత సేవ వంటి ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు నిలుపుదల చేశారు. రేపు ఉదయం స్వామి వారి ఆలయంలో సేవలు యధావిధిగా సాగిన, సాయంత్రం నుంచి సర్వదర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

April 6, 2026 / 11:25 AM IST

ఈనెల 8న మండల సర్వసభ్య సమావేశం: ఎంపీడీవో

KRNL: హాలహర్వి ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 8న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఇవాళ ఎంపీడీవో వరలక్ష్మి తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తమ శాఖల పనితీరు నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి సమావేశాన్ని జయప్రదం చేయాలన్నారు.

April 6, 2026 / 11:20 AM IST

ఉచితంగా సౌర విద్యుత్ సదుపాయం

KDP: ఖాజీపేట మండల ప్రాంతంలోని SC, ST వర్గాల వినియోగదారులకు ఉచితంగా సోలార్ విద్యుత్ కల్పించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని విద్యుత్ మండల ఇంజినీర్ నాగరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకం కింద ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా మిగిలిన మొత్తాన్ని AP ప్రభుత్వం ఇస్తుందన్నారు.

April 6, 2026 / 11:20 AM IST

శివరూపిణిగా పుంగనూరు మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీవిరుపాక్షి మారెమ్మ శివరూపిణిగా సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే అమ్మవారి మూల విగ్రహాన్ని అర్చకులు పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, విభూది, అడ్డ నామాల, పుష్పాలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున మారెమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.

April 6, 2026 / 11:18 AM IST