• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మార్కాపురం కలెక్టర్

ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి, నిర్ణీత సమయంలోపు సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 12:03 PM IST

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్

CTR: జీడీ నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 11:46 AM IST

తిరుపతిలో మర్డర్.. ట్విస్ట్ ఇదే!

TPT: తిరుపతి రైల్వేకాలనీకి చెందిన శ్రీనివాసులు హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న తనపల్లి వద్ద శ్రీనివాసులు, హోంగార్డు మురళి మరికొందరు మద్యం తాగారు. ఈక్రమంలో హోంగార్డు గంజాయి సేవిస్తుండగా శ్రీనివాసులు వీడియో తీసినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులును హోంగార్డు అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బీరు బాటిల్‌తో పొడిచి చంపేసినట్లు తెలుస్తోంది.

April 6, 2026 / 11:43 AM IST

పులివెందులలో ముంచుకొస్తున్న నీటి ఎద్దడి

KDP: పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి చక్రాయపేట మండలంలోని 40 గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొన్నాయి. గ్రామాలకు నీటి సరఫరాకు రూ.3.46 లక్షలు, 24 హ్యాబిటేషన్లలో పశువుల తాగునీటికి రూ.12.81 లక్షలు, 16 చోట్ల అద్దె బావుల కోసం రూ.3.68 లక్షలు, 31 బోరు బావుల డీపెనింగ్ కోసం రూ.18.60 లక్షలు అవసరమవుతాయని RWS SE ఏడుకొండలు తెలిపారు.

April 6, 2026 / 11:40 AM IST

కనిగిరిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రకాశం: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి స్ఫూర్తితో నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు.

April 6, 2026 / 11:39 AM IST

‘అనుమతులేని సెప్టిక్ ట్యాంక్ వాహనాలపై చర్యలు తీసుకుంటాం’

E.G: రాజమండ్రిలో అనుమతులు లేకుండా ప్రైవేట్‌గా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ యూనియన్ సభ్యులు సోమవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 6, 2026 / 11:38 AM IST

నియోజకవర్గానికి రూ.604 కోట్ల కేటాయించాం: ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి దిశగా నడిపిస్తోందని గుంటూరు పశ్చిమ MLA గళ్ళా మాధవి తెలిపారు. అన్ని హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ పరిధికి రూ.604 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

April 6, 2026 / 11:33 AM IST

కర్లపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

BPT: కర్లపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ శ్రీదేవి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు.

April 6, 2026 / 11:33 AM IST

ఆదోనిలో ఘనంగా బీజేపీ జెండా ఆవిష్కరణ

KRNL: ఆదోని పట్టణంలోని 35వ వార్డులో మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ స్థాపించి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఎమ్మెల్యేగా పార్థసారథి గెలిచిన వెంటనే నియోజకవర్గంలో రూ. 10 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహబూబ్, మధుసూదన శర్మ, తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 11:33 AM IST

రక్షణ గోడలు లేక.. రాకపోకలు కష్టంగా

PPM: కొత్తూరు గ్రామం సమీపంలోని నాగావళి కుడి కాలువపై ఉన్న వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 100 ఎకరాల సాగుకు ఉపయోగపడుతున్న ఈ కాలువ వద్ద నుంచి పొలాలకు వెళ్లడం, పశువులను మేతకు తీసుకెళ్లడం కష్టంగా మారిందన్నారు.

April 6, 2026 / 11:31 AM IST

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

అన్నమయ్య: ఒంటరితనం భరించలేక సంబేపల్లె మండలం దుద్యాల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (25) ఉరివేసుకుని ఆత్మహత్య చేేసుకున్నాడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన మనస్తాపం చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2026 / 11:30 AM IST

గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రులు

SS: పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు మంత్రులు సవిత, భరత్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, SP సతీష్ కుమార్ పాల్గొన్నారు.

April 6, 2026 / 11:29 AM IST

వేములపాడుకు చేరుకున్న ముఖ్యమంత్రి

ATP: యాడికి మండలంలోని వేములపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 11:08 గంటలకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

April 6, 2026 / 11:28 AM IST

టమాటా రైతుల కన్నీరు

PLD: చిలకలూరిపేట కావురులో టమాటా రైతులు కుదేలయ్యారు. టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

April 6, 2026 / 11:26 AM IST

గుంతకల్లులో దారుణ హత్య

ATP: గుంతకల్లు పట్టణంలోని పాత శివాలయం వద్ద కుటుంబ కలహాల కారణంగా సోమవారం కృష్ణ అనే వ్యక్తిని లింగమయ్య అనే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి అతి దారుణంగా ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 11:26 AM IST