ప్రకాశం: ముఠా కార్మికులకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. సోమవారం వెలిగండ్లలో ముఠా కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ నెల 17,18,19 తేదీలలో నంద్యాలలో జరగనున్న రాష్ట్ర సీఐటీయూ 17వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
AKP: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు నడవాలని ఎస్ రాయవరం మండలం కొరుప్రోలు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం కే ప్రసాద్ సూచించారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి చేశారన్నారు.
VSP: సూర్యబాగ్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వారోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రంధాలయ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు. సమానత్వం, మౌలిక హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. విద్యతో ముందుకు వెళ్లాలని పాఠకులకు పిలుపునిచ్చారు.
NDL: ఆత్మకూరు మండలం సిద్ధపల్లెలో సోమవారం వడదెబ్బ తగిలి నాగిరెడ్డి (85) అనే ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వృద్ధాప్యంలోనూ పనికి వచ్చిన నాగిరెడ్డి మరణం గ్రామంలో విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: కనెక్టివిటిని పెంచడం ద్వారా లాజిస్టిక్ హబ్‌గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం పరిధిలోని పెద్దపాడు దగ్గర చెన్నై – కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో కల్వర్ట్ నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 4 కోట్ల 64 లక్షల నిధులతో ఈ కల్వర్టు నిర్మిస్తున్నామన్నారు.
కడప జిల్లాలో ఎర్రగుంట్ల పరిధిలోని జువారి లేబర్ కాలనీలో పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో రికార్డులు లేని 16 ద్విచక్ర వాహనాలు, 8 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.
KRNL: హోళగుంద మండలం 8వ వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. 20 రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు సోమవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీవో విజయలలితను కలిసి తమ సమస్యలు వివరించారు. వస్తున్న నీరు కూడా మురికిగా ఉండటంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్వచ్ఛమైన నీరు అందించాలని డిమాండ్ చేశారు.
E.G: దేవరపల్లి మండలంలో సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించే దిశగా పచ్చి రొట్ట & నవధాన్యాల కిట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహింకారు. ఎర్నగూడెం శ్రీ వేణుగోపాల ప్రాధమిక పరపతి సంఘం ఆధ్వర్యంలో మొత్తం 500 నవధాన్యాల కిట్లు తయారు చేసి రైతులకు అందజేశారు. పచ్చి రొట్ట విధానం రైతులకు అనేక విధాలుగా ఉపయోగకరమని వారు తెలిపారు.
NLR: గుడ్లూరు MPDO కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గత మూడు నెలల అర్జీల వివరాలను పరిశీలించి పరిష్కారంపై అధికారులను ప్రశ్నించారు.
ATP: గుంతకల్లుకు చెందిన 9 ఏళ్ల బాలిక రుత్విక రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలకు ఎంపికయింది. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-9 చెస్ క్రీడా పోటీలలో విజేతగా నిలిచి సత్తా చాటినట్లు కోచ్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 18న తూర్పు గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు వెళ్లనున్నట్లు తెలిపారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని పలకరించారు. నాడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి, గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందన్నారు.
PLD: కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఆమె స్వయంగా విని, వారి నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కడప జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కడప తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్పను వీఆర్‌కు అటాచ్ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో ఒంటిమిట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నరసింహరాజును కడప తాలూకా నూతన సీఐగా నియమించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నరసింహరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
VZM: జిల్లాలో ఉన్న పది మండలాల్లో ఉన్న ఆరు ప్రభుత్వ పాఠశాలలు, నాలుగు ప్రైవేట్ పాఠశాలలు ఒక కేంద్రీయ విద్యాలయం కలిసి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ సర్వే నిర్వహించనున్నట్లు DEO మాణిక్యం నాయుడు సోమవారం తెలిపారు. మొత్తం పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు ఈనెల 16 నుంచి 18 వరకు ఈ సర్వే జరుగుతుందన్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులు , సిబ్బంది సర్వేని విజయవంతం చేయాలని కోరారు.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. బిస్కెట్ కలర్ షర్ట్, పాచి కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతడిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పలమనేరు పోలీసులు కోరారు.