• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కమిషనర్ సహా ఏడుగురిపై విచారణకు ఆదేశం..!

W.G: భీమవరం మున్సిపాలిటీలో నిధులు, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కమిషనర్ శ్యామలతో పాటు మరో ఆరుగురు అధికారులపై విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు అధికారులుగా ఆర్డీ నాగనరసింహారావు, ప్రస్తుత కమిషనర్ రామచంద్రారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. 2 నెలల్లోగా సమగ్ర విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోరింది.

April 22, 2026 / 10:44 AM IST

‘కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలి’

NTR: విజయవాడలో జరిగిన కొండపల్లి బొమ్మల పండుగ కార్యక్రమంలో సమాచార & పౌరసరఫరాల శాఖ మేనేజర్ విశ్వనాధ్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ నిన్న పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మలు మన గొప్ప వారసత్వానికి ప్రతీక అని అన్నారు. కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. కొండపల్లి కలకు కొత్త ఊపిరి లభించిందన్నారు.

April 22, 2026 / 10:37 AM IST

సింగపూర్‌లో రెండో రోజు పర్యటించిన మంత్రి

సత్యసాయి: సింగపూర్ అధికారిక పర్యటనలో భాగంగా రెండో రోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లిటిల్ ఇండియాలోని నలన్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి కే. షణ్ముగంతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరిపాలనా అంశాలు, ఇతర కీలక విషయాలపై చర్చించారు.

April 22, 2026 / 10:30 AM IST

YS జగన్‌కు వేదపండితుల ఆశీర్వాదం

KDP: పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని పండితులు ఆకాంక్షించారు.

April 22, 2026 / 10:21 AM IST

రామాపురంలో నేటి నుంచి మహాభారత యజ్ఞం

అన్నమయ్య: రామాపురం మండల కేంద్రమైన రామాపురంలో బుధవారం నుంచి 15 రోజుల పాటు మహాభారత యజ్ఞం నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యజ్ఞాన్ని హరికథ రూపంలో ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో మహాభారతాన్ని నాటక రూపంలో వేషధారణలతో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.

April 22, 2026 / 10:20 AM IST

రేపటితో ముగుస్తున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

NDL: మహానంది మండలంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తున్నట్లు మంగళవారం సూపర్వైజర్ కవిత తెలిపారు. ఆత్మకూర్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు మహానంది-2 అంగన్వాడి కార్యకర్త(OC), గాజులపల్లె-5 (BC-B), బుచ్చమ్మ తోట అంగన్వాడి ఆయా (ST), బసాపురం చెలిమ (OC)పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

April 22, 2026 / 10:15 AM IST

ప్రకృతి కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: GVMC

VSP: సింగల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకృతిని, మానవ జీవనశైలిని కలుషిత పరుస్తోందని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పక్షులు, జీవరాశులు, జలరాశులు రోగాల బారిన పడుతున్నాయన్నారు. ప్రజలు దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని, సముద్రపు జీవ రాశులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

April 22, 2026 / 10:13 AM IST

ఆగని ప్లాస్టిక్ కవర్ల వాడకం

GNTR: మంగళగిరిలో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వాడకం ఆగడం లేదు. 120 మైక్రాన్ల లోపు కవర్లు వాడొద్దన్న నిబంధనలు అమలుకావడం లేదు. వీటిని అమ్మితే రూ.2 వేల జరిమానా విధిస్తున్నా మార్పు లేదు. ప్రత్యామ్నాయంగా మార్కెట్లలో రూ.10కే జ్యూట్ బ్యాగ్ వచ్చే ‘ఎనీ టైం బ్యాగ్’ యంత్రాలను ఏర్పాటు చేశారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో జనం ప్లాస్టిక్‌నే వాడుతున్నారు.

April 22, 2026 / 10:10 AM IST

చిన్నారిని ముద్దాడిన YS జగన్

KDP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్య కర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సందర్భంలో ఓ చిన్నారి YS జగన్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో రావడం, దీనిని జగన్ గమనించి తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా చిన్నారిని పిలిపించుకొని ఆప్యాయంగా ముద్దాడారు.

April 22, 2026 / 10:09 AM IST

నువ్వు పంట సాగు లాభదాయకం

AKP: నువ్వు పంట సాగు లాభదాయకంగా ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీహరిరావు రైతులకు సూచించారు. మంగళవారం కసింకోట మండలం వెదురుపర్తిలో సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. నువ్వు పంట కోత అనంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 22, 2026 / 10:07 AM IST

కడపలో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో రహదారులపై పర్యటిస్తూ, లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లను ఆపి అలసట నివారణ కోసం నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 22, 2026 / 10:06 AM IST

డివైడర్‌ని ఢీ కొట్టి అంబులెన్స్ బోల్తా

ప్రకాశం: సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం ప్రైవేట్ అంబులెన్స్ డివైడర్‌ని ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఒకరికి గాయాలయ్యాయి. నిద్రమత్తుతో అంబులెన్స్ డ్రైవరు వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

April 22, 2026 / 10:05 AM IST

నాటు తుపాకులు అప్పగించాలి: ఎస్సై

ASR: డుంబ్రిగూడ మండల పరిధిలో లైసెన్సులు లేని నాటు తుపాకులు కలిగిన వారు తక్షణమే వాటిని పోలీస్ స్టేషన్‌కు వచ్చి స్వచ్ఛందంగా అప్పగించాలని ఎస్సై ఎల్. సురేష్ సూచించారు. లేనిపక్షంలో దర్యాప్తులో బయటపడితే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఎవరైనా నాటు తుపాకులు కలిగి ఉంటే స్వచ్ఛందంగా అప్పగించాలని తెలిపారు.

April 22, 2026 / 10:04 AM IST

ఎమ్మెల్యే కు స్వల్ప అనారోగ్యం , ప్రజా దర్బార్ రద్దు

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన రామభద్రాపురం మండలం నాయుడు వలసలో ఇవాళ నిర్వహించవలసిన ప్రజాదర్భార్ రద్దు చేసారు. ఆయన తీవ్రమైన త్రోట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతుండటంతో ఇవాళ జరగాల్సిన ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని MLA PRO కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

April 22, 2026 / 10:03 AM IST

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కలిశెట్టి

SKLM: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విజయావకాశాలపై చర్చించారు. యువత, మహిళలు ఎన్డీఏ వైపు ఉన్నారని ఎంపీ వివరించారు. తమిళనాడులోని తెలుగు ప్రజల్లో చంద్రబాబుకున్న ఆదరణ, బ్రాండ్ ఇమేజ్ చూసి గర్వపడుతున్నట్లు ఎంపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

April 22, 2026 / 10:01 AM IST