• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గిరిజన గురుకుల పనుల పరిశీలన

PLD: వినుకొండలో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల భవన పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. చెక్కవాగు వద్ద రూ.5 కోట్లతో ఈ భవనం నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.

April 28, 2026 / 04:23 PM IST

కొవ్వూరులో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నిరసన

E.G: రబీ కోతల సమయంలో యంత్రాలకు డీజిల్ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కొవ్వూరులో పెట్రోల్, డీజిల్ కొరతపై నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని మండిపడ్డారు.

April 28, 2026 / 04:20 PM IST

హాస్టళ్లను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

KRNL: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నెట్ జీరో, హెల్తీ క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలని ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సంక్షేమ, విద్యుత్, నెడ్ క్యాప్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఆదా, పునర్వినియోగ శక్తి, పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

April 28, 2026 / 04:20 PM IST

ఇంధన కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్

NLR: చేజర్ల మండలం ఆదూరు పల్లి బోడిపాడు వద్ద ఉన్న పెట్రోల్ బంకులను చేజర్ల తహసీల్దార్ మస్తానయ్య మంగళవారం తనిఖీ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఎక్కడైనా వాటిని పట్టకుండా వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తే కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

April 28, 2026 / 04:20 PM IST

పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

PPM: పాలకొండలోని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం, ఇంధనం దొరకక వాహనదారులు అల్లాడుతున్న వార్తలపై సబ్ కలెక్టర్ పవార్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సింగన్నవలస వద్ద గల బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని యజమానులను హెచ్చరించారు.

April 28, 2026 / 04:17 PM IST

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు: DIEO

కోనసీమ: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా డీఐఈవో చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 27తో ముగిసిన గడువును బోర్డు కమిషనర్ చివరిసారిగా పొడిగించారని, ఇకపై గడువు పెంచబోమని స్పష్టం చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ కాలేజీల ద్వారా వెంటనే ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు.

April 28, 2026 / 04:10 PM IST

చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం

ELR: పోతిరెడ్డి పల్లి గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, ఇతర నేరాలపై ఇవాళ ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అటువంటి పనులకు పాల్పడే తల్లిదండ్రులు, ఇతరులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

April 28, 2026 / 04:05 PM IST

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి

ప్రకాశం: మర్రిపూడి మండలం అయ్యవారిపాలెం గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కొండప నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. దెబ్బతిన్న రోడ్డు వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

April 28, 2026 / 04:03 PM IST

పెట్రోల్ బంక్ ఎదుట సీపీఐ నిరసన

NDL: డోన్ పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదుట ఇవాళ సీపీఐ జిల్లా కార్యదర్శి రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత మూడు రోజుల నుంచి పెట్రోల్ బంకులలో ఇంధనం లేకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధముగా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.

April 28, 2026 / 04:02 PM IST

ఆదోనిలో నేలకొరిగిన భారీ వృక్షం

KRNL: ఆదోని పట్టణ ఆర్టీసీ కాలనీలో ఇవాళ ఓ భారీ వృక్షం నేలకొరిగింది. మున్సిపల్ పార్కు వద్ద కూకటివేళ్లతో కూలిన చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆర్టీసీ కాలనీ, శ్రీనగర్, విట్టా కిష్టప్ప నగర్ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. వేసవి వేళ విద్యుత్ లేక చిన్నపిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికుల సమాచారం.

April 28, 2026 / 04:01 PM IST

కూలి డబ్బులు చెల్లించాలని ఆందోళన

E.G: దేవరపల్లి మండలం యాదవులలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అంకేం రామకృష్ణ అనే పొగాకు రైతు వద్ద పని చేసిన కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కూలీలు తమకు కూలి డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు చాకిరి చేయించుకుని ఎకనామం పెట్టాడని ఆరోపిస్తూ రైతు ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

April 28, 2026 / 04:00 PM IST

నిరసన బాట పట్టిన జర్నలిస్టులు

W.G: చిత్తూరు జిల్లా వి.కోటలో రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ ఆచంటలో ఇవాళ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 04:00 PM IST

‘ప్రజలను విముక్తులను చేయడానికే ప్రజాదర్బార్’

KDP: ప్రజలు పడుతున్న సమస్యల నుంచి విముక్తులను చేయడానికే ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. CM చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఇవాళ పులివెందుల TDP కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

April 28, 2026 / 04:00 PM IST

నీటి సరఫరా అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ సమావేశం

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పంచాయతీరాజ్, నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ… మంజూరు చేసిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అలా కాని పక్షంలో ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పనులు మంజూరు చేయుటకు తగు ప్రతిపాదనలు పంపాలన్నారు.

April 28, 2026 / 03:50 PM IST

ప్రత్తిపాడు అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గుంటూరు జడ్పీ హాల్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమై స్వర్ణాంధ్ర విజన్-2047పై చర్చించారు. మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడొద్దని, ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.

April 28, 2026 / 03:49 PM IST