• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేటితో ముగుస్తున్న ఫీజు చెల్లింపు గడువు: ఆర్ఐవో

KRNL: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇవాళే(సోమవారం) నేటితో గడువు ముగుస్తున్నట్లు ఆర్ఐవో లాలేప్ప ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపళ్లు ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు వెంటనే సమాచారం అందించి ఇవాళ ఫీజులు చెల్లించేలా చూడాలని సూచించారు. గడువు తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండదన్నారు.

April 27, 2026 / 06:42 AM IST

‘మార్కాపురంలో 16 పెట్రోల్ బంకులు’

మార్కాపురం మండలంలో 16 పెట్రోల్ బంక్‌లు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆదివారం తెలిపారు. పట్టణంలో 14, అందులో 3 బంక్‌లు పనిచేయట్లేదన్నారు. అలాగే మండల పరిధిలో 4 అవి రాయవరం, గజ్జలకొండ, చింతగుంట్ల, వేములకోటలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే అధికారులు పెట్రోల్, డీజిల్ కొరతపై అప్రమత్తమై, అన్నిచోట్ల పర్యవేక్షిస్తున్నారన్నారు.

April 27, 2026 / 06:39 AM IST

బహ్రెయిన్‌‌లో మృతి చెందిన యువతి

WG: ఉపాధి కోసం వెళ్లిన చోట ఓ యువతి విగతజీవిగా మారడంతో చిట్టవరంలో విషాదం నిండింది. గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (24) నాలుగు నెలల క్రితమే బహ్రెయిన్‌కు వెళ్లింది. అయితే, ఈ నెల 23న ఆమె తాను ఉంటున్న గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చేతికందిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

April 27, 2026 / 06:38 AM IST

నేడు పిఠాపురంలో ‘PGRS’ కార్యక్రమం

KKD: పిఠాపురం పాడా (PADA) కార్యాలయంలో సమస్యలపై ఇవాళ PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శివరామ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. రాలేని వారు వెబ్‌సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

April 27, 2026 / 06:34 AM IST

నేటి నుంచి పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాలు

నెల్లూరు: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను సోమవారం నుంచి నిర్వహించనున్నారు. మే మూడవ తేదీ వరకు స్వామివారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ నిర్వహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

April 27, 2026 / 06:26 AM IST

ఆక్వా రైతులకు ఊరట

WG: జిల్లాలో రాబోయే 48 గంటల పాటు ఎలాంటి విద్యుత్ కోతలు ఉండవని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి మళ్లీ ప్రారంభం కావడంతో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుందన్నారు. డీజిల్ కొరత లేదని, రైతులు ఆందోళనతో ముందే భారీగా డీజిల్ నిల్వ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

April 27, 2026 / 06:26 AM IST

‘నేటి నిరాహార దీక్షను విజయవంతం చేయండి’

PPM: ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల సాధనకై విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న నిరాహార దీక్షను ఇవాళ విజయవంతం చేయలంటూ ఫ్యాప్టో నేతలు కోరారు. దీనికి సంబంధించి ఈ నెల 25, 26 తేదీలలో నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయని మన్యం జిల్లా ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొంటారని తెలిపారు.

April 27, 2026 / 06:25 AM IST

అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభం

AKP: ఎస్ రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించారు. అలాగే అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రమణ్య స్వామి, తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శబరిమలై ఆలయ పూజారి రిజ్ కుమార్ పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

April 27, 2026 / 06:22 AM IST

పాయకరావుపేట సీఐ అప్పన్న బదిలీ

AKP: పాయకరావుపేట సీఐ అప్పన్న బదిలీ అయ్యారు. ఆయనను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఆదివారం డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సెప్టెంబర్‌లో అప్పన్న పాయకరావుపేట సీఐగా బాధ్యతలు చేపట్టారు. 19 నెలలు పాటు ఆయన ఇక్కడ సీఐగా పనిచేశారు. విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ అప్పన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న ఎస్ శంకరరావును సీఐగా నియమించారు.

April 27, 2026 / 06:21 AM IST

నేడు సంజామలలో PGRS: తహసీల్దార్

NDL: సంజామల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం తహసీల్దార్ చంద్రశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. PGRSలో వచ్చే ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని తహసీల్దార్ ఆదేశించారు.

April 27, 2026 / 06:20 AM IST

‘ప్రపంచానికి మన దేశం అందించిన గొప్ప సంపద యోగా’

VZM: భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదల్లో యోగా ఒకటి అని MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం రణస్థలం మండల పరిషత్ కార్యాలయంలో యోగ గురూజీ శ్రీ విశ్వప్రేమ్ సుహాస్ ఆధ్వర్యంలో 272 వ సహజీవన యోగ బ్యాచ్ ముగింపు వేడుకలలో ఆయన పాల్గొన్నారు. యోగ అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతౌల్యం సాధించే ఒక జీవన విధానమని తెలిపారు.

April 27, 2026 / 06:15 AM IST

పెళ్లి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోనసీమ: మలికిపురం మండలం మోరిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచి వస్తుండగా, గుడిమెల్లంక టి.సావరం జంక్షన్ వద్ద పేరాబత్తుల కొండలరావు (58) బైకును మరొక వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను 108లో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని SI సురేశ్ తెలిపారు.

April 27, 2026 / 06:15 AM IST

వారిపై చర్యలు తీసుకోవాలి: క్రాంతి నాయుడు

KRNL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు ఆరోపించారు. పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. కొరత వల్ల రవాణా నిలిచిపోతూ, నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే బంకులపై చర్యలు తీసుకోవాలన్నారు.

April 27, 2026 / 06:13 AM IST

శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు: డీఎస్పీ

SKLM: జిల్లాలో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వివేకానంద తెలిపారు. ఇవాళ ఉ. 9 నుంచి మ. 2 గంటల వరకు అరసవల్లి, శ్రీకూర్మం వెళ్లే వాహనాలను పెద్దపాడు మీదుగా గార రోడ్డుకు, గార నుంచి వచ్చే వాహనాలు పెద్దపాడు మీదుగా శ్రీకాకుళంలోకి ప్రవేశించాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

April 27, 2026 / 06:10 AM IST

అధిక లాభాలు ఆశ చూపి రూ. 53 లక్షలకు టోకరా

E G: ట్రేడింగ్ పేరిట ఓ మహిళ నుంచి రూ. 53 లక్షలకు మోసం చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు రాజమండ్రి 3 పట్టణ సీఐ అప్పారావు తెలిపారు. ఎస్సీ కాలనీకి చెందిన ఓ మహిళ ఆన్లైన్‌ వెబ్‌‌సైట్‌లో రూ. 100 పెట్టుబడి పెట్టగా రూ. 300 లాభం వచ్చింది. దీంతో ఆమె తన భూమిని అమ్మి రూ. 53 లక్షలకు పెట్టగా లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లో చూపినా తన ఖాతాలో జమ కాకపోవడంతో ఫిర్యాదు […]

April 27, 2026 / 06:10 AM IST