• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నిజాయితీ చాటుకున్న నూర్ మహ్మద్

SS: బస్సులో పోగొట్టుకున్న బంగారు నెక్లెస్, నగదు ఉన్న పర్సును తిరిగి అప్పగించి పెనుకొండకు చెందిన నూర్ మహ్మద్ నిజాయితీ చాటుకున్నారు. సోమందేపల్లికి చెందిన కృష్ణబాయి బస్సులో ప్రయాణిస్తూ రూ.1.90 లక్షల విలువైన నగలున్న పర్సు పోగొట్టుకోగా, దానిని గుర్తించిన మహ్మద్ పోలీసులకు సమాచారం అందించారు. సోమందేపల్లి SI సుధాకర్ యాదవ్ ఆ వస్తువులను బాధితురాలికి అందజేశారు.

April 10, 2026 / 09:13 PM IST

మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ

NTR: తిరువూరు మండలం చిట్టెల ప్రిన్సెస్ అఫ్ పీస్ చర్చిలో హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 20 మందికి కుట్టు మిషన్లు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ మినిస్ట్రీస్ సేవకులు పాస్టర్ డేవిడ్ రాజ్. పాస్టర్, ఎం. నెహెమ్య స్థానిక సంఘ కాపరి ఎం.పరిశుద్ధ రాజ్ పాల్గొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని వారు చెప్పుకొచ్చారు.

April 10, 2026 / 08:47 PM IST

వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో వెల్లమిల్లి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ శుక్రవారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వంగవీటి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

April 10, 2026 / 08:46 PM IST

‘ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి’

కడప: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేపట్టి ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని AISF, AIYF జిల్లా నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

April 10, 2026 / 08:45 PM IST

ఎస్పీ–సంపర్క్ ప్రారంభం.. సిబ్బందికి డైరెక్ట్ లైన్

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఎస్పీ–సంపర్క్” కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి శుక్రవారం 3 నుంచి 5 గంటల వరకు పోలీస్ సిబ్బంది 8688831470 నంబర్‌కు కాల్ చేసి సమస్యలు నేరుగా తెలియజేయవచ్చిని తెలిపారు. పోస్టింగులు, లీవులు, వెల్ఫేర్ వంటి అంశాలపై తక్షణ స్పందన కల్పిస్తామని ఎస్పీ అన్నారు.

April 10, 2026 / 08:44 PM IST

మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేసిన ఎంపీ

ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నలుగురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఎంపీ నిధుల నుంచి మంజూరైన ఈ వాహనాల తాళాలను లబ్ధిదారులు షేక్ నబీ సాబ్, హరినాథ్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనాథ్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి వాహనాలు అందించినందుకు లబ్ధిదారులు ఎంపీకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 08:44 PM IST

రోడ్డుమీద పారుతున్న మురుగునీరు

VZM: కొత్తవలస విజయనగరం ప్రధాన రహదారి బెల్లాల డాక్టర్ హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వచ్చే మురుగుకాలువ ఇవాళ కురిసిన వర్షానికి కాలువలో పేరుకుపోయిన చెత్త రోడ్డు మీదకు కొట్టుకువచ్చింది. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు రోడ్డుమీద ప్రవహించడంతో దుకాణంలో ఉన్న సరుకులు జలపాతం అవుతున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

April 10, 2026 / 08:41 PM IST

రౌడీ షీటర్లకు హెచ్చరిక జారీ చేసిన ఏఎస్పీ

అన్నమయ్య: రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే రౌడీ షీటర్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. మన్నూరు పోలీస్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో నేరప్రవృత్తిని విడిచి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.

April 10, 2026 / 08:36 PM IST

‘పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయండి’

W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 10, 2026 / 08:29 PM IST

వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం పొడిగింపు

అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ జీవోఎంఎస్ 43 జారీ చేసింది. ఈ పథకం ద్వారా అక్రిడిటెడ్, ఫ్రీలాన్స్, వేటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార అధికారి తెలిపారు.

April 10, 2026 / 08:28 PM IST

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ప్రకాశం: దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

April 10, 2026 / 08:28 PM IST

YCP అధికార ప్రతినిధి శ్యామలను కలసిన శీను

KRNL: ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను ఆ పార్టీ తుగ్గలి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చెక్క శీను శుక్రవారం హైదరాబాదులో కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శ్యామల ఆరా తీశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు శీను తెలిపారు.

April 10, 2026 / 08:26 PM IST

‘రేపు జిల్లాలో 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు’

శ్రీకాకుళం జిల్లాలో రేపు 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి, సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

April 10, 2026 / 08:20 PM IST

జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండండి.!

GNTR: జిల్లాలో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

April 10, 2026 / 08:20 PM IST

రక్తదానం చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

SS: పుట్టపర్తిలో జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిని ప్రోత్సహించారు. జేసీ స్ఫూర్తితో సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

April 10, 2026 / 08:20 PM IST