NTR: తిరువూరులో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హై కోర్ట్ జడ్జి చీకటి మానవేంద్ర రాయ్‌ను బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జనార్ధన రావు, కృష్ణా రెడ్డి కలసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటరెడ్డి, హేమంత్ కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.
SKLM: రాష్ట్రంలో ఇంధన కొరత ప్రభుత్వ అసమర్థత ఫలితమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మందస మండలం హరిపురం ఫ్లైఓవర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ లభించక వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారం రోజులుగా బంకుల వద్ద క్యూలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, M.Ed, MPEd, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు మంగళవారం వీసీ ప్రొఫెసర్ వెంకట బసవరావు తెలిపారు. మే 1 నుంచి జూన్ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. అటు, జూన్ 15వ తేదీన కళాశాలలు పునఃప్రారంభమవుతాయని ఈ మేరకు వీసి వెల్లడించారు.
ATP: గుంతకల్లు ఎంఈవో మస్తాన్ రావుకు PDSU విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై, ప్రైవేట్ టీచర్లను ఇంటింటా అక్రమ అడ్మిషన్లకు పంపిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AKP: అచ్యుతాపురం మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము తెలిపారు. ఈ మేరకు అచ్యుతాపురం మండల కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. 140వ అంతర్జాతీయ మేడే సందర్భంగా మండలంలో వాడవాడల పతాకావిష్కరణలు నిర్వహిస్తామన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులకు అండగా నిలిచి పోరాటాలు చేస్తామని తెలిపారు.
GNTR: రాష్ట్ర సచివాలయంలో చేనేత రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్కో షోరూమ్‌లలో అమ్మకాలు పెంపు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, సహకార సంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోలు వంటి విషయాలపై చర్చించారు. అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందజేయాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు.
NLR: ప్రభుత్వం హజ్ యాత్రికులకు రూ. లక్ష చొప్పున సబ్సిడీ ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,985 మంది యాత్రకు వెళ్లనున్నారు. నెల్లూరు నుంచి 160 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ ట్రాలీ సూట్ కేసులు, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించామని చెప్పారు.
KKD: పెద్దాపురంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ తుమ్మల పద్మజ, తహసీల్దార్ వెంకటలక్ష్మి తదితర అధికారులు పెట్రోల్ బంకులను స్వయంగా పరిశీలించారు. బంకుల్లో నిల్వలు, సరఫరా పరిస్థితిని సమగ్రంగా తనిఖీ చేశారు. బంకు యజమానులతో నేరుగా మాట్లాడిన అధికారులు నిల్వల వివరాలు, ట్యాంకర్ రాకపోకలపై సమాచారం సేకరించారు.
E.G: రాజమండ్రిలోని బాలాజీ నగర్, బొగ్గుల దిబ్బ, షిరిడీసాయి నగర్, శంభునగర్, సాయి కృష్ణ నగర్లో పార్కులను కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం సందర్శించారు. నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం కలిగేలా పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. త్రాగునీరు, టాయిలెట్లు, లైటింగ్, గేట్లు, వాకింగ్ ట్రాక్, గ్రీనరీ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు.
W.G: ఉపాధి హామీ శ్రామికులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు తలనొప్పిగా మారిన ఐరిష్ మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) చిన్నతాడేపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత విధానంలోనే మస్తర్ వేయాలని, అన్ని గ్రామాల్లోనూ పనులు కల్పించాలన్నారు.
NTR: రెడ్డిగూడెంలో గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ శిబిరం టీడీపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో కంప్యూటర్ ఆపరేటింగ్, మొక్కల పెంపకం, పుస్తక పఠనం, చదరంగం, యోగ, కథలు చెప్పడం వంటివి నిర్వహిస్తున్నామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిల్లలకు సూచించారు.
ATP: జిల్లా పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన నిలువలు ఆశాజనకంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇంధన సరఫరా పై కలెక్టర్, ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం 25% అదనంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.
KDP: జమ్మలమడుగు టోల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గండికోటకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న బాలుడితో సహా మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KRNL: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వక్ఫ్, ఎండోమెంట్ భూముల పరిరక్షణపై మంగళవారం కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత శాఖల అధికారులతో హై లెవెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రికార్డుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన ఇంజనీరింగ్ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.