• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఇంటి బిల్లులను చెల్లించాలి’

PPM: జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఇల్లు నిర్మాణం బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని గిరిజన సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్లాబులు పూర్తి చేసిన నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.

April 29, 2026 / 05:12 PM IST

అమ్మవారి సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షులు

SKLM: మెలియాపుట్టి మండలం గొల్ల బంజీరులో నిర్వహించిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేత మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

April 29, 2026 / 05:11 PM IST

ఉపాధి హామీ బకాయిల విడుదల

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం వేతన బకాయిలు విడుదల చేసింది. గత డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల కింద రూ.72.42 కోట్లు మంజూరు చేశారు. ఇందులో అల్లూరికి రూ.52.39 కోట్లు, పోలవరానికి రూ.20.02 కోట్లు కేటాయించారు. ఇవి రెండు మూడు రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి.

April 29, 2026 / 05:11 PM IST

‘ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయండి’

VSP: పెద్దవాల్తేర్ పెట్రోల్ బంక్ను జాయింట్ కలెక్టర్ విద్యా ధరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యంతో మాట్లాడి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బంక్లలో పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్ సరఫరా చేయాలని బంక్ యాజమాన్యానికి సూచించారు.

April 29, 2026 / 05:10 PM IST

దేహం విడిభాగాల కోసం గాలింపు

BPT: కర్లపాలెం మండలం నర్రావారిపాలెం పొన్నాల కాలువలో గుర్తుతెలియని మహిళ మొండెం లభ్యమైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం పలువురు ఎస్సైలు పడవ సాయంతో కాలువ వంతెన నుంచి సముద్రం వరకు జల్లెడ పడుతున్నారు. కాలువలో కేవలం మొండెం మాత్రమే దొరకడంతో, మహిళ తల, చేతులు, కాళ్ల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

April 29, 2026 / 05:07 PM IST

నెల్లూరుకు నంబర్- 1 ర్యాంకే లక్ష్యం: కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షలో నెల్లూరు నంబర్ 1 ర్యాంకు సాధించేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా వాహనాలకే అందించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేలా వార్డు సచివాలయాల ద్వారా అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

April 29, 2026 / 05:02 PM IST

‘బ్లాక్‌లో అమ్మితే క్రిమినల్ చర్యలు’

GNTR: ఇంధనాన్ని బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సాయికాంత్ వర్మ బుధవారం హెచ్చరించారు. జిల్లాలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఆందోళన పడొద్దని, అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్ విక్రయించొద్దని బంకుల యజమానులను ఆదేశించారు.

April 29, 2026 / 05:00 PM IST

ఆలమూరులో ధాన్యం రికార్డుల గందరగోళం

కోనసీమ: ఆలమూరు మండలంలో 1000 ఎకరాల్లో సాగైన బొండాల ధాన్యం, రికార్డుల్లో 70 శాతం సన్నాళ్లుగా నమోదు కావడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల బస్తాకు రూ.200 వరకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారుల తీరుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. తక్షణమే రికార్డుల్లోని లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారు.

April 29, 2026 / 05:00 PM IST

మార్చి 2027 నాటికి రీసర్వే పూర్తి: జేసీ

VZM: జిల్లాలో కొనసాగుతున్న రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్‌డీ‌వోలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మార్చి 2027 నాటికి ప్రక్రియను ముగించాలని తెలిపారు.

April 29, 2026 / 05:00 PM IST

‘ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించండి’

NTR: విస్సన్నపేట మండలం చండ్రుపట్లలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఉపాధి కూలీలను పని ప్రాంతంలో కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఫేస్ యాప్ తీసుకురావడం వలన చాలా ఇబ్బంది పడుతున్నామని కూలీలు తెలిపారు. అలాగే డబ్బులు రావడంలేదని, బడ్జెట్ నుంచి రూ.9 కోట్లు విడుదల చేయాలని కోరారు.

April 29, 2026 / 04:54 PM IST

చెత్త రహిత గ్రామాలుగా మారుస్తాం: ఎంపీడీవో

ATP: పామిడి గ్రామపంచాయతీలో బుధవారం స్వచ్ఛ పథకం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెత్త చెదారాన్ని జేసీబీ సహాయంతో శుభ్రపరిచారు. ఎంపీడీవో తేజోష్ణ మాట్లాడుతూ.. చెత్త రహిత గ్రామాలుగా మార్చడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వెయ్యవద్దని గ్రామ ప్రజలకు సూచించారు.

April 29, 2026 / 04:50 PM IST

ఒకరి మృతి.. ఇతను మీకు తెలుసా?

CTR: పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో బుధవారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉదయం నుంచి మద్యం మత్తులో పడి ఉన్న అతడిని లేపేందుకు స్థానికులు ప్రయత్నించినా స్పందించలేదు. తీవ్రమైన ఎండ దెబ్బ కారణంగానే మరణించి ఉంటాడని భావిస్తున్నారు. ఎస్సై లోకేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 29, 2026 / 04:47 PM IST

విలేకరి హత్యపై భగ్గుమన్న జర్నలిస్టులు

PLD: పలమనేరు ఏబీఎన్‌ రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి హత్యను నిరసిస్తూ కారంపూడిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అక్రమాలపై వార్తలు రాసినందుకే మాఫియా ఈ హత్యకు పాల్పడిందని మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

April 29, 2026 / 04:45 PM IST

‘ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దు’

SKLM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. ప్రజలు ఇటువంటి వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.

April 29, 2026 / 04:43 PM IST

నూతన కమిటీతో పార్టీ మరింత బలోపేతం: ఎమ్మెల్యే

ATP: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన నూతన జాతీయ, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి తోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె హాజరయ్యారు. నూతన కమిటీతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.

April 29, 2026 / 04:40 PM IST