• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి’

KDP: నగరంలో తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ రామన్నపల్లి, వాటర్ గంటి పంపింగ్ హౌస్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపింగ్ కేంద్రాల్లో నిర్వహణ పనులు, యంత్రాల పనితీరును కమిషనర్ సమీక్షించారు.

April 16, 2026 / 11:58 AM IST

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అక్కాచెల్లెల్లు

ELR: జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. స్థానిక కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న దేవలపల్లి వేద్య, దేవులపల్లి విద్య మంచి మార్కులు సాధించారు. వేద్య (అక్క) 444, విద్యకు (చెల్లి)కి 440 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా వారిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

April 16, 2026 / 11:58 AM IST

రేపు సత్యవేడులో ఎమ్మెల్యే పర్యటన

TPT: సత్యవేడు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చమర్తి కండ్రిగలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు సత్యవేడు వెలుగు కార్యాలయంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు.

April 16, 2026 / 11:42 AM IST

గురువారెడ్డికి నివాళులర్పించిన కేపీ

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం వాసి కర్నాటి గురువారెడ్డి బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి కంభం ఆసుపత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట ఎంపీపీ ఓసూర రెడ్డి, మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

April 16, 2026 / 11:40 AM IST

నిత్యాన్నదాన భవనానికి శంకుస్థాపన చేసిన MLA

W.G: భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనం పూర్తయితే రోజుకు సుమారు 2 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నాగభూషణం, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.

April 16, 2026 / 11:38 AM IST

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన వెంకటరామరాజు

NDL: టీడీపీ కమిటీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబుకు గురువారం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కలపటపు బుచ్చి రాంప్రసాద్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమితులైన విజయకుమార్, జ్యోత్స్న, రాష్ట్ర కార్యదర్శి లోహిత్ నియామకం హర్షణీయమన్నారు.

April 16, 2026 / 11:37 AM IST

పర్వీన్ భానుకు కీలక పదవి

సత్యసాయి: కదిరి మహిళ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ పర్వీన్ భాను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు పర్వీన్ భాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

April 16, 2026 / 11:37 AM IST

GST ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన పులివెందుల వాసి

KDP: పులివెందులకు చెందిన యువతి పి.మన్విత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి SSC, CGLఫలితాల్లో GST ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పట్టుదలతో శ్రమించి, ఈ ఘనత సాధించడంతో పట్టణంలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం NIT కలకత్తాలో బీటెక్ పూర్తి చేశారు. బంధుమిత్రులు ఆమె నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

April 16, 2026 / 11:36 AM IST

9వ వార్డులో పారిశుద్ధ్య పనులు

BPT: చీరాల పట్టణంలోని 9వ వార్డులో ప్రజల ఫిర్యాదుల మేరకు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలిసి వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేశారు. సాధారణంగా చేపట్టే విధంగా ఈ పనులను నిర్వహించి, వార్డులో శుభ్రతకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు తెలిపారు.

April 16, 2026 / 11:33 AM IST

బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ కోసం ర్యాలీ

CTR: పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ సాధన కోసం శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్జీవో హోమ్ నుంచి ఉదయం 9:30 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. నెహ్రూ సర్కిల్ వరకు సాగే ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

April 16, 2026 / 11:33 AM IST

డిగ్రీ కళాశాల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

కోనసీమ: అమలాపురం మండలం పేరూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విన్నా నరసింహ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఒకేషనల్, ఇంటర్ ఓపెన్ పరీక్షలలో పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ నియామకాల ప్రకారం తక్కువ ఫీజులతో జాయిన్ చేసుకుంటామని తెలిపారు. 

April 16, 2026 / 11:30 AM IST

ప్రతిష్టాత్మక విజయాలకు ఎమ్మెల్యే అభినందనలు

VZM: ప్రతిష్టాత్మక కోరుకొండ సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచిన AP Institutions-Master Minds School విద్యార్థులను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందన్నారు.

April 16, 2026 / 11:26 AM IST

చెరువులో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KDP: మైదుకూరు మండలం ఎర్ర చెరువులో హరిస్వర్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డ ఘటన ఇవాళ జరిగింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో చెరువులో దూకినట్లు సమాచారం. మత్స్యకారులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 11:25 AM IST

బహిరంగ మద్యపానంపై పోలీసుల హెచ్చరికలు

కడప: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై జమ్మలమడుగు పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు, కాలనీల్లో కొందరు బహిరంగంగా మద్యం తాగడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేరానికి పాల్పడిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అర్బన్ సీఐ నరేశ్ బాబు హెచ్చరించారు.

April 16, 2026 / 11:24 AM IST

రోడ్డు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం

KRNL: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

April 16, 2026 / 11:23 AM IST