• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి షాపు కూల్చివేత

W.G: ఆచంట మండలం కొడమంచిలిలో 6 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వెంకటస్వామికి సంబంధించిన షాపును పోలీసులు గురువారం జేసీబీతో కూల్చివేశారు. సోమవారం షాపు వద్దకు వెళ్లిన బాలికకు షాపు యజమాని వెంకటస్వామి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆచంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

April 10, 2026 / 06:41 AM IST

‘సీఎం చంద్రబాబుకు సినిమా చూపే సీన్ జగన్‌కు లేదు’

KRNL: సీఎం చంద్రబాబుకు సినిమా చూపే సీన్ జగన్‌కు లేదని గురువారం మంత్రి సవిత అన్నారు. ‘పాదయాత్ర కాకపోతే పొర్లుదండాలు పెట్టుకో. అమరావతి విషయంలో మూడు ముక్కలాట ఆడారు. అమరావతి మహిళలను ఇబ్బంది పెట్టారు. ఫిర్యాదులు చేయడం, పెట్టుబడులను అడ్డుకోవడం కొత్తేమీ కాదు’ అని ఈ మేరకు మంత్రి వ్యాఖ్యానించారు.

April 10, 2026 / 06:17 AM IST

మైనర్ డ్రైవింగ్‌పై 98 కేసులు నమోదు

ATP: జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొత్తం 98 కేసులు నమోదు చేసి, 97 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

April 10, 2026 / 06:16 AM IST

నేడు సామర్లకోటలో మంచినీటి సరఫరా నిలిపివేత

KKD: సామర్లకోట పట్టణంలో ఏప్రిల్ 10న తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఓ ప్రకటనలో తెలిపారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఒకరోజు ముందే నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితిని గమనించి సహకరించాలని కోరారు.

April 10, 2026 / 06:14 AM IST

పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి

KRNL: ఎమ్మిగనూరు(M) ఏనుగుబాల గ్రామానికి చెందిన వలస కూలీ పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటన పల్నాడు(D) సత్తెనపల్లి(M) కట్టవారిపాలెంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన పారే సురేశ్ (21) మిరపకాయలు తెంపే పనికి వెళ్లాడు. ఆకస్మికంగా కురిసిన ఉరుములు మెరుపుల వర్షంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు జగన్ తీవ్రంగా గాయపడ్డాడు.

April 10, 2026 / 06:13 AM IST

‘పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి’

KDP: పని భారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పులివెందుల ఆర్పీలు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మెప్మా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన వారు, నిరంతరం కొత్త నిబంధనలతో అధికారులు వేధిస్తున్నారని, పని ఒత్తిడి వల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

April 10, 2026 / 06:12 AM IST

‘గ్యాస్ పంపిణీలో పారదర్శక సేవలు అందించాలి’

ASR: నిత్యావసర సరుకులు, గ్యాస్ పంపిణీలో పారదర్శకమైన సేవలు అందించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన గురువారం జీ.ఎల్.పురం మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్, గ్యాస్ గోదాంలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

April 10, 2026 / 06:11 AM IST

అచ్చెన్న వ్యాఖ్యల పై భగ్గుమన్న వైసీపీ నేతలు

SKLM: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టెక్కలిలో గురువారం రాత్రి మంత్రి అచ్చెన్న దిష్టి బొమ్మను వైసీపీ నాయకులు దగ్ధం చేశారు. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు స్థానిక ఇందిరాగాంధీ కూడలి వద్ద మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. దీంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

April 10, 2026 / 05:42 AM IST

పేదల ఇళ్లల్లో సోలార్ వెలుగులు

PLD: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా పేదల ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపుతున్నామని ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. రొంపిచర్ల మండలంలో రూ.2.21 కోట్ల వ్యయంతో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సుబ్బయ్య పాలెంలో 77 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ ప్యానెల్ ప్రారంభించారు.

April 9, 2026 / 10:30 PM IST

బ్రహ్మంగారి మఠంలో తలనీలాల వేలం

KDP: బ్రహ్మంగారి మఠం దేవస్థానంలో తలనీలాల వేలం పాట గురువారం ఎండోమెంట్ ఆర్జేసీ (RJC) చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసింది. గతంలో కాంట్రాక్టర్ల సిండికేట్ కారణంగా మూడుసార్లు వేలం వాయిదా పడగా, నాలుగోసారి నిర్వహించిన ఈ వేలంలో అత్యధికంగా రూ. 87 లక్షలకు టెండర్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు శంకర బాలాజీ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

April 9, 2026 / 10:27 PM IST

వ్యవసాయంలో నూతన సాంకేతికతపై శిక్షణ

AKP: నర్సీపట్నం వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంలో నూతన సాంకేతికతపై శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. నూతన పద్ధతిలో నారు పెంపకం గురించి తెలియజేశారు. నారు పెంపకం 10 సెంట్లు చేసి 30 నుంచి 40 వేలు సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి శ్రీదేవి పాల్గొన్నారు.

April 9, 2026 / 10:20 PM IST

మురికి కూపంలా ప్రభుత్వ గ్రంథాలయం పరిసరాలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం చుట్టుపక్కల ప్రాంతం రోజురోజుకు మురికితో నిండిపోతూ, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తోంది. ప్రహరీ గోడ పక్కన చెత్త పారవేయడం వల్ల దుర్గంధం వ్యాపించి పాఠకులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చెత్త తొలగించి, భవిష్యత్తులో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

April 9, 2026 / 10:17 PM IST

రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి

SKLM: వైసీపీ కుటుంబ సభ్యులు, మహిళలపై ఏబీఎన్ అధినేత ఈ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌‌లో రాధాకృష్ణపై సీఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా నైతిక విలువలను పాటించాలని అన్నారు.

April 9, 2026 / 10:11 PM IST

సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు డిమాండ్

KRNL: ఆదోనిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని SFI నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇవాళ సమర్పించారు. ఎండ దెబ్బతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. బస్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.

April 9, 2026 / 10:07 PM IST

ఉయ్యూరు దంత వైద్యశాలలో దోపిడి

కృష్ణా: ఉయ్యూరులో ఓ ప్రైవేట్ దంత వైద్యశాలలో దోపిడీ జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక పన్ను పీకటానికి రూ.3 వేలు వసూలు చేస్తుండగా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మెడికల్ సేవల పేరుతో అధిక రుసుములు తీసుకుంటున్నప్పటికీ, రోగులకు సరైన సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

April 9, 2026 / 09:40 PM IST