• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చిన్నారులకు నూతన జీవితం అందించిన కలెక్టర్

ELR: అనాథలైన ముగ్గురు పిల్లలకు ఏలూరు కలెక్టర్ వెట్రి‌సెల్వి నూతన జీవితాన్ని అందించారు. కుక్కునూరుకు చెందిన ముగ్గురు పిల్లల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి వారిని వదిలేసి వెళ్లడంతో చిన్నారులు అనాథలయ్యారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న కలెక్టర్ బాల సంరక్షణ అధికారుల ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

April 7, 2026 / 05:43 PM IST

అమరావతికి మద్దతుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంబరాలు

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరావతికి మద్దతుగా సంబరాలు చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వర్ధిల్లాలని పలువురు అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.

April 7, 2026 / 05:40 PM IST

బొడ్డు వెంకటరమణ చౌదరికి అమ్మవారి చిత్రపటం బహుకరణ

E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామం శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం పాల్గొన్నారు. అమ్మవారిని ఎంపీ పురంధేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం బహుకరించారు.

April 7, 2026 / 05:40 PM IST

సోమందేపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం

సత్యసాయి: సోమందేపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. డాక్టర్ ఓంకార్ ఆధ్వర్యంలో ఆరోగ్యం కోసం కలసి కట్టుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా వంటివి తప్పక చేయాలని, మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని తెలిపారు. మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

April 7, 2026 / 05:40 PM IST

మాజీ సీఎంను కలిసిన వైసీపీ నేతలు

అన్నమయ్య: తాడేపల్లి YSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇవాళ పలువురు నాయకులు భేటీ అయ్యారు. మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, CEC సభ్యులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం పలు కీలక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

April 7, 2026 / 05:39 PM IST

రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తగ్గిన ఆదాయం

KDP: జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.18.80 కోట్ల ఆదాయం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇదే కార్యాలయంలో రూ.19.87 కోట్ల ఆదాయం వచ్చిన నేపథ్యంలో ఈసారి రూ.1.07 కోట్ల మేర తగ్గుదల కనిపించింది. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడం వంటి అంశాలే ఈ ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

April 7, 2026 / 05:36 PM IST

‘జగన్ పాలనలో మహిళలకు రక్షణ’

అనంతపురం వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాలనలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు.

April 7, 2026 / 05:30 PM IST

హజ్ కమిటీలో చోటు.. మైనారిటీల హర్షం

CTR: ఏపీ హజ్ కమిటీలో పలమనేరుకు చెందిన మౌలానా అబ్దుల్ అలీమ్ జూనెద్‌కు అవకాశం కల్పించడంపై మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ కేటగిరీలో సబ్ క్లాస్-3 కింద ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిఫారసుతో అవకాశం లభించిందని పేర్కొంటూ, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను మైనారిటీ సోదరులు సన్మానించారు.

April 7, 2026 / 05:26 PM IST

అవినీతిపై చర్యలు తీసుకోరా: ఐద్వా జిల్లా అధ్యక్షురాలు

WG: ఆకివీడు డ్వాక్రా సంఘాల్లో రూ. 2 కోట్ల అవినీతి జరిగిన అధికారులు స్పందించకపోవడం దారుణమని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి మంగళవారం ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం తగదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా గ్రూపు సభ్యులతో కలిసి జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

April 7, 2026 / 05:21 PM IST

చిలమత్తూరులో అభివృద్ధిపై బాలకృష్ణ సమీక్ష

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం చిలమత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా వేగంగా పనులు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

April 7, 2026 / 05:20 PM IST

మురమండ స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ ఎంపీడీవో

E.G: కడియం మండలం మురమండ గ్రామానికి పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో నీలం శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్ రావు, సొసైటీ చైర్మన్ వట్టికూటి జానకి రామయ్య దత్తుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేయాలని కోరారు.

April 7, 2026 / 05:20 PM IST

మహిళల వేధింపులకు జైలు శిక్ష

NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను వేధించిన పిన్నాపురం మనోహర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. దీబగుంట్లలో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు 296 బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రవికుమార్ శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

April 7, 2026 / 05:17 PM IST

పే స్కేల్ తగ్గింపుపై పంచాయతీ అధికారుల వినతి

VZM: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్‌ను తగ్గించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారులు సంఘం మంగళవారం కోరింది. G.O.Ms.No.91 ప్రకారం నిర్ణయించిన రూ.28,280 బేసిక్ పేను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లిమర్ల మండలానికి చెందిన అధికారులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.

April 7, 2026 / 05:15 PM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్

VZM: మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లిమర్ల మిమ్స్ నుంచి వేణుగోపాలపురం వరకు మంగళవారం వాక్‌థాన్ నిర్వహించగా సుమారు 100 మంది MBBS విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన కలిగించే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు పాల్గొన్నారు.

April 7, 2026 / 05:15 PM IST

మెనూ పాటించకపోతే చర్యలు: కలెక్టర్

PPM: మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. సాలూరు మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

April 7, 2026 / 05:14 PM IST